రివ్యూ: బోయపాటి మార్క్ సినిమా ‘వినయ విధేయ రామ’

0
79

రేటింగ్: 3
మాస్ ఇమేజ్ వున్న ఇద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతోందంటే… అభిమానులకు పండగే. అందులోనూ ఇద్దరూ తమ గత చిత్రాలతో విజయాలు సాధించివున్నారు. అలాంటి వారే బోయపాటి, రామ్ చరణ్. ఎప్పటి నుంచో రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాలని బోయపాటి ప్రయత్నిస్తున్నాడు. అది ఇప్పటికి ఫలించింది. డి.వి.వి.దానయ్య నిర్మాతగా తరకెక్కిన ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్. తమిళ నటుడు ‘జీన్స్’ ప్రశాంతో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషించాడు. ఇలా భారీ తారాగణంతో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ ఈ రోజే విడుదలైంది. మరి ఈ చిత్రం ఏమాత్రం మాస్ ప్రేక్షకుల్ని మెప్పించిందో చూద్దాం పదండి.

క‌థ‌:

న‌లుగురు అనాథ పిల్ల‌లు చెత్త‌కుప్ప‌ల్లో పేపర్లు ఏరుకుంటూ ఉంటారు. వారి ప్రాణాల‌కు అనుకోకుండా ప్రమాదం ఏర్ప‌డుతుంది. వారు చనిపోతామ‌ని అనుకుంటున్న స‌మ‌యంలో ఓ చిన్న‌పిల్లాడు ఏడుపు విన‌ప‌డుతుంది. ఆ ఏడుపు విన్న‌వారికి చ‌నిపోవాలనే ఆలోచ‌న పోయి.. బ్ర‌త‌కాల‌నుకుంటారు. త‌మ‌కు దొరికిన పిల్ల‌వాడికి రామ్ అనే పేరు పెడ‌తారు. అలా న‌లుగురు కాస్త ఐదుగురు అవుతారు. అన్న‌ల కోసం రామ్ త‌న చ‌దువు మానుకుని వారి చ‌దువు కోసం పాటు పడ‌తాడు. క్ర‌మంగా రామ్ స‌హా అంద‌రూ పెరిగి పెద్ద‌వుతారు. రామ్‌(రాంచ‌ర‌ణ్‌)కు దూకుడు ఎక్కువ‌. ఎక్క‌డ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటాడోన‌ని అత‌ని పెద్దన్న భువ‌న్ కుమార్(ప్ర‌శాంత్‌) .. ఎవ‌రితో గొడ‌వ ప‌డొద్దు అంటూ మాట తీసుకుంటాడు. వైజాగ్‌లోని రామ్ అన్న‌య్య బై ఎలక్ష‌న్స్‌లో పందెం ప‌రుశురాం(ముఖేష్ రుషి) బావ మ‌రిది బ‌ల్లెం బ‌ల‌రాం(హ‌రీష్ ఉత్త‌మ‌న్‌) ఎదురు నిలిచి ఎల‌క్ష‌న్స్ సజావుగా సాగేలా చూస్తాడు. భువ‌న్‌కు ఎదురు వవ్చిన ప‌రుశురాం మ‌నుషుల‌ను రామ్ చిత‌గ్గొడ‌తాడు. ప‌గ‌బ‌ట్టిన ప‌రుశురాం ఎస్పీ స‌హ‌కారంతో అంద‌ర‌నీ ఎన్‌కౌంట‌ర్ చేయాల‌నుకుంటాడు. అక్క‌డ‌కు రామ్ కూడా వ‌స్తాడు. అయితే అనుకోకుండా బీహ‌ర్ నుండి వ‌చ్చిన రాజు భాయ్‌(వివేక్ ఒబెరాయ్ ) మ‌నుషులు రామ్ కుటుంబాన్ని చంపాల‌ని చూస్తే.. రామ్ అంద‌రినీ చంపేస్తాడు. బీహార్ ముఖ్య‌మంత్రి(మ‌హేష్ మంజ్రేక‌ర్‌) వ‌చ్చి రామ్‌తో మాట్లాడటం చూసిన ఎస్‌.పి రామ్ బ్యాగ్రౌండ్‌కు భ‌య‌ప‌డి పారిపోతాడు. ఇంత‌కు రామ్‌ను క‌ల‌వ‌డానికి బీహార్ ముఖ్య‌మంత్రి ఎందుకు వ‌స్తాడు? రాజు భాయ్‌కి, రామ్‌కు ఉన్న విరోధం ఏంటి? అస‌లు రాజుభాయ్ వ‌ల్ల రామ్ కుటుంబానికి ఎలాంటి న‌ష్టం జ‌రుగుతుంది? రామ్ త‌న కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..!

