‘హిప్పీ’ అంటే స్పాంటేనియ‌స్ గాయ్- టి.ఎన్‌.కృష్ణ‌

0
220

`RX100` ఫేమ్ కార్తికేయ హీరోగా న‌టించిన చిత్రం `హిప్పీ`. స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను నిర్మాత‌గా, టీఎన్ కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. వీ క్రియేషన్స్ పతాకం పై రూపొందుతోంది. జూన్ 6న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు టి.ఎన్‌.కృష్ణ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం….

◆ హిప్పీ ఎలా మొద‌లైంది?
ముందు త‌మిళ్ లో చేయాల‌ని అనుకున్నా. థానుగారికి క‌థ చెప్పా. ఆ స‌మ‌యంలో `ఆర్‌.ఎక్స్. 100` సినిమాను త‌మిళ్‌లోకి రీమేక్ చేయాల‌ని కొంత‌మంది అనుకున్నారు. వాళ్లు చెప్ప‌డంతో నేను ఆ సినిమాను చూశాను. చూసిన త‌ర్వాత రీమేక్ ఎందుకు? ఇత‌నితో స్ట్రెయిట్ సినిమా చేస్తే బావుంటుంద‌ని నేను కార్తికేయ‌కు ఫోన్ చేశాను. ఆయ‌న కూడా `నువ్వు నేను ప్రేమ‌` సినిమాను ఫ్యాన్‌. ఆయ‌న వెంట‌నే క‌లుద్దామ‌ని అన‌డంతో నేను హైద‌రాబాద్‌కి వ‌చ్చాను. క‌థ న‌చ్చ‌డంతో `సార్‌. ఇదే నా నెక్స్ట్ సినిమా అయితే బావుంటుంది` అని అన్నారు. అప్పుడే ఈ సినిమాను మొద‌లుపెట్టాం.

◆ హిప్పీ అంటే ఏంటి?
మ‌న‌సులో ఏం పెట్టుకోడు హీరో. ఏం అనిపిస్తే అది చేస్తాడు. హిప్పీ అంటే స్పాంటేనియ‌స్ గై. కొన్నిసార్లు అది పాజిటివ్‌గానూ ఉండ‌వ‌చ్చు, నెగ‌టివ్‌గానూ ఉండ‌వ‌చ్చు. సినిమా ఆద్యంతం ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాంటెంప‌ర‌రీ సినిమా. ఈజ‌న‌రేష‌న్‌కు ఏం కావాలో అది ఉంటుంది.

◆ అడ‌ల్ట్ కంటెంట్ గురించి..
ఇప్పుడు అంద‌రి చేతుల్లోనూ ఫోన్ ఉంది. యంగ్‌స్ట‌ర్స్ సోష‌ల్ ప్లాట్‌ఫార్మ్ లో ఏదైనా చూడొచ్చు. అంత అప్‌డేట్‌గా ఉన్న యువ‌త‌ను ఉద్దేశించి కాంటెంప‌ర‌రీ అంశంతో తీశాను. ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు. వారికి బాగా న‌చ్చుతుంది.

◆ క‌థ గురించి చెప్పండి?
క‌థ‌గా చెప్పాలంటే పెద్ద క‌థేం కాదు. 14వ శతాబ్దంలో ఉన్న జాన్ మిల్ట‌న్ అనే బ్రిటిష్ క‌వి రాసిన ప్యార‌డైస్ లాస్ట్, ప్యార‌డైస్ రీగెయిన్ అనే దాన్ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించాం. అందులో అత‌ను యాడ‌మ్ అండ్ ఈవ్‌ను పెట్టి రాస్తే, నేను కాంటెంప‌ర‌రీగా రాశాను.

◆ ఇందులో జె.డి.చ‌క్ర‌వ‌ర్తి పాత్ర గురించి చెప్పండి?
ఈ సినిమాలో స్పెష‌ల్ ఆయ‌న పాత్రే. ఆ పాత్ర ప్ర‌తి ఒక్క‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. ఆయ‌న కూడా చాలా బాగా చేశారు. మాస్‌గా చెప్పాలంటే చింపేశారు. ఆయ‌న ఇందులో ఏమీ ల‌వ్‌గురుగా న‌టించ‌లేదు. అరిస్టాటిల్‌లాంటి వాడ‌ని అనుకోవ‌చ్చు. అత‌ను ఈ చిత్రంలో ఎవ‌రేం అడిగినా `య‌స్` అనే అంటాడు. `నో` అనే ప‌దం అత‌ని డిక్ష‌న‌రీలో ఉండ‌దు.

