వర్ధమాన నటి టీనా చౌదరికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా సత్కారం

0
113

ఇటీవల ప్రముఖ హాస్య నటుడు అలీతో ‘పండుగాడి ఫోటో స్టూడియో’ చిత్రంలో నటించిన వర్ధమాన నటి టీనా చౌదరి కూచిపూడి నృత్యంలోనూ రాణిస్తుంది. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఇనుప మేకులపై కూచిపూడి నృత్యం చేసి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు అందుకున్నారు. ఏంతో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆసాంతం ప్రదర్శనను రక్తి కట్టించారు. టీనా చౌదరి నృత్యం స్వయంగా చూసిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆమెను సత్కరించారు. వెంకయ్య నాయుడుకి ఆమె పాదాభి వందనం చేసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. తన జీవితంలో మరువలేని రోజు ఇదని ఆమె చెప్పారు.

విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాలలో టీనా చౌదరి ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఆమె తండ్రి మన్నే సత్యనారాయణ, తల్లి శివకుమారి గుంటూరు జిల్లా తెనాలిలో లెక్చరర్లుగా పని చేస్తున్నారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహం వలన, గురువుల వద్ద శిష్యరికం తనకు తోడుగా నిలిచాయి అని టీనా చౌదరి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here