మూడు చిత్రాల్లో.. దేనికి ఎంత క్రేజు!?

0
106

ఈ వారం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఈ మూడు చిత్రాల్లో వేటికి ఎక్కువ క్రేజ్ వుందంటే… దేనికీ ప్రేక్షకులు ఏకగ్రీవంగా చెప్పలేని పరిస్థతి. ఎందుకంటే.. ఓ సినిమాకు హీరో మైనస్ అయితే… మరో సినిమాకు దర్శకుడు మైనస్. మరో సినిమాకు ఇద్దరూ ప్లస్సే. అదేలాగో చూద్దాం పదండి.

‘జయ జానకి నాయక’ చిత్రానికి హీరో మైనస్. ఎందుకంటే అతని గత చిత్రాలు అంతంత మాత్రంగానే ఆడాయి. అల్లుడు శీను యావరేజ్ కాగా.. స్పీడున్నోడు అట్టర్ ఫ్లాప్. అయితే అతని వెనకాల బోయపాటి లాంటి స్టార్ డైరెక్టర్ అండగా వుండటం ఈ సినిమాకు కొండంత అండ. వరుస విజయాలతో బోయపాటి ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. తన గత చిత్రం ‘సరైనోడు’ వందకోట్లకు పైగా వసూలు చేసి బన్ని కెరీర్లోనే అత్యధిక వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. దాంతో ఈ చిత్రంపై ఇండస్ట్రీలో ఈ చిత్రంపై విపరీతమైన బజ్ వుంది. ఈ చిత్రానికి కూడా స్టార్ కాస్ట్ హైలెవెల్లో వుంది. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్, జగపతిబాబు, శరత్ కుమార్ లాంటి వాళ్లు ఈ చిత్రాన్ని మోయడానికి ఎలాగూ వున్నారు. చిత్ర బడ్జెట్టు రూ.56 కోట్ల వరకు అయినా… బిజినెస్ కూడా అదే రేంజ్ లో అయిందనే టాక్ వుంది. దానికి కారణం.. దర్శకుడు బోయపాటి శీనుకు వున్న బాక్సాఫీస్ బలమే. అయితే ఈ సినిమా గతంలో వచ్చిన ఓ ఫేమస్ సినిమా స్టోరీనే అని ఇండస్ట్రీలో టాక్. రాంకీ, నిరోషా, విజయ్ కాంత్ నటించిన సింధూరపువ్వు కథకు ఇంచుమించు దగ్గరకు వుంటుందని అందరూ అంటున్నారు. మరి ఇందులో నిరోషా వితంతువుగా కనిపిస్తుంది. మరి రకుల్ పాత్ర ఇందులో కూడా ఫస్ట్ నుంచే ఏడుస్తూ కనిపిస్తుందని.. అంటున్నారు. పరువుకోసం పాకులాడే పెద్ద ఆయన పాత్రలో జగపతిబాబు ఇందులో నటిస్తున్నాడు. దాన్ని బట్టి చూస్తే… ఈ సినిమా కథలో కొత్తదనమేది వుండదనిపిస్తోంది. ఇందులో ‘పరువు’ కోసం హత్యలేమైనా జగ్గుబాయ్ చేస్తాడేమో చూడాలి.

మరో క్రేజీ ప్రాజెక్టు ‘నేనే రాజు నేనే మంత్రి’. బాహుబలి, ఘాజీ లాంటి వరుస హిట్లతో వున్న రానా నటించిన చిత్రం ఇది. అయితే ఈ చిత్రానికి దర్శకుడు తేజ మైనస్. ఎందుకంటే.. గత కొన్నేళ్లుగా తేజకు హిట్లు లేవు. అలాంటి తేజ.. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడంటే.. మొదట్లో ఈ ఫ్లాపు డైరెక్టర్ తో రానా ఎందుకు చేస్తున్నాడబ్బా అనకున్నారంతా. అయితే ట్రైలర్ విడుదలైన తరువాత మాత్రం ‘తేజ ఈజ్ బ్యాక్’ అంటున్నారు. ఇంటెన్స్ పొలిటికల్ స్టోరీతో తెరకెక్కింది కావడంతో.. ఈ సినిమాపై పాజిటివ్ బజ్ వున్నా.. ఎక్కడో అనుమానం తంతోంది. ఇది ఫ్లాట్ స్టోరీ. ఓ వడ్డీ వ్యాపారీ.. పొలిటికల్ లీడర్ గా ఎలా ఎదిగాడనేది ఇందులో చూపించబోతున్నాడు తేజ. అలానే జోగేంద్ర.. రాధ అనే భార్యభర్తల మధ్య వున్న లవ్ ను కూడా చూపించబోతున్నాడు. లవ్ స్టోరీలను తీయడంలో తేజ దిట్ట. అయితే మరి ఇందులో వీరిద్దరి లవ్ స్టోరీ ఏమాత్రం ఈ తరానికి ఆకట్టుకుంటుందో చూడాలి. అంతేకాదు.. జయలలిత మరణం తరువాత తమిళనాడులో మలుపులు తిరగిన కొంత తమిళ రాజకీయాలను కూడా ఇందులో చూపించారని… అవి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా రుచించవనే అంటున్నారు. అలానే క్లైమాక్స్ లో కాజల్ చనిపోడవం కూడా మైనస్సే అంటున్నారు. మరి ఇప్పటికే ట్రైలర్ కొచ్చిన పాజిటివ్ బజ్.. రానాకు ప్రస్తుతం వున్న క్రేజ్.. ఈ చిత్రాన్ని ఒడ్డునెక్కించాలి. రానా తండ్రి సురేష్ బాబు ఈ చిత్రానికి వెన్నుదన్నుగా వుండటం కూడా కొండంత అండ. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. మూడు భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం సాటిలైట్ రైట్స్ ను ఇప్పటికే బాలీవుడ్లో అమ్మేశారు కూడా.

నితిన్.. దర్శకుడు హనురాఘవ పూడి.. ఇద్దరూ ‘లై’ చిత్రానికి బలం. ‘అ ఆ’ చిత్రంతో నితిన్… ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ విజయంతో దర్శకుడు హనురాఘవ పూడి ఊపుమీద వున్నారు. వీరిద్దరి కాంబినేషన్ కి తోడు.. 14రీల్స్ ఎంటర్టైన్ మెంట్ అండ. దాంతో ఈ చిత్రంపై మొదటి నుంచి పాజిటివ్ నెస్ వుంది ఇండస్ట్రీలో. అయితే ఇటీవల 14రీల్స్ కి ఓ సూపర్ హిట్ సినిమా లేదు. అదొక్కటే మైనస్. అయితే దర్శకుడు.. హీరో మేజిక్కే సినిమాకు ప్రధానం కాబట్టి.. ఈచిత్రంపై నితిన్ అభిమానుల్లో మంచి క్రేజ్ వుంది. ఇందులో నితిన్ బేర్డ్ లుక్ కూడా కొత్తగా వుండటంతో యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. సంగీతం కూడా బాగుంది. దాంతో ‘లై’ చిత్రంపై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ వుంది.

చూడాలి.. మరి మూడు చిత్రాలూ.. బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సీజన్లోలాగ నిలబడతాయా? లేక ఏవైనా పోటీని తట్టుకోలేక చతికిల పడతాయా అనేది. మూడు చిత్రాలు కూడా హిట్టైతే.. సంక్రాతి సీజన్ లానే.. వినాయకచవితి సీజన్ కూడా చిత్ర సీమకు బాగా కలిసొచ్చినట్టే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here