◆ ల‌వ్‌, ల‌స్ట్ గురించి?
ఇది పూర్తిగా ల‌వ్ సినిమా. ఎక్క‌డా ల‌స్ట్ ఉండ‌దు. కాక‌పోతే ముద్దులు పెట్టుకునే స‌న్నివేశాల్లో నేను పాత చిత్రాల్లాగా మ‌రీ చిలుక‌లు ముద్దులుపెట్టుకున్న‌ట్టు చూపించ‌లేదు. సోష‌ల్ మీడియా యుగంలో ఉన్నాం. దానికి త‌గ్గ‌ట్టే సినిమా చేశాం. ట్రాన్స్ ఫ‌ర్మేష‌న్ అనేది త‌ప్ప‌కుండా జ‌ర‌గాలి. అది సినిమా రంగ‌మ‌నే కాదు, జ‌ర్న‌లిస్టులు కూడా కాలానికి త‌గ్గ‌ట్టు మారాలి. పాఠ‌కులు ఏం ఆశిస్తారో అదే రాస్తారు. మేం ప్రేక్ష‌కులు ఏం కోరుకుంటారో అదే తీస్తామ‌న్న‌మాట‌.

◆ ప్ల‌ర్టింగ్ అంశాలు ఉంటాయా?
ఫ్ట‌ర్టింగ్ అని కాదు.. కానీ ఇందులో మొత్తం ప్రేమే ఉంటుంది. ఆ ప్రేమ ఎలా పుట్టింద‌నే మీదే సినిమా ఉంటుంది. ఆ పాయింట్ కొత్త పాయింట్‌. ఇప్ప‌టిదాకా ఎవ‌రూ చూపించ‌లేదు.

◆ తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు?
సినిమాల చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా నేర్చుకున్నా. నేను మొత్తం స్క్రిప్ట్ ని త‌మిళంలో రాసుకున్నా. దాన్ని తెలుగులోకి తీసుకురావాల‌నుకున్న‌ప్పుడు నాక్కూడా తెలుగు తెలిస్తే బావుంటుంద‌ని నేను నేర్చుకున్నా.

◆ హిప్పీని తెలుగులో చేయాల‌నుకున్న‌ప్పుడు నిర్మాత‌ను ఎలా అంగీక‌రించారు?
నేను థానుగారి ద‌గ్గ‌ర‌కు వెళ్లి కార్తికేయ అనే తెలుగు కుర్రాడు ఉన్నాడు. ఆయ‌న‌తో చేస్తే మీకు ఓకేనా.. అని అడిగా. వెంట‌నే ఆయ‌న `నాకు ఈ స్క్రిప్ట్ చాలాబాగా న‌చ్చింది. మీరు చైనీస్‌లో సినిమా చేసినా నేనే నిర్మిస్తాను. ఇమీడియేట్‌గా ప్రాసెస్ చేయండి` అని అన్నారు.

◆ త‌మిళ్‌లో డ‌బ్బింగ్‌గానీ, సైమ‌ల్టైనియ‌స్‌గా చేస్తున్నారా?
లేదండీ. ఇది కేవ‌లం తెలుగులోనే చేస్తున్నాం.

◆ అయినా త‌మిళ్‌లోనూ చేయ‌గ‌లిగిన స్కోప్ ఉన్న స్క్రిప్ట్ క‌దా?
నిజ‌మే. కానీ నేను అలా చేయాల‌నుకోలేదు. ఎందుకంటే ప్ర‌తి లాంగ్వేజ్‌కీ ఓ బ్యూటీ ఉంటుంది. వాటిని క‌ల‌ప‌డం నాకిష్టం లేదు. అందుకే నేను తెలుగులో మాత్ర‌మే చేయాల‌నుకున్నా.నేను తెలుగు బ్యూటీమీదే దృష్టిపెట్టా.

◆ మీ గ‌త సినిమా తెలుగులోనూ ఆడింది క‌దా?
ఈ సినిమాను కొంద‌రు త‌మిళ హీరోలు చూశారు. వాళ్లు రీమేక్ రైట్స్ అడుగుతున్నారు. ఇంకా దాని గురించి ఆలోచించ‌లేదు. నేను చేస్తానా? లేదా అనేది కూడా ఇప్పుడే ఏమీ చెప్ప‌లేను.

◆ నువ్వు నేను ప్రేమ త‌ర్వాత చాలా గ్యాప్ వ‌చ్చింది?
ఆ సినిమా త‌ర్వాత నేను నెడుంజాలై అనే ఒక సినిమా చేశా. అది బ్యాడ్ టైమ్‌… బ్యాడ్ టైమ్ అంద‌రికీ వ‌స్తుంది. నాకూ వ‌చ్చింది. అందుకే గ్యాప్ వ‌చ్చిందేమో. ఇక‌పై మీరు నానుంచి చాలా చూడొచ్చు.

◆ ఇందులో మీ ప‌ర్స‌న‌ల్ ఎక్స్ పీరియ‌న్స్ లు ఉన్నాయా?
చాలా ఉన్నాయి. ప్రేమలో అనుభ‌వం లేక‌పోతే, అందంగా ప్రేమ క‌థ‌లు చెప్ప‌లేమ‌ని నా ఉద్దేశం. నాకు 45 ఏళ్లు. నేను చాలా విష‌యాల‌ను నా జీవితంలో అనుభ‌వించి ఉంటాను. వాటిని ఇందులో పొందుప‌రిచాను. నా అనుభ‌వాలు కార్తికేయ పాత్ర‌లోనూ, జేడీ పాత్ర‌లోనూ ఉంటాయి. అలాగ‌ని ఇది నా బ‌యోపిక్ కాదు. ఇది ప‌ర్స‌న‌ల్ ఎక్స్ పీరియ‌న్స్ ల స‌మాహారం.

