హర్భజన్ సింగ్ ‘ఫ్రెండ్ షిప్` ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్ కి ట్రెమండ‌స్‌ రెస్పాన్స్

0
107

తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్‌ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేశారు ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ హర్భజన్ సింగ్. పలు కంపెనీలను ప్రమోట్ చేయడం కోసం కెమెరా ముందుకు వచ్చిన విష‌యం తెలిసిందే.. ప్ర‌స్తుతం హర్భజన్ సింగ్ ‘ఫ్రెండ్ షిప్` సినిమాలో హీరోగా న‌టిస్తున్నారు. త‌మిళ బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మ‌రియ‌నేస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రంలో కీలక పాత్రల‌లో యాక్షన్ కింగ్ అర్జున్, త‌మిళ న‌టుడు స‌తీష్‌ న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్‌, సినీ మాస్ స్టూడియోస్ ప‌తాకాల‌పై జెపిఆర్ & స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈరోజు ‘ఫ్రెండ్ షిప్` మూవీ ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్‌, ‌లోస్లియా మ‌రియ‌నేస‌న్ క‌లిసి ఉన్న ఈ ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్ కి సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, త‌మిళ్‌, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేస్తున్నారు. సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్ల‌డించనున్నారు.

హర్భజన్ సింగ్, యాక్ష‌న్ కింగ్ అర్జున్‌, త‌మిళ న‌టుడు స‌తీష్‌, లోస్లియా మ‌రియ‌నేస‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్: వేల్‌మురుగ‌న్‌, రాబిన్‌, ప్రొడ్యూస‌ర్స్: జెపిఆర్ & స్టాలిన్, ద‌ర్శ‌క‌త్వం: జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య.

Tremendous Response For The First Look Motion Poster Of Harbhajan Singh ‘Friendship’

Popular Indian Cricketer Harbhajan Singh needs no introduction. He won numerous matches for the country with his magic spin bowling. Apart from being a Cricketer, Harbhajan Singh is seen in many ads promoting several brands and is now coming as a Hero in a film titled ‘Friendship’. Bigg Boss 3 Tamil fame Losliya Mariyanesan is playing as heroine. This film is Directed by John Paul Raj and Sham Surya while JPR & Stalin are Producing it under Seantoa Studio and Cinemass Studio banners. Action King Arjun is playing a crucial character in the film and Actor Sathish will be seen in another important role. Makers have revealed The First Look Motion Poster of ‘Friendship’ featuring Harbhajan Singh, Action King Arjun and Losliya. The first look motion poster looks intriguing with riveting background score and recieved tremendous response from all corners.

Makers are planning to release the film in Telugu, Tamil, Hindi and English languages. Further details about the cast and crew will be revealed soon.

Harbhajan Singh, Action King Arjun, Sathish, Losliya Mariyanesan are the principal cast

Executive Producers: Velmurugan, Robin
Producers: JPR & Stalin
Direction: John Paul Raj, Sham Surya

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here