రివ్యూ: సుబ్రమణ్యపురం

0
49

‘సత్యం’ సినిమాతో మంచి లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని మనవడు సుమంత్.. ఆ తరువాత గౌరి, ధన51తో మాస్ హీరోగా గుర్తింపు పొందాడు. మాస్ హీరో ఇమేజ్ వున్నప్పుడే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘గోదావరి’లాంటి ఓ మంచి ఫీల్ గుడ్ మూవీలో నటించి విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్నారు. ఆ తరువాత హీరోయినాజన్ని పక్కనబెట్టి ‘గోల్కొండ హైస్కూల్’ చేసి హిట్టు సాధించారు. ఇలా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ.. క్రిటిక్స్ ను మెప్పిస్తున్నారు సుమంత్. ఆ మధ్య వచ్చిన విక్కీడోనర్ రీమేక్ ‘నరుడా..డోనరుడా’ చిత్రం కానీ.. ‘మళ్లీరావా’ చిత్రం గానీ.. ఇలాంటి డిఫరెండ్ కథల ఆదారంగా తెరకెక్కి ప్రేక్షకుల చేత మెప్పు పొందినవే. తాజాగా ఓ థ్రిల్లర్ మూవీ ‘సుబ్రమణ్యపురం’ చేశారు. ఈ చిత్రం ఈ రోజే విడులైంది. మరి ఏమాత్రం ఈ చిత్రం థ్రిల్ చేసిందో చూద్దాం పదండి.

కథ: నాస్తికుడైన ఆర్కియాలజిస్ట్ కార్తీక్(సుమంత్) పలు దేవాలయాల పరిశోధకునిగా పని చేస్తుంటుంటాడు. ఈ క్రమంలో ‘సుబ్రహ్మణ్యపురం’ అనే గ్రామంలో ఊహించని రీతిలో ఆత్మహత్యలు జరుగుతుంటాయి. అసలు అవి ఎందుకు జరుగుతున్నాయి. ఆ గ్రామంలో వున్న గుడి వెనుక ఉన్న రహస్యం ఏమిటి? దాన్ని పది రోజుల్లో ఛేదిస్తానని చెప్పిన కార్తీక్… దాన్ని ఛేదించారా? లేదా అన్నదే మిగతా కథ.

విశ్లేషణ: ఈ చిత్రం రానా వాయిస్ ఓవర్ తో టైటిల్స్ పడటంతోనే చిత్రంపై ఆసక్తిని రేపుతూ మొదలవుతుంది. ఈ చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఎంచుకున్న కథ కొత్తగా అనిపిస్తుంది. గ్రామంలో జరుగుతున్న సంఘటనల వెనుక ఉన్న రహస్యాన్ని చేధించేందుకు రాసుకున్న కథనం బాగుంది. అదే సమయంలో హీరో.. హీరోయిన్ల మధ్య ప్రేమకథను బాగా డీల్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో రాసుకున్న కొన్ని ట్విస్టులు.. సెకెండాఫ్ పై మరింత ఆసక్తిని పెంచేస్తాయి. ప్రతి నిముషం ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా వుంటే బాగుండు. కామెడీ సన్నివేశాలు పర్వాలేదు. సుమంత్, ఈషా రెబ్బ బాగా నటించారు. ఆర్కియాలజిస్ట్ గా సుమంత్ పాత్ర బాగుంది. ఈ చిత్రంలో మిగతా నటులు వారి పాత్ర మేరకు నటించి పర్వాలేదనిపించారు. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేశారు. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
సుమంత్ నటన
ట్విస్టులు
నేపథ్య సంగీతం
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్
ఎడిటింగ్
రేటింగ్: 3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here