‘విశ్వామిత్ర’ సెన్సార్ పూర్తి… జూన్ 14న విడుదల..!!

0
38

అనగనగా ఓ సాధారణ మధ్యతరగతి అమ్మాయి. జీవితం సంతోషంగా, సాఫీగా సాగుతుందన్న సమయంలో సమస్యలు ఆమెను చుట్టుముడతాయి. వాటిని ఓ అజ్ఞాత వ్యక్తి పరిష్కరిస్తారు. అతడు ఎవరు? ఆమె కథలో మనిషి మేథస్సుకు అందని సృష్టి రహస్యాలు ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోమంటున్నారు రాజకిరణ్. ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘విశ్వామిత్ర’.

ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్., రాజకిరణ్ నిర్మిస్తున్న సినిమా ‘విశ్వామిత్ర’. నందితారాజ్, ‘సత్యం’ రాజేష్ జంటగా నటించారు. అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ‘గీతాంజలి’, ‘త్రిపుర’ వంటి థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన రాజకిరణ్ దర్శకత్వం వహించారు. ఇటీవల సినిమా సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికేట్ లభించింది. జూన్ 14న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శక, నిర్మాత రాజకిరణ్ మాట్లాడుతూ “సినిమా చూశాక సెన్సార్ సభ్యులు బావుందని మెచ్చుకున్నారు. సెన్సార్ బృందం ప్రశంసలు మా చిత్రబృందంలో సినిమాపై నమ్మకాన్ని మరింత పెంచాయి. ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే అని చెప్పే ప్రయత్నమే ‘విశ్వామిత్ర’. మధ్యతరగతి అమ్మాయిగా నందిత, ఆమెకు సహాయం చేసే వ్యక్తి పాత్రలో ‘సత్యం’ రాజేష్, నందిత బాస్‌గా అశుతోష్ రాణా, నందిత స్నేహితుడిగా తమిళ నటుడు ప్రసన్న నటించారు. ఆల్రెడీ సినిమా బిజినెస్ పూర్తయింది. అలాగే, సినిమా హిందీ,తెలుగు శాటిలైట్ హక్కులను ప్రముఖ ఛానల్ ‘జీ తెలుగు’ మంచి ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. లవ్ థ్రిల్లర్ జానర్ లో, వాస్తవ ఘటనల ఆధారంగా… ‘గీతాంజలి’, ‘త్రిపుర’ తరహాలో థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రూపొందించాం. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా” అన్నారు.

విద్యుల్లేఖ రామన్, చమ్మక్ చంద్ర, ‘కార్టూనిస్ట్’ మల్లిక్, జీవా, రాకెట్ రాఘవ, సి.వి.ఎల్ నరసింహారావు, ఇందు ఆనంద్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మాటలు: వంశీకృష్ణ ఆకెళ్ళ, ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, ఎడిటర్: ఉపేంద్ర, మ్యూజిక్: అనూప్ రూబెన్స్, యాక్షన్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: సుచిత్ర – భాను, ఆర్ట్: చిన్నా, కో-డైరెక్టర్: విజయ్ చుక్కా, పి.ఆర్.ఓ: సురేంద్ర కుమార్ నాయుడు – ఫణి కందుకూరి, నిర్మాతలు: మాధవి అద్దంకి, రజనీకాంత్, రాజకిరణ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజకిరణ్

========================

*’ Vishwamitra’ completes Censor; Release on June 14!*

A middle-class woman gets along with everyone as if they are her own. When she faces a big problem in her life, an unknown person comes to her rescue. Who is that unknown individual in ‘Vishwamitra’? That’s the suspense. A thriller directed by Raajkiran of ‘Geethanjali’ and ‘Tripura’ fame, the film’s story links the creation and human imagination.

Starring also Nandita Raj, Sathyam Rajesh, Prasanna Kumar and Ashutosh Rana, the film is presented by Phani Tirumalashetty. The exciting thriller is produced by Madhavi Addanki, S Rajinikanth and Raajkiran.

The film has completed its Censor formalities. It has got ‘U/A’ certificate. The makers are planning to release the movie on June 14.

Announcing the release date, producer-director Raajkiran says, “The Censor Board members have appreciated our movie. Our faith in the product has only increased after listening to their praises. ‘Vishwamitra’ says that anything is possible in the Universe. Nandita will be seen as a middle-class girl, while Sathyam Rajesh is the one who helps her. Ashutosh Rana plays the heroine’s boss, while her friend’s character is played by Prasanna. We have completed the business dealings related to the film. Zee Telugu has acquired the Hindi and Telugu satellite rights of at a fancy price. This film is based on real incidents and belongs to the romantic thriller genre. It’s as thrilling as films such as ‘Geethanjali’ and ‘Tripura’ and is a family entertainer.”

Also featuring are Vidyullekha Raman, Chammak Chandra, Cartoonist Mallik, Jeeva, Rocket Raghava, CVL Narasimha Rao, and Indu Anand.

Music is by Anup Rubens. Cinematography is by Anil Bandari. Editing is by Upendra. Action choreography is by Dragon Prakash. Choreography is by Suchitra-Banu. Art direction is by Chinna. Dialogues are by Vamsikrishna Akella. Co-Direction is by Vijay Chukka. Story and screenplay are by director Raajkiran

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here