AISFM గ్రాడ్ ఫెస్టివల్ లో స్క్రిప్ట్ రైటింగ్ మేజర్ బ్యాచిలర్స్ / మాస్టర్స్ ప్రోగ్రాం ని ప్రారంభించిన స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్

0
105

బాహుబలి భజరంగి భాయిజాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ కి స్క్రిప్ట్ ని అందించిన స్టార్ స్క్రిప్టురైటర్ శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు AISFM లో స్పెషలైజ్డ్ క్రియేటివ్ బ్యాచిలర్స్ , మాస్టర్స్ ప్రోగ్రాం ని ప్రారంభించారు. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ ఫిలిం అండ్ మీడియా (AISFM) గ్రాడ్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ” కథల్ని ఆకట్టుకునేలా చెప్పాలి. ఒక ఆలోచనగా మొదలైన దాని చుట్టూ కథని నిర్మించాలి. అలా సిద్ధమైన ఆ కథ ఆత్మ ని అర్ధం చేసుకుని ప్రాణం పోయడమే ఫిలిం మేకింగ్. మన పరిసరాల్ని ఎంత సూక్ష్మంగా గమనిస్తామో అంత పవర్ఫుల్ కథని చెప్పగల నేర్పు సాధిస్తాం. ఫిలిం గ్రాడ్యుయేషన్ ఈ ప్రయాణానికి నాంది పలుకుతుంది.”

రెండు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ నిన్న ప్రారంభమైంది. ఇందులో గ్రాడ్యుయేట్ విద్యార్థులు నిర్మించిన 8 విభిన్నమైన, ఆలోచన రేకెత్తించే చిత్రాలని ప్రదర్శిస్తున్నారు.

రశ్మిత్ కౌర్ నిర్మించిన ‘ఇనాం’, ఆకాష్ చంద్రశేఖర్ మెల్లిగేరి నిర్మించిన ‘సందిగ్ధ’, సోమప్రియా బోస్ నిర్మించిన ‘కటకః – To Revive An Old వరల్డ్’, పుర్వాంగీ రాజన్ నిర్మించిన ‘చుప్పి’, ఉత్కర్ష బలరాం నిర్మించిన ‘నాన్ దెవృ’, ఎస్ వెంకట నారాయణ మూర్తి నిర్మించిన ‘ఫలక్’, సుస్మిత కాళంగి నిర్మించిన ‘అంతర్గత’, సిద్ధి యాదవ్ నిర్మించిన ‘Trivial Pursuit’… ఈ 8 చిత్రాల ప్రీమియర్ లని ప్రదర్శిస్తున్నారు.

AISFM గ్రాడ్ ఫెస్టివల్ 2019 లో భాగంగా జరిగిన ఈ చిత్రాల ప్రీమియర్ కి తెలుగు సినీపరిశ్రమ ప్రతిభావంతులు విజయేంద్ర ప్రసాద్, సుమంత్ యార్లగడ్డ, అడివి శేష్, AISFM డైరెక్టర్ శ్రీమతి అమల అక్కినేని ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

AISFM చైర్మన్, కింగ్ అక్కినేని నాగార్జున యంగ్ ఫిలిం మేకర్స్ ని అభినందిస్తూ, ” మీరు సరైన సమయంలో సరైన చోట ఉన్నారు. ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. ప్రయోగాలు చేయండి, కొత్తవి అర్ధం చేసుకోండి, కష్టపడండి, ఎదగండి. సినిమాల పట్ల మీకున్న ప్యాషన్, ప్రేమ ని ఇంకా ఇంకా పెంచుకోండి. అల్ ది బెస్ట్” అన్నారు

AISFM స్టూడెంట్స్ లో సృజనాత్మకమైన ఆలోచనల్ని పెంపొందించడం, సినిమా కి సంబంధించి టెక్నికల్ అంశాల గురించి అవగాహన కల్పించడం చేస్తుంది. వారు తమ చిత్రాల్ని నిర్మించడానికి అనువుగా వరల్డ్ క్లాస్ స్టూడియో, పరికరాల ని వారికి AISFM అందుబాటులో ఉంచుతుంది. టాలెంట్ ని ప్రోత్సహిస్తూనే విభిన్నమైన అంశాల పై విద్యార్థులు తమ అభిప్రాయాలకి అనుగుణంగా పనిచేసే వాతావరణం కల్పిస్తుంది.

