నూతన చిత్రంతో యంగ్ హీరో సంజోష్

0
48

మొదటి సినిమా ‘బేవర్స్’తో మంచి నటుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరో సంజోష్. ఈ చిత్రంలో ఆయన పర్ఫామెన్స్‌కు అందరూ ఆకర్షితులయ్యారు. నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో వచ్చిన బేవర్స్‌లో సంజోష్ తన ఎమోషనల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. రొమాన్స్, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్నింట్లో సంజోష్ తన మార్క్ చూపించారు. సంజోష్ తాజాగా తన రెండో సినిమాకు సంబంధించిన ప్రకటన చేశారు. నేడు (జూలై 13) ఆయన పుట్టిన రోజు సందర్భంగా తన ప్రాజెక్ట్‌ను ప్రారంభించేశారు. క్యాన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌‌లో సంజోష్ తన రెండో చిత్రాన్ని చేస్తున్నారు.

సంజోష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. మేకర్లు సినిమాకు సంబంధించిన ప్రకటన చేశారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని మేకర్లు తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here