◆ ఇందులోని హైలైట్స్ ఏముంటాయి?
ఇందులో ఓ మొమెంటం ఉంటుంది. ప్ర‌తి సీనూ ఎలా జ‌రుగుతుందో.. దాన్ని మొమెంటం డ్రైవ్ చేస్తుంది. దాన్ని చూసేవాళ్లు ఎంజాయ్ చేస్తారు.

◆ కార్తికేయ బాక్స‌రా?
కార్తికేయ బాక్స‌ర్‌. అమ్మాయి బైక‌ర్‌.

◆ దిగంగ‌న‌ను చూస్ చేసుకోవ‌డానికి కార‌ణం ఏంటి?
నేను సోష‌ల్ మీడియాలో ఫొటోలు చూశాను. ఈ క‌థ‌కు ఆమె స‌రిపోతుంద‌ని ఫిక్స‌య్యాం. అప్పుడు మా మేనేజ‌ర్ ద్వారా ఎంక్వ‌యిరీ చేయిస్తే చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేశార‌ని తెలిసింది. ఆడిష‌న్‌లో ఆ అమ్మాయి చాలా నచ్చింది. డెడికేటెడ్ ఆర్టిస్ట్.

◆ చాలా లిప్‌లాక్స్ ఉన్న‌ట్టున్నాయి..
ఉంటాయి. అలాగ‌ని చా…లా.. కాదు. స్క్రిప్ట్ నెరేట్ చేసిన‌ప్పుడే నేను అమ్మాయికి చెప్పేశాను. న‌చ్చాకే ఒప్పుకుంది. ఆర్ ఎక్స్ 100లో ఒక‌మ్మాయితో కార్తికేయ‌కు లిప్‌లాక్ ఉంటుంది. ఈ సినిమాలో ఇద్ద‌రితో ఉంటుంది.

◆ మెసేజ్ ఉంటుందా?
ఏ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి అయినా మంచి ఎమోష‌న్‌, గోల్ ఉండాలి. యంగ‌స్ట‌ర్స్ మ‌ధ్య‌లో రిలేష‌న్‌షిప్ ప్రాబ్ల‌మ్ ఎలా వ‌స్తుంది? ఈ ప్రాబ్ల‌మ్ ఎలా వ‌స్తుంది? ఎందుకు వ‌స్తుంది? వ‌ంటి విష‌యాల‌ను నేను ఇందులో డిస్క‌స్ చేశాను. ఎందుకంటే నేటి ప్ర‌పంచంలో అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్లీగా ఉండాల‌నుకుంటున్నారు. అందుకే ఆ ఫ్రెండ్లీనెస్ని కూడా ఇందులో చూపించా.

◆ ఈ సినిమా త‌ర్వాత తెలుగుమీదే ఫోక‌స్ చేస్తారా?
నాకు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ చాలా న‌చ్చింది. చాన్సులు వ‌స్తుంటే ఇక్క‌డే చేస్తుంటాను. ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయి. పెద్ద పెద్ద బ్యాన‌ర్ల నుంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే ఆ విష‌యాలు చెబుతాను. స్క్రిప్ట్, నిర్మాత కూడా రెడీగా ఉన్నారు. హీరో ఫైనల్ కాగానే చెబుతాను. థానుగారితోనూ ఇంకో సినిమా ఉంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతోనూ ఇంకో ప్ర‌పోజ‌ల్ ఉంది. వాళ్ల‌కి గ్లోబ‌ల్ ఫిల్మ్ కాన్సెప్ట్ చెప్పా. అది క‌ల్చ‌ర‌ల్ డిఫ‌రెన్స్, ట్రాన్స్ ఫ‌ర్మేష‌న్ గురించి చెబుతుంది.

◆ `హిప్పీ`లో బేసిక్ కాన్‌ఫ్లిక్ట్ ఏంటి?
ఇద్ద‌రుంటారు. వాళ్ల‌కి బ‌య‌ట నుంచి ఎలాంటి ఇబ్బందులూ లేవు. కానీ వాళ్ల‌కు ఇబ్బందుల‌న్నీ వాళ్ల మ‌ధ్య‌లోనే ఉంటాయి. అందుకే దాని గురించి డిస్క‌స్ చేశాం. మంచి పాట‌లు కుదిరాయి. అనంత‌శ్రీరామ్‌గారు చాలాబాగా రాశారు. శ్రీమ‌ణిగారు ఓ పాట రాశారు. సౌండింగ్ కూడా చాలా బాగా కుదిరింది. బాణీలు బావున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here