ఉగాది పండుగ సందర్భంగా “నచ్చింది గర్ల్ ఫ్రెండూ”

0
82

యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండూ. ఎప్పుడూ వైవిధ్యమైన కథలు ఎంచుకునే ఉదయ్ శంకర్ తన కెరీర్ లో చేస్తున్న మరో విభిన్న చిత్రమిది. జెన్నీ హీరోయిన్ గా నటిస్తోంది. మధునందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కమర్షియల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీని దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై

అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఉగాది పండుగ సందర్భంగా టైటిల్ అనౌన్స్ మెంట్ చేశారు.

ఈ టైటిల్ పోస్టర్ చూస్తే…హీరోయిన్ కు రోజ్ ఫ్లవర్ ఇస్తూ లవ్ ప్రపోజ్ చేస్తున్న కథానాయకుడిని వద్దని వారిస్తున్నాడు అతని స్నేహితుడు. నచ్చింది గర్ల్ ఫ్రెండూ అనే టైటిల్ కూడా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ తో హీరో క్యారెక్టరైజేషన్ ఏంటనే ఆసక్తి కలుగుతోంది. సీనియర్ హీరో సుమన్,
పృధ్వీరాజ్ , శ్రీకాంత్ అయ్యాంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాలో అందమైన ప్రేమకథ చుట్టూ జరిగే థ్రిల్లింగ్ అంశాలను చాలా కమర్షియల్ వేలో చూపించబోతున్నారు.

నటీ నటులు: ఉదయ్ శంకర్, జన్నీఫర్ ఇమ్మానుయేల్,
సీనియర్ హీరో సుమన్, మధునందన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, సనా, కళ్యాణ్ తదితరులు

సాంకేతక వర్గం: సినిమాటోగ్రఫీ : సిద్దం మనోహార్, మ్యూజిక్: గిఫ్టన్, ఎడిటర్: జునాయిద్ సిద్దిఖి, ఆర్ట్: దొలూరి నారాయణ,
పి.ఆర్.ఓ: జియస్ కె మీడియా
నిర్మాత : అట్లూరి నారాయణ రావు, దర్శకత్వం : గురు పవన్
.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here