రివ్యూ: వజ్రకవచధర గోవింద

0
803

స్టార్ కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన ‘చిత్రం వజ్రకవచధర గోవింద’. ఇందులో వైభవి జోషి హీరోయిన్. ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’లాంటి మాస్ హిట్ సినిమాకు దర్శకత్వం వహించిన అరుణ్ పవర్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. శివ శివం ఫిల్మ్స్ బ్యానర్‌ పై నరేంద్ర, జీవిఎన్ రెడ్డి లు ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ బుల్గానిన్ సంగీత అందించారు. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి తన మనుపటి చిత్రాల్లాగే సప్తగిరి ఏమాత్రం ప్రేక్షకుల్ని నవ్వించారో చూద్దాం పదండి.

కథ : గోవింద్(సప్తగిరి) చిల్లర దొంగతనాలు చేస్తూ బతికేస్తుండాడు. దాంతో అతన్ని అందరూ టార్గెట్ చేయడంతో ఊరొదిలి పారిపోయి ఓ రాక్ బ్యాండ్ లో చేరుతాడు. అక్కడ అక్కడ కూడా చిల్లర దొంగతనాలు చేస్తూ ఓ ఆర్కియాలజిస్ట్ ఇంట్లో దొంగ తనానికి వెళ్లగా అక్కడ.. ఎంతో కాలంగా ఓ లాకర్ తెరవడానికి ట్రై చేస్తున్న ఆర్కియాలజిస్ట్ కు గోవింద్ ఇచ్చిన క్లూతో దాన్ని తెరుస్తాడు. అక్కడి నుంచి గోవింద్ సహాయంతో ఆ ఆర్కియాలజిస్ట్ నిధిని తవ్వి తీయడానికి పరుశరామ్ అనే టెంపుల్ కి వెళతారు. అలా నిధి అన్వేషణలో వుండగా.. 150 కోట్ల విలువైన నీలం వజ్రం దొరుకుతుంది. అలా దొరికిన నీలం వజ్రాన్ని అమ్మడానికి గోవింద్ బృందం ఏమి చేసింది? ఆ నీలం వజ్రం ఎవరిది? అసలు సప్తగిరి ఆర్కియాలజిస్ట్ తో కలిసి నిధి కోసం ఎందుకు అంత రిస్క్ చేయాల్సి వచ్చింది? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: సప్తగిరి తన కామెడీ టైమింగ్ తో ఇప్పటికే ఎన్నాసార్లు ప్రేక్షకుల మన్ననలు పొందాడు. అలాంటి కామెడీ ప్రధానంగా వజ్రం చుట్టూ రాసుకున్న కామెడీ మాస్ ఆడియన్స్ ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా సప్తగిరి చేత చెప్పించిన కామెడీ సంభాషణలకు థియేటర్లో నవ్వులే నవ్వులు. దానికి తోడు అక్కడక్కడ కొన్న కమర్షియల్ హంగులతో సినిమాను తెరకెక్కించిన విధానం బాగుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అర్చనతో చేయించిన ఎమ్మెల్యే రోల్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో నిధి చూట్టే కథను రాసుకున్నా… సెకెండాఫ్ లో సప్తగిరి గతాన్ని మరిచిపోయి.. చేసిన కామెడీ చాలా బాగుంది. ముఖ్యంగా హిప్నాటిజం సీన్ అందరినీ ఆకట్టుకుంటుంది. సప్తగిరికి తోడు అవినాష్.. అండ్ జబర్దస్థ్ టీమ్ కామడీ కూడా బాగా నవ్విస్తుంది. టోటల్ ఇట్స్ మాస్ ఎంటర్టైనర్. బి,సి సెంటర్ల ప్రేక్షకులు ‘వజ్రకవచధర గోవింద’ను ఎంజాయ్ చేస్తారు.
ఇందులో సప్తగిరి నటనే ప్రధాన హైలైట్. నిధి కోసం తోటి మిత్రులతో కలిసి వెళ్లినప్పుడు చేసే కామెడీ, గుహలో వచ్చే సీన్లలోనూ, రౌడీలతో చేసే కామెడీ, హిప్నాటిజం సమయంలో చేసే కామెడీ గానీ, అలాగే అర్చనను ఎమ్మెల్యేను చేయడంలో భాగంగా చేసిన సీరియస్ పాత్రగానీ, ఊర్లో క్యాన్సర్ బారిన పడి మరణించే వారిని ఆదుకోవడానికి తపన పడే సెంటి మెంట్ సీన్లలోనూ బాగా నటించారు. సప్తగిరికి తోడుగా నటించిన వైభవి జోషీ పాత్ర కేవలం గ్లామర్ కోసమే అన్నట్టుంది. ఆమె ఆందాలు బాగానే ఒలకబోసింది. మగరాయుడు పాత్రలో బాగా నటించింది. అవినాష్ కామెడీ బాగా చేశారు. అతనితో పాటు చేసిన జబర్దస్థ్ టీమ్ కామెడీ నవ్విస్తుంది. శ్రీనివాస్ రెడ్డి పాత్ర ఒకే. విలన్ బంగారప్ప పాత్రలో నటించిన వ్యక్తి రౌద్రం ప్రదర్శించడంలో సక్సెస్ అయ్యారు. అతని బావమరిది పాత్రలో టెంపర్ వంశీ పర్వాలేదు అనిపించాడు. హీరోయిన్ అర్చన ఇందులో సప్తగిరి స్నేహితురాలిగానూ… ఎమ్మెల్యేగా యాంటి రోల్ పోషించి మెప్పించింది.
జి టి ఆర్ మహేంద్ర రాసిన కథకు పర్ ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో సినిమాను తెరకెక్కించారు దర్శకుడు అరుణ్ పవర్. మాస్ ప్రేక్షకులు బాగా ఎంటర్ టైన్ చేసే విధంగా సినిమాను తెరమీద చూపించారు. విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం బాగుంది. పాటలన్నీ బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. దేవాలయం పరిసరాలు గానీ. బెలూం కేవ్స్ లో తీసన సన్నివేషాలు గానీ… సినిమాటోగ్రపీ రిచ్ గా వుందనడానికి ఉదాహరణంగా నిలుస్తాయి. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా వుంటే బాగుండు. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టారు. ఈ వీకెండ్ లో సరదాగా నవ్వుకోవడానికి టైంపాస్ మూడీ ‘వజ్రకవచధర గోవింద’. గో అండ్ వాచ్ ఇట్!

చివరగా… నవ్వించే ‘గోంవిదు’

రేటింగ్: 3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here