‘దాండియా’ ఆటలతో “టిక్ టాక్” టాపర్స్ అదుర్స్

0
84

దసరా సందర్భంగా భాగ్యనగరంలో పలుచోట్ల అనేక కార్యక్రమాలు జరుగుతున్న వేళ టిక్ టాక్ నటీనటులు కూడా ఈ సంబరాల్లో ఏమీ తక్కువ కాదు అని నిరూపించుకున్నారు వీరభద్ర క్రియేషన్స్ నిర్వహించిన టిక్ టాక్ దాండియా కార్యక్రమము లో నటీనటులు పెద్ద ఎత్తున పాల్గొని దాండియా ఆడుతూ ఆకట్టుకున్నారు. ప్రముఖ సినీ నటి ధన్య బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చారు. ఈ మధ్య కాలంలో టిక్ టాక్ నటీనటులు చాలా బాగా నటిస్తున్నారు అని ఆమె పేర్కొన్నారు. దసరా అనగానే నగరమంతా కోలాటాలతో నిండు పోతుంది కానీ ఈ సారి నాకు టిక్ టాక్ నటీనటులతో కలిసి ఆడే అవకాశం లభించినందుకు ఆనందిస్తున్నా అని అన్నారు. టిక్ టాక్ యువతీ యువకులు ఎంతో నైపుణ్యంతో నటిస్తున్నారు అని ఆమె తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ నటులు అందరికీ సినిమా రంగంలో మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను అని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమ నిర్వాహకురాలు హేమలత రెడ్డి (బుజ్జియాక్టర్) మాట్లాడుతూ టిక్ టాక్ నటుల అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమం చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అని తెలిపారు. ప్రతి ఏడాది టిక్ టాక్ నటీనటులు అందరికీ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బాగా ప్రదర్శన చేసిన నటులు హర్షిత్ రెడ్డి,అవినాష్, కళ్యాణ్ మరియు జిగేల్ రాజా అనే యువకులకు బహుమతులు అందజేసి సత్కరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here