రివ్యూ: W/O రామ్

0
1141

తారాగణం: మంచు లక్ష్మి, సమ్రాట్ రెడ్డి, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు
సంగీతం: రఘు దీక్షిత్
నిర్మాణం: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు: టి.జి. విశ్వప్రసాద్, లక్ష్మి మంచు
రచన, దర్శకత్వం: విజయ్ యెలకంటి
రేటింగ్: 3
గుండెల్లో గోదావరి, చందమామ కథలు, దొంగాట తదితర చిత్రాలతో మంచి నటిగా గుర్తింపు పొందింది మంచు లక్ష్మీ. తాజాగా ‘W/O రామ్’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చింది. విజయ్ యెలకంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మంచు లక్ష్మీతో పాటు టి.జి.విశ్వప్రసాద్ నిర్మించారు. సమాజంలో తరచుగా జరుగుతున్న ఓ ఇన్సిడెంట్ ను బేస్ గా చేసుకుని థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం థ్రిల్ కు గురి చేసిందో చూద్దాం పదండి.

కథ: దీక్ష(మంచు లక్ష్మీ) ఓ అనాథ. చిన్నప్పటి నుంచే పిన్ని ఇంట్లో పెరిగి తనకు ఇష్టమైన రామ్(సమ్రాట్ రెడ్డి)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఇద్దరూ అన్యోన్యంగా వుంటూ వుండే సమయంలో ఊహించని పరిణామం ఎదురై రామ్ హత్యగావించబడుతాడు. దాంతో దీక్ష ఒంటిరిగా మారి.. తన భర్త హత్యకు గల కారణాలను, హత్య చేసిన హంతకుడికోసం అన్వేణ కొనసాగిస్తుంది. మరి తన భర్తను హత్యచేసిన హంతకుడిని కనుక్కొందా? అసలు తన భర్తను ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారనేదే మిగతా కథ.

కథ.. కథనం విశ్లేణ: ‘W/O రామ్’ ఓ థ్రిల్లర్ మూవీ. ఇప్పటి వరకూ తెలుగులో ఇలాంటి కథలు రాలేదనే చెప్పొచ్చు. అందుకే మంచు లక్ష్మీ.. దర్శకుడు చెప్పిన కథను నమ్మి తానే నిర్మించి ప్రధాన పాత్రలో నటించారు. బాలీవుడ్లో విడుదలై విజయం సాధించిన అనామిక కథకు కొంత సిమిలారిటీ వున్నా… మంచు లక్ష్మీ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో అలాంటి వేమీ గుర్తుకు రాకుండా చేసింది. సినిమా మొదలైంది మొదలు.. చివరి దాకా.. ఎక్కడా కథలో డీవియేట్ కాకుండా దర్శకుడు కథ.. కథనాలను నడిపించిన తీరు.. ప్రేక్షకుల్ని ఉత్కంఠతకు గురి చేస్తుంది. చివరి నిమిషం వరకు ఓ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి రాసుకునన పకడ్బంధీ కథ.. కథనాలు ప్రేక్షకుల్ని థ్రిల్ కు గురిచేస్తాయి. అనవసరమైన సీన్లను గానీ.. కామెడీ సీన్లను గానీ.. కథ.. కథనాలకు అడ్డుపడేలాంటి పాటలు గానీ లేకుండా తెరకెక్కిన ‘W/O రామ్’ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తందనడంలో సందేహం లేదు.
మంచు లక్ష్మీ మరోసారి తన కెరీర్ బెస్ట్ సినిమాలో నటించారు. ఇంతకు ముందు చాలా చిత్రాల్లో ఆమెకు నటించిన అనుభవం వున్నా… ఇందులో మాత్రం ఓ గృహిణి పాత్రలో చక్కగా నటించారు. కథ.. కథనాలను మొత్తం తన భుజాల మీద వేసుకుని ముందుకు నడిపించారు. తన నటనతో మరోసారి తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు. మర్డర్ మిస్టరీని ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ఆమె కనబరచిన నటన ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుంటుంది. తనకు జోడీగా నటించిన సామ్రాట్ రెడ్డి నటన కూడా పర్వాలేదు. వున్నది కాసేపే అయినా తన పాత్రకు న్యాయం చేశారు. అలానే విలన్ పాత్రలో నటించిన ఆదర్శ్ బాలకృష్ణ కూడా బాగా చేశారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ నటించి మెప్పించారు. అలానే ప్రియదర్శి కూడా త్రూ అవుట్ సినిమా అంతా వుండి పోలీస్ కానిస్టేబుల్ గా కనిపించి మెప్పించారు. మిగతా పాత్రలన్నీ పర్వాలేదు.
దర్శకుడు విజయ్ యెలకంటి రాసుకున్న కథ.. కథనాలు బాగున్నాయి. ఆద్యంతం ప్రేక్షకుల్ని థ్రిల్ కు గురిచేసే స్క్రీన్ ప్లే రాసుకుని సినిమాను నడిపించిన తీరు బాగుంది. ఎక్కడా బోరింగ్ కు గురి కాకుండా సినిమాను తెరకెక్కించిన తీరు అటు మాస్.. ఇటు క్లాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు నేపథ్య సంగీతం మరో ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. మంచి విజువల్స్ తెరమీద కనిపిస్తాయి. రెండు గంటల్లోపే సినిమా అయిపోతుంది.. కాబట్టి ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించారు. సో.. గో అండ్ వాచ్ ఇట్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here