మరోసారి జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయిన నర్సాపురం వైసీపీ ఎంపీ

0
259

ప్రఖ్యాతి గాంచిన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో చందనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి..అయితే కోరోనా వ్యాధి ప్రభలుతున్న నేపథ్యంలో భక్తులు లేకుండానే ఉత్సవాలు మొదలయ్యాయి.. అయితే ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా సాక్షాత్తూ సింహాచలం బోర్డు ఛైర్మన్ కుటుంబానికే ఆలయ ప్రవేశం నిరాకరించడం సంచలనం సృష్టిస్తోంది..
దీనికి కరోనా వ్యాధిని సాకుగా చూపుతున్నారు..అయితే ఈ చర్య పట్ల వైఎస్సార్సీపీ నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణం రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.. ప్రభుత్వం ఇతర మతాల ప్రార్థనా స్థలాల్లో ఐదు నుంచి 15 మందికి సామూహిక ప్రార్థనలు జరుపుకోవడానికి అనుమతినిస్తోందనీ..అలాంటిది సాక్షాత్తూ ఆ ఆలయానికి వేల ఎకరాలను ఇచ్చిన కుటుంబానికి చెందిన ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ సంచయిత సంచిత గజపతిరాజుకు, ఆమె తల్లి ఉమా గజపతిరాజుకు ఆలయ ప్రవేశం నిరాకరించడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు..
ఆయన రూలింగ్ పార్టీ నేత కావడంతో ఈ స్టేట్ మెంట్ కలకలం సృష్టిస్తోంది..
రఘు రామ కృష్ణం రాజు గత కొంత కాలంగా బీజేపీ తో టచ్ లో ఉంటున్నారు..
గతంలో ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తూ రఘురామ కృష్ణం రాజు వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు..
రఘురామ రాజు మొదటి సారి ఎంపీనే అయినా ప్రధాని మోడీ, అమిత్ షాలతో చాలా సన్నిహితంగా ఉంటున్నారు..పార్లమెంటు సెంట్రల్ హాల్ లో సాక్షాత్తూ మోడీ ..హలో రఘు.హౌ ఆర్ యూ అని పలకరించడం గతంలో చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే.. అంతేకాదు..ఆయన్ని అత్యంత ప్రాధాన్యం కలిగిన పార్లమెంట్ ఉపకమిటీకి ఛైర్మన్ గా నియమించారు…
జగన్ ను , ప్రభుత్వ నిర్ణయాల్ని వ్యతిరేకించడం ద్వారా జగన్ కు కోపం తెప్పించి పార్టీ నుంచి సస్సెండ్ కావడం ఆయన వ్యూహంగా చెబుతున్నారు.. అలా సస్సెండ్ అయిన తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం..రఘు రామ రాజు ను ఆంధ్రా బీజేపీ అధ్యక్షుడిని చేసి ఆ తర్వాత సీఏం క్యాండిడేట్ గా ప్రకటిస్తారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది..చూడాలి..జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here