‘సుబ్రహ్మణ్య‌పురం’లో నా పాత్ర కొత్త‌గా ఉంటుంది… సుమంత్

0
13

సెన్సిబుల్ హీరో సుమంత్, ఈషారెబ్బ హీరో హీరోయిన్లుగా, సుధాక‌ర్ ఇంపెక్స్

ఐపియ‌ల్ బ్యాన‌ర్ పై బీరం సుధాక‌ర్ రెడ్డి నిర్మాణంలో నూత‌న ద‌ర్శ‌కుడు
సంతోష్ జాగ‌ర్లపూడి రూపొందించిన చిత్రం .
సుబ్రహ్మణ్య‌పురం.ఈ నెల 7న గ్రాండ్ గా ప్రేక్షకులముందుకు రాబోతున్న ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు హీరో సుమంత్

కథ వినగానే చేయాలనే సినిమా చేయాలనిపించింది:
నేను ఎప్పుడూ కమర్షియల్ లెక్కలు వేసుకొను, అదే నా ప్లస్ అండ్ మైనస్ సుబ్రహ్మణ్య‌పురం కథ వినగానే చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. ఈ కథ నాకు కనెక్ట్ అయ్యింది. మళ్ళీ రావా తర్వాత రోమాంటిక్ స్టోరీస్ వస్తాయి అనుకున్నాను, కానీ అన్నీ థ్రిలర్స్ నా దగ్గరకు వచ్చాయి. ఈ స్టోరీ సిట్టింగ్ అప్పుడు నచ్చదు అనే మైండ్ సెట్ లోనే విన్నాను. సంతోష్ రెండున్నర గంటల నారేషన్ నన్ను ఎంగేజ్ చేసింది. అందుకే ఎలాంటి మార్పులు చేయకుండా కథ చేసాను.

కథలో అన్నీ నచ్చాయి:
సంతోష్ నాకు చెప్పినప్పుడు కొత్త దర్శకుడు కథ బాగా చెప్పాడు. అతని ఎలా తీయగలడు అనే సందేహాలుండేవి. కానీ అతను తీసిన షార్ట్ ఫిల్మ్ చూసాక నమ్మకం వచ్చింది. కథలో నా క్యారెక్టర్ అనే కాదు అన్నీ పాత్రలు బాగున్నాయి.

నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే:
ఇందులో కార్తిక్ హేతువాది, దేవుణ్ణి నమ్మడు కానీ, గుళ్ళ గురించి రీసెర్చ్ చేస్తుంటాడు. ఈ పాత్ర తో నా ట్రావెల్ నాకు కొత్త ఎక్స్ పీరియన్స్ లను అందించింది. ఈ పాత్ర కోసం నేనేమీ పెద్దగా కష్టపడలేదు కానీ పాత్ర లో కొత్తగా కనిపిస్తాను.నేను హీరో బిల్డప్ సీన్స్, ఎలివేషన్స్ మీద పెద్ద నమ్మకం ఉండదు. కానీ మహేష్, తారక్ సినిమాలకు వెళ్ళి విజిల్స్ వేస్తాను.

ఈషా రెబ్బ పాత్ర నాతో గొడవలు పడుతుంది:
నేను ఈ సినిమాలో హేతువాదిని, హీరోయిన్ సాంప్రదాయాలను గౌరవించే అమ్మాయి. వీరి మద్య కొన్ని వైరుధ్యాలుంటాయి. కానీ ఈరెండు పాత్రల మద్య ట్రావెల్ బాగుంటుంది.

స్ర్కిప్ట్ పరంగానే నడుచుకున్నాను:
ఇది క్యారెక్టర్ తో నడిచే సినిమా అయినా, మేము బలవంతగా ఇరికించలేదు. కథనంతో పాటు నిజాయితిగా అన్ని పాత్రలు నడుచుకుంటాయి.

రానా అవసరం అనిపించింది:
ఇందులో కొన్ని సన్నివేశాలకు బాగా తెలుగు పలక గలిగిన గొంతు అవసరం అయ్యింది. నాకు రానా మొదట ఆలోచనలోకి వచ్చాడు. రానా స్ర్కిప్ట్ విని వెంటనే ఒప్పుకున్నాడు. ఆ వాయిస్ కథనంకు బలంగా మారింది.

నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి గారి సపోర్ట్:
చాలా ఉంది. ఆయన పైనాన్షియర్ గా చాలా మంచి సినిమాలకు సపోర్ట్ గా నిలిచారు. ఈ కథను నిర్మించాలంటే గట్స్ ఉన్న నిర్మాతలు కావాలి అనిపించింది. ఇప్పడు ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. నాగా చైతన్య కూడా కలిసినప్పుడు అన్నాడు ‘ఎక్కడా చూసినా మీరే కనిపిస్తున్నారని’, చాలా సంతోషంగా ఉంది. అలాంటి ప్రొడ్యూస‌ర్ దొరికినందుకు.

తాత‌పాత్ర చేయ‌డం నా అదృష్టంః
క్రిష్ నాకు చాలాకాలంగా తెలుసు, తాత పాత్ర అన‌గానే ఒక బాద్య‌త‌గా తీసుకున్నాను. నేనే పెద్ద‌గా ఇమిటేట్ చేయ‌లేదు, తాత ఇంట‌ర్యూ లు చాలా చూసాను. ఇమిటేష‌న్ కి యాక్టింగ్ కి మ‌ద్య లో చేయ‌డానికి ప్ర‌య‌త్నించాను. బాల‌కృష్ణ‌గారితో పనిచేయ‌డం చాలా గొప్ప‌గా అనిపించింది.ఈసినిమా గురించి ఆయ‌న చెప్పిన మాట‌లు ఎప్ప‌టికీ గుర్తుండిపోతాయి.

సినిమాకి ఎంత గ్రాఫిక్స్ అవ‌స‌ర‌మో అంతే చేసాంః
సినిమా లో గ్రాఫిక్స్ కి స్కోప్ ఉంది. కానీ క‌థ ప‌రంగా ఎంత అవ‌స‌ర‌మో అంతే చేసాం. ఈసినిమా విజువ‌ల్ ఎఫెక్ట్స్ మొత్తం అన్న‌పూర్ణ టీం చేసింది. మీరు త‌ప్ప‌కుండా స‌ర్ ప్రైజ్ అవుతారు.

చెప్పిన దాంటో 90శాతం చేసాడు ద‌ర్శ‌కుడుః
ఈ క‌థ విన‌గానే చెప్పిన‌దాంట్లో 70 శాతం చేయ‌గ‌లిగితే స‌క్సెస్ అవుతాము అనుకున్నాం, కానీ ఫ‌స్ట్ కాపీ చూసాక ద‌ర్శ‌కుడు సంతోష్ 90 శాతం చేసాడు అనిపించింది. చాలా క్లారిటీ ఉన్న ద‌ర్శ‌కుడు.
ద‌ర్శ‌కుడు త‌ర్వాత గుర్తుకు వ‌చ్చేది శేఖ‌ర్ చంద్రేః
శేఖ‌ర్ చంద్ర ఈ సినిమాకు బ్యాక్ బోన్ అనుకోవ‌చ్చు. శేఖ‌ర్ ని నేనే ప్ర‌పోజ్ చేసాను. చాలా అద్బుతంగా మ్యూజిక్ అందించాడు. ఇందులో మూడు పాట‌లు చాలా బాగుంటాయి. అత‌ని వ‌ర్క్ గురించి అంద‌రూ మాట్లాడుకుంటారు.

హీరో: స‌మంత్,
హీరోయిన్ః ఈషారెబ్బ‌
ప్ర‌ధాన తారాగ‌ణంః సురేష్, సాయికుమార్, ఆలి, స‌త్య సాయి శ్రీనివాస్,
మిర్చి మాధ‌వి, సుర్య‌, ర‌ఘునాథ్ రెడ్డి, సారిక రామ‌చంద్ర‌రావు, జోష్
ర‌వి, బ‌ద్రం, గిరిధ‌ర్, అమిత్ శ‌ర్మ‌, టి.ఎన్.ఆర్.

సాంకేతిక వ‌ర్గంః

సినిమాటోగ్ర‌ఫిః ఆర్.కె. ప్రతాప్
ఎడిట‌ర్ః కార్తిక్ శ్రీనివాస్
సంగీతంః శేఖ‌ర్ చంద్ర‌
క్యాస్టూమ్ డిజైన‌ర్ః సుమ త్రిపుర‌ణ‌
ఫైట్స్ః డ్రాగ‌న్ ప్ర‌కాష్‌
పి.ఆర్.ఓః జియ‌స్ కె మీడియా
కో డైరెక్ట‌ర్ః ఆర్.సురేష్
ప్రొడ్యూస‌ర్ ః బీర‌మ్ సుధాక‌ర్ రెడ్డి
రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ః సంతోష్ జాగ‌ర్లపూడి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here