కథ.. కథనం విశ్లేష‌ణ‌: బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా అన‌గానే ఓ అంద‌మైన కుటుంబం, అంత‌కు మించి హింస ఉన్న యాక్ష‌న్ ఎపిసోడ్స్ గురించి ఆలోచించ‌క్క‌ర్లేదు. అవి రెండూ పుష్క‌లంగా ఉన్న సినిమా `విన‌య విధేయ రామ‌`. న‌లుగురు అనాథ‌లు క‌లిసి పెంచుకున్న మ‌రో అనాథ రామ్‌. సొంతంగా ఆసుప‌త్రి ఉన్న డాక్ట‌ర్ వీరికి ఆశ్ర‌య‌మిస్తాడు. కొన్నేళ్ల పాటు న‌లుగురు అన్న‌ద‌మ్ములూ క‌లిసి త‌మ్ముడిని చదివించుకుంటారు. కానీ ఒక సంద‌ర్భంలో త‌మ్ముడు త‌న అన్న‌ల‌కు అండ‌గా నిల‌బ‌డి వాళ్ల‌ని చ‌దివిస్తాడు. ఇలా ప్రారంభమైన సినిమా ఆ తరువాత యాక్షన్ పార్టే ప్రధానంగా ముందుకు సాగుతుంది. ఓ వైపు క్లాస్ ఆడియన్స్ కు కావాల్సిన ఫ్యామిలీ ఎమోషన్స్ ను అందంగా చెబుతూనే… మరోవైపు బి,సి సెంటర్ల ప్రేక్షకులకు కావాల్సిన యాక్షన్ విందును సంపూర్ణంగా వడ్డించేశాడు బోయపాటి. త‌న హీరో బ‌లాన్ని బాగా వాడుకున్నాడు. యాక్ష‌న్ ఎపిసోడ్స్ తెర‌మీద చూపించడంలో బోయ‌పాటి ఘ‌నాపాటి అనే విష‌యం ఈ చిత్రం ద్వారా మ‌రో సారి రుజువైంది. రామ్‌చ‌ర‌ణ్ హీరోయిజం అడుగ‌డుగునా ఎలివేట్ అయింది. నిర్మాత పెట్టిన ఖ‌ర్చు తెర‌మీద భారీగా క‌నిపించింది. ప్ర‌తి ఫ్రేమూ నిండుగా క‌నిపించింది. దేవిశ్రీ పాట‌లు, కెమెరాప‌నిత‌నం, లొకేష‌న్లు, సెట్లు, కాస్ట్యూమ్స్, హార్స్ ఎపిసోడ్‌, న‌టీన‌టుల న‌ట‌న సినిమాకు ప్ల‌స్ పాయింటే. డైలాగులు బావున్నాయి. `ఉచ్చ‌పోయిస్తా` అని ముఖేష్ రుషి అన్న‌ప్పుడు రామ్‌చ‌ర‌ణ్ చూపించిన నటన బీసీ సెంట‌ర్ల‌కు క‌నెక్ట్ అవుతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే సినిమా ‘వినయ విధేయ రామ’. గో అండ్ వాచ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here