బసవతారకం కిరీటంలో మరొక మణిపూస- బాలకృష్ణ

0
99

ఈ రోజు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కిరీటంలో మరొక మణిపూస వచ్చి చేరిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. మన రేడియాలజీ డిపార్ట్మెంట్ లో ఇప్పటికే అత్యాధునికమైన 3డి – డిజిటల్ మమ్మోగ్రామ్ ఉంది. ఈ రోజు మనం మన ఆసుపత్రిలో డిజిటల్ రేడియో గ్రఫీని ప్రారంబించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

ఆసుపత్రి సీఈఓ, డా|| ఆర్. వి. ప్రభాకరరావు గారికి, మెడికల్ డైరెక్టర్ డా|| టి. సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు మరియు రేడియాలజీ విభాగాధిపతి డా|| వీరయ్య చౌదరి గారికి ప్రత్యేకంగా నా అభినందనలు.

ఎలాంటి కొత్త సాంకేతికతనైనా మన ఆసుపత్రికి తీసుకురావడంలో మనమెప్పుడు ముందే ఉంటాము. ఇలాంటి అత్యాధునిక సాంకేతికత సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనేదే నాన్నగారి యొక్క ఆశయం. ఏ ఆశయంతో అయితే ఈ ఆసుపత్రి స్థాపించబడిందో, అదే స్పూర్తితో ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తూన్నాము. అత్యాధునిక సాంకేతికతతో అత్యంత నిపుణులైన డాక్టర్లచే అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఉండాలనేదే ఈ ఆసుపత్రి యొక్క ఆశయం . ఈ దిశగా ప్రయత్నం కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు మరియు అభినందనలు. ప్రతి రోజు ఎన్నో వందలమంది రోగులకు వారి యొక్క ఆర్ధిక పరిస్థితితో సంబంధం లేకుండా ఈ ఆసుపత్రిలో చికిత్స చేయడం జరుగుతుంది.

ఈ డిజిటల్ రేడియో గ్రఫీ ద్వారా మనం సాధారణంగా ఫిల్మ్ పైన తీసే ఎక్సరేని డిజిటల్ రూపంలో వెంటనే చూసే వీలుంటుంది. ఈ డిజిటల్ రేడియోగ్రఫీ ద్వారా తీసే ఇమేజ్ మంచి క్వాలిటీతో ఉండి ఖచ్చితమైన నిర్దారణ చేసేందుకు వీలుంటుంది. దీని ద్వారా కేవలం 8గం||ల సమయంలో 200కి పైగా ఇమేజెస్ తీయవచ్చు తద్ద్వారా తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ మందికి సేవలు అందించేందుకు వీలవుతుంది. దీని ద్వారా రోగులు అతి తక్కువ రేడియేషన్ కి గురి అవుతారు. ఈ విధానం వల్ల మనం పర్యావరణానికి కూడా మేలు చేసినవాళ్ళమవుతాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here