రూసో బ్రదర్స్ ప్రశంసలు అందుకున్న ధనుష్

0
25

‘ది గ్రే మాన్’ ప్రెస్ మీట్ లో ఇండియా, ధనుష్ పై తమ అభిమానం పంచుకున్న రూసో బ్రదర్స్!!

హాలివుడ్ యాక్షన్ దర్శకులు రూసో బ్రదర్స్, నెట్‌ఫ్లిక్స్‌ కోసం తెరకెక్కించిన సినిమా ‘ది గ్రే మ్యాన్’, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ‘ది గ్రే మాన్’ దర్శకులు, ధనుష్ తో ముంబై లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

రూసో బ్రదర్స్ మాట్లాడుతూ, “ఇండియా లో సినిమాలకి దొరికే ఆదరణ చూస్తుంటే ఆశ్చర్యమేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇలాంటి సినీ ప్రేక్షకుల కోసం ‘ది గ్రే మాన్’ ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం లో ధనుష్ యాక్షన్ మీకు చాలా నచ్చుతుందని ఆశిస్తున్నాం. అతనంటే మాకు అమితమైన అభిమానం, గౌరవం, భవిష్యత్తు లో వీలైతే మళ్ళీ కలిసి పని చేయాలనుకుంటున్నాం” అన్నారు.

ధనుష్ మాట్లాడుతూ, “ది గ్రే మాన్ షూటింగ్ లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా రూసో బ్రదర్స్ వల్ల చాలా విషయాల తో పాటు కొన్ని పరిస్థితుల్లో పూర్తి ఓపిగ్గా ఉండడం నేర్చుకున్నాను. ఇదొక అద్భుతమైన అవకాశం, ప్రతీ క్షణం ఆనందిస్తూ పని చేసా. కొత్తగా చేయటం, కొత్త విషయాలు నేర్చుకోవటమే నాకు అలవాటు. ఇలాంటి మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా”

ఈ చిత్రం జూలై 22న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలవుతోంది. ఇందులో ర్యాన్ గోస్లింగ్ హీరో. క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్, ధనుష్ కీలక పాత్రల్లో నటించారు.

మార్క్ గ్రీన్ రాసిన ‘ది గ్రే మ్యాన్’ పుస్తకం ఆధారంగా అదే పేరుతో రూసో బ్రదర్స్ ఈ సినిమాను రూపొందించారు. సినిమాకు తగ్గట్టుగా జో రుసో, క్రిస్టోఫర్ మార్కస్, స్టీఫెన్ మెక్ ఫీల్ స్క్రిప్ట్ రాశారు.

ది గ్రే మ్యాన్ గురించి
దర్శకులు: ఆంథోని రుసో, జో రుసో
రచయితలు: జో రుసో, క్రిస్టోఫర్ మార్కస్, స్టీఫెన్ మెక్ ఫీలీ
నిర్మాతలు: జో రోత్, జెఫరీ కిర్స్ చెన్ బామ్, ఆంథోని రుసో, జొ రుసొ, మైక్ లారొక్కా, చిరిస్ కాస్టాల్డి
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: పాట్రిక్ నెవాల్, క్రిస్టొఫర్ మార్కస్, స్టీఫెన్ మెక్ ఫీలీ, జాక్ ఆస్ట్, అంగేలా రుసొ-ఒట్ స్టాట్, జియోఫ్ హాలే, జాక్ రూత్, పాలక్ పటేల్
ఆధార పుస్తకం సిరీస్: ది గ్రే మ్యాన్, రచయిత మార్క్ గ్రీనే
నటీనటులు: రయాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి అర్మాస్, జెస్సీకా హెన్విక్, వాగ్నర్ మౌరా, ధనుష్, బిల్లీ బాబ్ థోర్న్ టన్, అల్ ఫ్రె వుడార్డ్, రెగె-జీన్ పేజ్, జులియా బుటర్స్, ఎమె ఇక్ ఉవాకర్, స్కాట్ హేజ్

THE RUSSO BROTHERS ON THEIR LOVE FOR INDIA, DHANUSH, AND THE GRAY MAN!

The dynamic director-duo, Anthony and Joe Russo, along with Dhanush, met with the Indian press and spoke about The Gray Man at a press conference in Mumbai earlier today

Mumbai, 21 July, 2022- Legendary filmmakers Anthony and Joe Russo, are in India to promote their highly anticipated action spectacle on Netflix- The Gray Man, starring Ryan Gosling, Chris Evans, Ana De Armas with Dhanush, who is also accompanying The Russo Brothers on their India Tour. While talking about the making of the film at the press conference that was held with The Russo Brothers and Dhanush in Mumbai earlier today , they spoke in detail about bringing to life this magnum opus.

The Russo brothers shared, “Being here in India has let us see first-hand how much entertainment is thriving here. We are extremely thrilled to have brought The Gray Man to life with Netflix and for people all over the world to enjoy the film and see Dhanush in action. He is a consummate professional we deeply admire and respect, and we truly hope for more opportunities to work together again.”

Talking about his experience while working on The Gray Man, Dhanush said, “The Russo Brothers taught me patience among many other things and I had a wonderful learning experience on the sets of Gray Man. It was an unbelievable experience and I enjoyed every moment of it. It’s been always my intention to explore and learn more, looking forward to many such experiences”

Stream The Gray Man only on Netflix on July 22.
And gear up for more action, drama and another blockbuster – The Gray Man 2!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here