AISFM డైరెక్టర్ అమల అక్కినేని స్టూడెంట్స్ ని అభినందిస్తూ, వారి ఉన్నత భవిష్యత్తుని కాంక్షిస్తూ, “మంచి సినిమా అంటే మంచి కథ, యాక్టింగ్, కెమెరా మాత్రమే కాదు. ప్రేక్షకులలో అంతర్మధనం జరిగేలా చేయగలిగేది. చెప్పాలనుకునే విషయం మీద పూర్తి అవగాహనతో అవసరమైనవి అన్ని సమకూర్చినప్పుడే ఇది సాధ్యం అవుతుంది. టీం గా పనిచేయడం చాలా అవసరం. ఇక్కడ స్టూడెంట్స్ ఫిలిం మేకింగ్ మాత్రమే కాకుండా ఒకరితో ఒకరు తమ ఆలోచనలు పంచుకోవడం, ఫీడ్ బ్యాక్ తీసుకోవడం, ఒక టీం గా కలిసి పనిచేయడం నేర్చుకుంటారు.” అన్నారు.

Vijayendra Prasad garu announces scriptwriting major for Bachelors/Masters programs at the AISFM grad film festival.

Hyderabad, May 5th: Shri Vijayendra Prasad , screenwriter for blockbusters like Baahubali and Bajrangi Bhaijaan announced a specialized creative major for Bachelors and master’s program at AISFM. Speaking at the AISFM grad film festival, a curated show of films by graduating students of Annapurna International School of Film and Media.
He comments, “Stories should be narrated. You start with an idea and then build on it. Film making is all about our ability to grasp at an idea, sense its potential, and breathe life in it. The more observant we are of our surroundings, the more sensitive we become and the better is our capability to narrate a powerful story. Graduation Films is the beginning of this journey…”

The 2-day Festival opened yesterday with the premiere of films made by the graduating students dealing with 8 different entertaining and thought provoking subjects.

The list of film includes “Inaam” by Rashmit kaur , “SANDHIGDHA” by Akash Chandrashekhar Melligeri , “CATAKAH – To revive an old World” by Somapriya Bose, “CHUPPI” by Purvangi Ranjan , “NAAN DEVRU” by Uthkarsha Balaram , “Falak” by S Venkat Narayana Murthy, “ANTHARGATHA “ by Susmitha Kalangi, “Trivial Pursuit” by Siddhi Yadav
The premiere of the AISFM Grad Festival 2019 was attended by industry luminaries Mr. Vijayendra Prasad , Mr. Sumanth Yarlagadda and Mr. Adivi Sesh and AISFM director Ms. Amala Akkineni
Superstar, Chairman of AISFM, Akkineni Nagarjuna Congratulated the young filmmakers and remarked “You are in the right place at the right time , and so use this opportunity to the fullest, keep experimenting , keep exploring , keep watching ; work hard and do not give up your passion and enthusiasm for films , all the best”
At AISFM, we mentor students on various creative and technical aspects of filmmaking and ensure students get the experience of working in a world-class studio using state-of- the- art-equipment while making their grad films. We encourage young talent to work on diversified topics to bring new perspectives.
Congratulating the students and wishing them a great future, Director of AISFM Amala Akkineni said “A good film is not just the story, the acting, the camera and lights… but something that stirrs a deeper response in the audience, when everything comes together well; when the ingredients are brought together with understanding. Collaboration is integral to Film Making and our students not only learn the Art and Craft of Film Making; but also, experience the importance and criticality of co-ordination, collaboration and feedback.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here