ప్రముఖ‌ ఛాన‌ల్‌కు సీఈవో నీలిమ ఆర్య పై ఉన్న అభియోగాలు ఎంత‌ వ‌ర‌కు నిజం..?

0
353

*. ప్ర‌స్తుతం ఒక ప్రముఖ‌ ఛాన‌ల్‌కు సీఈవో గా ఉన్న నీలిమ ఆర్య పై ఉన్న అభియోగాలు ఎంత‌వ‌ర‌కు నిజం..?

* అస‌లు వేత‌నాల కోసం మొద‌లుపెట్టిన ధ‌ర్నా ఎండీ లోకేష్ జీ, నీలిమ ఆర్య పై ఎవ‌రు మ‌ళ్లించారు..? దీని వెనుక ఎవ‌రి కుట్ర ఉంది..? దీని వ‌ల్ల వారికి క‌లిగే లాభాలేంటి..?

* 2000 సంవ‌త్స‌రంలో దూర‌ద‌ర్శ‌న్ తో ప్ర‌స్థానం మొద‌లుపెట్టి రిపోర్టింగ్‌, యాంక‌రింగ్ ఇలా వివిధ డిపార్ట్‌మెంట్స్ లో బ‌హుముఖ ప్ర‌జ్ఞ చూపించింది.

* ఇంగ్లీషు లెక్చ‌ర‌ర్ గా, ప్రొఫెస‌ర్ గా కూడా చేసిన ఈమె అటు జ‌ర్న‌లిజాన్ని, ఇటు ఉపాద్యాయ వృత్తిని చాలా బ్యాల‌న్స్‌డ్ గా తీసుకెళ్లింది.

* సౌదీ అరేబియాలో ఒక‌మంచి జాబ్ దొర‌కాలంటే ఎన్ని క‌ష్టాలు ప‌డాలో అంద‌రికీ తెలుసు. అలాంటి అర‌బ్ కంట్రీలో గ‌వ‌ర్న‌మెంట్ యూనివ‌ర్సిటీ లో ఇంగ్లీష్ ప్రొఫెస‌ర్ గా అది కూడా తెలుగు వారికి అవ‌కాశం ద‌క్క‌డం చాలా అరుదు. మ‌రి ఏ అర్హ‌త లేకుండానే నీలిమ ఆర్య‌కు అక్క‌డి యూనివ‌ర్సిటీ ప‌ట్టం క‌ట్ట‌గ‌లిగిందా..?

* ఒక ఇంగ్లీష్ ప్రొఫెస‌ర్ గా చేసే నీలిమ ఆర్య‌కు ఏ అర్హత ఉంద‌ని ప‌లు ఇంజ‌నీరింగ్ కాలేజీలు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మించ‌గ‌లిగారు..?

* ఒక ప్ర‌ముఖ ఛాన‌ల్ లో క్రియేటివ్ హెడ్ గా భాద్య‌త‌లు స్వీక‌రించారు. ఏ అర్హ‌త లేకుండానే ఆమెకు అలాంటి హెడ్‌ ప‌ద‌విని ఇచ్చారా..?

* చాలా మంది నీలిమ ఆర్య జిల్లాల నుంచి డ‌బ్బులు వ‌సూల్ చేస్తుంద‌ని కొంత‌మంది రూమ‌ర్స్. అస‌లు విష‌యం రిపోర్ట‌ర్స్‌ స్వంత వ్యాపారాలు చేసుకుంటూ సంస్థ‌ను నాశ‌నం చేసే విధంగా చేయ‌టంతో వారిని టెర్మినేట్ చేయ‌డ‌మే నీలిమ ఆర్య చేసిన త‌ప్పిద‌మా..?

* ఎన్నో సంస్థ‌ల‌ను నడుపుతున్న కృష్ణాజీ, లోకేష్ జీ ఈ సంస్థ‌ను ఎలాగైనా గాడిన ప‌డేసి వాళ్ల‌ను సంర‌క్షించ‌డ‌మే వారు చేస్తున్న ప్ర‌య‌త్నం.

* దాదాపు 18 సంవ‌త్స‌రాల మీడియా అనుభ‌వం ఉన్న నీలిమ ఆర్య ని ఏ అర్హ‌త లేకుండా తీసుకున్నార‌ని ఛాన‌ల్ ఎండీ లోకేష్ జీ పై నింద‌లు..!

* కానీ ఈవ‌ర్గాలకు తెలియాల్సిన విష‌యం ఏంటంటే ప్ర‌ణాళిక బ‌ద్దంగానే నీలిమ ఆర్య ఎంట్రీ..?

* ఎలాగైనా ఛాన‌ల్ ను విజ‌య‌వంతంగా న‌డిపించాల‌నే త‌పన‌తో ఎండీ లోకేష్ జీ ప‌గ‌లు, రాత్రి క‌ష్ట‌ప‌డ‌టం చూసి అండ‌గా నిలిచిన సీఈవో మ‌రికంత‌మంది ఉద్యోగ‌స్తులు.

* ఎవ‌రైనా ప‌ని విష‌యంలో నిఖ్క‌చ్చిగా ఉండాల‌నుకుంటారు. మ‌రి అలా అనుకోవ‌డ‌మే ఆ ఛాన‌ల్ సీఈవో చేసిన త‌ప్పా..? ఉద్యోగ‌స్తులు టైంకి వ‌చ్చి ఎవ‌రి ప‌ని వారు చేసుకోండి అంటే త‌ప్పుప‌డ‌తారా..?

* నీలిమ ఆర్య వ‌చ్చాక సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ లు అని చెప్పుకుంటూ సంస్థ‌ను ఉపయోగించుకుని, బ‌య‌ట వ్యాపారాలు చేసుకుంటున్న వారిని ఆధారాల‌తో పంపించి వేయ‌డం నీలిమ ఆర్య మొద‌టి ప‌ని.

* గ‌త కొంత కాలంగా స్టూడియో ఎన్ మీద ఎంత పెట్టుబ‌డి పెట్టినా వృథా అయిన‌ప్ప‌టికీ, సంస్థ లో ఉన్న ఉద్యోగులు, వారి మీద ఆధార‌ప‌డ్డ వారు న‌ష్ట‌పోకూడ‌ద‌ని దాన్ని న‌డిపించుకుంటూనే వ‌స్తున్నారు. మ‌రి దాన్ని స‌వ‌రించ‌టానికి ఎండీ లోకేష్ జీ చేసిన ప్ర‌య‌త్నాల‌ను కొన్ని వ‌ర్గాలు ఎందుకు అడ్డుకుంటున్నారు..? దీని వ‌ల్ల వారి స్వంత వ్యాపారాలు ఏమైనా దెబ్బ‌తింటున్నాయా..?

* ఈ సంస్థ మీద‌, యాజ‌మాన్యం మీద, సంస్థ‌ను నిల‌బెట్టాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న ఉద్యోగ‌స్తుల మీద వ‌స్తున్న దుష్ప్ర‌చారాలు చేస్తున్న వ‌ర్గాల‌ స‌మ‌యం వృథా.
* ఎన్ని వ‌ర్గాలు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన స్టూడియో ఎన్ విజ‌యం త‌థ్యం త్వ‌ర‌లో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here