కొన్ని గంటల్లోనే ‘7’ మూవీ టిజర్ కి మిలియన్ డిజిటల్ వ్యూస్

0
37

కొన్ని గంటల్లోనే టిజర్ కి మిలియన్ డిజిటల్ వ్యూస్. ఇది సెవెన్ 7 మూవీ స్థాయి. టిజర్ అదిరిపోయింది. మంచి కంటెంట్ తో రొమాంటిక్ సస్పెన్స్ డ్రామాగా మన ముందుకు వస్తున్న చిత్రం సెవెన్ (7). పేరు పరిచయం చేసే అవసరం లేని వ్యక్తి దర్శకుడు రమేష్ వర్మ ఈ సారి నిర్మాత గా మారి ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్నారు. రహ్మాన్, హవిష్, రెజినా, నందితా శ్వేతా, అదితి ఆర్యా, ఆనిశా ఆమ్బ్రోష్, పూజితా పొన్నాడ, త్రిధా చౌదరి, సత్య, ధనరాజ్ వంటి భారీ తారాగణం తో పాటు ఇండస్ట్రీ ప్రముఖ తారాగణం నటిస్తుండగా ప్రముఖ కెమెరా మాన్ నిజార్ షఫీ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ మధ్య విడుదల అయిన ఈ సెవెన్ (7) మూవీ టిజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ నీ కొల్లగోడుతుంది, ఈ టిజర్ చూసిన నెటిజన్లు సైతం ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం.

సరికొత్తగా మన ముందుకు వచ్చిన 7 సెవెన్ మూవీ టిజర్ ప్రేక్షకులలో సినిమా పట్ల ఆసక్తి పెంచింది అనే చెప్పుకోవాలి. కాగా RX 100 వంటి బ్లాకు బస్టర్ సినిమాకు సంగీతం అందించి సినిమా సక్సెస్ లో మ్యూజిక్ నీ మెయిన్ పార్ట్ చేసిన చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు కూడా సంగీతం అందించడం ఈ సినిమా మీద అభిమానుల్లో అంచనాలు పెంచేందుకు దోహద పడే విషయం.

విడుదల అయిన ఒక్క టిజర్ తోనే ట్రెండ్ టాపిక్ అయిన ఈ సినిమా ముందు ముందు విడుదల కానున్న సాంగ్స్, ట్రైలర్ తో మరెన్నో రికార్డ్ లు సృస్తిస్తుందో వేచి చేసి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here