సోను సూద్ యొక్క ఆత్మకథ ‘ఐ యామ్ నో మెస్సీయ’!

0
17

*సోను సూద్ యొక్క ఆత్మకథ ‘ఐ యామ్ నో మెస్సీయ’!*

కొనసాగుతున్న కోవిడ్ -19 మహమ్మారి సమయంలో అవసరమైనవారికి సహాయం చేయడానికి అవిరామంగా మరియు నిస్వార్థంగా కృషి చేస్తున్న సోను సూద్ చాలా మంది హృదయాలను గెలుచుకున్నాడు. ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్న ఈ స్టార్ యాక్టర్ లాక్ డౌన్ లో వలస కార్మికులకు అతను చేసిన సహాయం దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును అందించింది. వారి సొంత పట్టణాలను సురక్షితంగా చేరుకోవడంలో సహాయపడటం ద్వారా ఒక గొప్ప పేరును కూడా పెట్టారు. ‘వలసదారుల మెస్సీయ’ అని ప్రతి ఒక్కరు పొగుడుతున్నారు. మెస్సియా అంటే కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి వచ్చిన ఒక గొప్ప వ్యక్తి అని అర్థం.

కొంతకాలం క్రితం, పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా సోను యొక్క ఆత్మకథ రాస్తున్నట్లు ప్రకటించింది, మహమ్మారి సమయంలో సోనూ అనుభవాలను అందులో వివరంగా ఉంటాయని అన్నారు. ఇక ఇప్పుడు ఆ పుస్తకానికి ‘ఐ యామ్ నో మెస్సీయ’ అని పేరు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పుస్తకాన్ని మీనా అయ్యర్ సహ-రచన చేస్తున్నారు.

ఈ విషయం గురించి సోనూ మాట్లాడుతూ, “ప్రజలు చాలా దయతో ఉన్నారు. నాకు ప్రేమగా మెస్సీయ అని పేరు పెట్టారు. కాని నేను మెస్సీయని కాదని నమ్ముతున్నాను. ఎందుకంటే నా హృదయం చెప్పేది నేను చేస్తాను. మనుషులుగా మన బాధ్యత దయతో ఒకరికొకరు సహాయం చేసుకోవడమే.

ఆ పుస్తకంలో అతను రక్షించిన వ్యక్తుల మనోగతాన్ని, చేపట్టిన మంచి పనులు యొక్క సారాంశాన్ని తెలుపుతుంది. సోనూ విన్న అనేక కథలను, పరస్పర చర్యలను బుక్ లో వివరిస్తారట. మరియు ఈ అనుభవం తన దృక్పథాన్ని మాత్రమే కాకుండా అతని జీవిత ఉద్దేశ్యాన్ని కూడా ఎలా మారుస్తుందో కూడా పంచుకుంటుందని అంటున్నారు. అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పుస్తకాన్ని ప్రత్యేకంగా ఆర్డర్ చేయవచ్చు. ‘ఐ యామ్ నో మెస్సీయా’ డిసెంబర్‌లో ఎబరీ ప్రెస్ ముద్రణ కింద విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here