నవంబర్ 22న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతున్న‌ లవ్ థ్రిల్లర్ ‘ట్రాప్’

0
573

ప్రేమ కవితాలయ ఫిలిమ్స్ బ్యానర్ లో మహేందర్ ఇప్పలపల్లి, షాలు, కాత్యాయనీ శర్మ హీరో హీరోయిన్లుగా వీ ఎస్ ఫణింద్ర దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘ట్రాప్’. ఈ చిత్రం ద్వారా ఆళ్ల స్వర్ణలత నిర్మాతగా పరిచయమవుతున్నారు. బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 22 న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా…

దర్శకుడు వీ ఎస్ ఫణింద్ర మాట్లాడుతూ – ” ఈ స్టోరీ చెప్పగానే వెంటనే నాతో సినిమా తీయడానికి ఒప్పుకున్న నిర్మాత ఆళ్ల స్వర్ణలత గారికి థాంక్స్. అలాగే మా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బ్రహ్మాజీ గారికి కృతజ్ఞతలు. ఆయనకు ‘సిందూరం’ సినిమా ఎలా మంచి పేరు తీసుకువచ్చిందో నాకు ఈ చిత్రం అలా మంచి పేరు తీసుకువస్తుంది అని నమ్ముతున్నాను. మా సినిమాలో మంచి పాటలు ఇచ్చిన ఈశ్వర్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన హర్ష కు ధన్యవాదాలు” అన్నారు.

నిర్మాత ఆళ్ల స్వర్ణలత మాట్లాడుతూ – “మొదట నిర్మాణ రంగంలోకి రావాలంటే చాలా భయం వేసింది. కానీ హీరో, హీరోయిన్ అలాగే టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ మంచి సపోర్ట్ అందించారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఎడిటర్ రామారావు గారు, దర్శకుడు ఫణింద్ర సినిమా అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకున్నారు. నవంబర్ 22 న మీ ముందుకు రాబోతున్నాం. మీ అందరి సపోర్ట్ కావలి” అన్నారు.

మహేందర్ ఇప్పలపల్లి, కాత్యాయనీ శర్మ, బ్రహ్మాజీ, షాలు, రచ్చరవి, విట్టల్, పరమేశ్వర శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ : ప్రవీణ్ కె, శివ,
ఎడిటర్ : రామారావు జె పి,
మ్యూజిక్: ఈశ్వర్ పెరావలి,
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: హర్ష ప్రవీణ్,
కొరియోగ్రాఫర్ : జో జో,
ప్రొడ్యూసర్ : ఆళ్ల స్వర్ణలత,
కథ,దర్శకత్వం : వీ ఎస్ ఫణింద్ర.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here