వయాకామ్ 18 – వైజయంతి మూవీస్ భాగస్వామ్యంలో ‘దేవదాస్’

0
606

ముంబాయి కి చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘వయాకామ్ 18 మీడియా’ ప్రతిష్టాత్మక ‘వైజయంతి సంస్థ’ తో చేతులు కలపనుంది. వైజయంతి మూవీస్ కింగ్ నాగార్జున – నాచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో నిర్మిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘దేవదాస్’ చిత్రానికి వయా కామ్ 18 భాగ స్వామిగా దక్షిణాది చిత్ర సీమ లో అడుగు పెట్టనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత అశ్వినిదత్ మాట్లాడుతూ, ” వయా కామ్ 18 తో భాగస్వామి గా కావడం చాలా ఆనందంగా ఉంది. వారితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాం. ‘దేవదాస్’ తో దక్షిణాది చిత్ర సీమ లోకి ప్రవేశిస్తున్న వారికి టాలీవుడ్ తరఫున ఘన స్వాగతం పలుకుతున్నాం.”

వయా కామ్ 18 COO. అజిత్ అంధారే మాట్లాడుతూ, ” అశ్వినిదత్ గారి ప్రఖ్యాత వైజయంతి మూవీస్ సంస్థ భాగస్వామ్యం లో భారీ చిత్రం ‘దేవదాస్’ తో తెలుగు చిత్రసీమ లో కి ప్రవేశిస్తున్నందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. మా సంస్థ తెలుగు లో అనేక దశాబ్దాల అనుభవం ఉన్న దత్ గారు, వైజయంతి మూవీస్ భాగస్వామ్యం తో మరింతగా విస్తరించేందుకు కృషి చేస్తాం. కింగ్ నాగార్జున – నాచురల్ స్టార్ నాని ల కలయికలో టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న, అందరూ ఎంత గానో ఎదురు చూస్తున్న ‘దేవదాస్’ తో వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.”

కింగ్ నాగార్జున – నాచురల్ స్టార్ నాని హీరోలు గా, రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లు గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మెగా మేకర్ అశ్వినిదత్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న దేవదాస్ షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర పనుల చివరి దశలో ఉంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన మూడు పాటలూ చార్ట్ బస్టర్స్ గా నిలిచి విశేషాదరణ పొందాయి.

‘దేవదాస్’ ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27 న విడుదల కానుంది.ఇతర ముఖ్య పాత్రల్లో నరేష్ వికె, రావు రమేష్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్ తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికిదర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత : అశ్వినిదత్
బ్యానర్ : వైజయంతి మూవీస్, వయా కామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్
సంగీతం : మణిశర్మ
డీ ఓ పి : శాందత్ సైనుద్దేన్
ఆర్ట్ : సాహి సురేష్

Viacom 18 partners with DevaDas

Leading Media group from Mumbai, Viacom 18 Media is partnering with Vyjayanthi Movies banner for their upcoming crazy multi-starrer ‘DevaDas’.

Speaking on the occasion, Aswini Dutt said, “We are extremely honoured to get associated with Viacom 18 and this is their first film down the south. We welcome them to the Telugu industry on this note.”

Speaking about Ajith Andhare, COO of Viacom 18 Studios said, “With immense joy and pride, I would like to announce Viacom 18 Motion Pictures’ partnership with renowned Vyjayanthi Movies of Shri Ashwini Dutt garu for our first mega Telugu film – ‘DevaDas’. The studio will continue to focus and expand it’s Telugu footprint with esteemed partners such Vyjayanthi Movies and Dutt garu who bring in decades of experience and understanding of Telugu market. We are excited to present one of the most anticipated films of the year, starring Telugu industry’s King Nagarjuna along with Natural star Nani and directed by the talented Sriram Adittya.”

‘DEVADAS’ features Nagarjuna, Nani, Rashmika Mandanna and Aakanksha Singh in the lead roles. Sriram Adittya is directing the movie which has wrapped the shooting and is currently in post-production stages.

Mani Sharma is composing music and the two songs that were released earlier got a fantastic response like the teaser.

DevaDas is hitting the screens on September 27th.

Cast: Nagarjuna Akkineni, Nani, Rashmika Mandanna, Aakanksha Singh, Naresh VK, Rao Ramesh, Vennela Kishore, Avasarala Srinivas and others

Crew:
Director: Sriram Adittya
Producer: Ashwini Dutt
Banners: Vyjayanthi Movies and Viacom 18 Media Pvt Ltd
Music: Mani Sharma
DoP: Shamdat Sainudeen
Art: Sahi Suresh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here