• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

మా ఊరి పోలిమేర2 ట్రైలర్ విడుదల

admin by admin
October 14, 2023
in Cinema
0
మా ఊరి పోలిమేర2 ట్రైలర్ విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

మా వూరి పోలిమేర‘కు సీక్వెల్ గా రాబోతున్న చిత్రం మా వూరి పోలిమేర 2. శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బేన‌ర్ పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ నిర్మాత‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడు. స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.
చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణనంతర పనులను జరుపుకుంటోంది. ఈ చిత్రం నవంబరు 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లో విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ చిత్రాన్ని చూసి ఎంతగానో నచ్చిన ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ఈ చిత్ర హక్కులను ఫ్యాన్సీ రేటుతో కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన దర్శకుడు హరీష్ శంకర్, హీరో కార్తికేయ, నిర్మాత బన్నీవాస్ లు ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ ఓటీటీలో పోలిమేర 1 బాగుందని చాలా మంది చెప్పారు. చూడగానే నాకు కూడా బాగా నచ్చింది. కంటెంట్ చాలా బలంగా వుంది. పోలిమేర 2 కూడా అదే తరహాలో బాగుంటుందని అనుకుంటున్నాను. బన్నీవాసుతో నాకు మంచి రిలేషన్ వుంది. ఆయన ఈ సినిమాకు సపోర్ట్ గా వుండి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం దర్శకుడికి సినిమాలంటే ఎంత ఇష్టమో ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మంచి తెలుగు టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా ఆడియన్స్ కు సరికొత్త అనుభూతినిస్తుందనే నమ్మకం వుంది. ఈ సినిమాతో ఇందులో పార్ట్ అయిన నటీనటులకు
సాంకేతిక నిపుణుల అందరికి మంచి పేరు వస్తుంది‘ అన్నారు. బన్నీవాస్ మాట్లాడుతూ ’నాకు నచ్చి నేను ఈ సినిమాకు సపోర్ట్ చేస్తాను. వంశీ చేస్తున్న తొలి సినిమా ఇది. 2018 సినిమాను చూసి తెలుగులో మనం విడుదల చేద్దామని సజెస్ట్ చేసిన వంశీ ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు. అతని జడ్జ్ మెంట్ పై నాకు నమ్మకం వుంది. ఇది చాలా చిన్న కథ తప్పకుండా అందిరికి నచ్చుతుందనే నమ్మకం వుంది. సత్యం రాజేష్ కు కెరీర్ కు బాగా ప్లస్ అవుతుంది. పోలిమేర 3 కూడా వుంటుంది. మొదటి పార్ట్ చూడని వాళ్లకు కూడా పోలిమేర 2 అర్థమయ్యేటట్లు స్క్రీన్ ప్లే వుంటుంది. ఈ సినిమా అందరికి మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. పోలిమేర2 కు బాగా ఆడాలని కోరుకుంటున్నాను. హీరో కార్తీకేయ మాట్లాడుతూ ఇలాంటి సినిమాలు బిగ్ స్క్రీన్ పై చూస్తే చాలా మంచి అనుభూతికి లోనవుతారు. చాలా కష్టపడి చేసిన సినిమాలా అనిపిస్తుంది. తప్పకుండా సినిమా మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను అన్నారు. వంశీ నందిపాటి మాట్లాడుతూ నాకు అండగా వుంటూ, ఈ రోజు నేను ఈ స్థాయిలో వున్నానంటే బన్నీవాస్ కారణం. సినిమాను తప్పకుండా అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను అని తెలిపారు. గౌరికష్ణ మాట్లాడుతూ ఇలాంటి చిన్న సినిమాలకు అండగా వుండే బన్నివాస్, వంశీ నందిపాటి గారికి అభినందనలు, సినిమా విజయంపై మంచి నమ్మకం వుంది. నిజాయితీగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు అన్నారు. సత్యం రాజేష్ మాట్లాడుతూ ఈ సినిమా వంశీ నందిపాటికి నచ్చడంతో ఈ సినిమా ప్రయాణం ఇక్కడి వరకు రావడం ఆనందంగా వుంది. అన్నారు. దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ హరీష్ శంకర్, కార్తికేయ, బన్నీవాస్ గారు ఈ వేడుకకు రావడం పాజిటివ్ గా అనిపిస్తుంది పార్ట్ 1కు మించి పార్ట్ 2 వుండబోతుంది. వంశీ నందిపాటి సినిమాను విడుదల చేయడం ఎంతో ఆనందంగా వుంది. ఈ సినిమాను పార్ట్ 1కు 100 రెట్లు ఎంజాయ్ చేస్తారు. బాలాదిత్య మాట్లాడుతూ నేను రాజేష్ సినీ పరిశ్రమకు వచ్చి
20 సంవత్సరాలైంది పోలిమేర చూసిన ప్రతి ఒక్కరూ పార్ట్ 2 ఎప్పుడూ అని అడిగారు. పార్ట్ 1కు మించి ఎన్నో రెట్లు అద్బుతంగా వుంటుంది. పార్ట్ 1ను చూడనివాళ్లు తప్పకుండా చూసి పార్ట్ 2కు వస్తే మీ మెదళ్లకు చాలా పని వుంటుంది. ప్రతి సన్నివేశం ఎంతో అద్భుతంగా వుంటుంది. సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఈ సినిమాలో వుంటాయి. సత్యం రాజేష్ ఈ సినిమాతో పర్ ఫార్మెర్ అని నిరూపించుకున్నాడు‘ అన్నారు. ఈ వేడుకలో ఖుషేందర్, గెటప్ శీను, కామాకి, సాహితి
గ్యానీ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సంగీతంః గ్యాని;  సినిమాటోగ్ర‌ఫీః ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి;  ఎడిటింగ్ః శ్రీ వ‌ర‌;   ఆర్ట్ డైర‌క్ట‌ర్ః ఉపేంద్ర రెడ్డి చందా;  ఫైట్ మాస్ట‌ర్ః రామ్ మాస్ట‌ర్‌; ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూస‌ర్ః ఎన్‌.సి.స‌తీష్ కుమార్;   నిర్మాతః గౌరి కృష్ణ‌;  స్టోరి-స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైర‌క్ష‌న్ః డా.అనిల్ విశ్వ‌నాథ్‌.

MaaOoriPolimera 2 Trailer Out Now

MaaOoriPolimera 2 is Presented by Ghanababu under the banner of Srikrishna Creations, this film is being produced by Gourkrisena & Directed by Dr. Anil Viswanath. Satyam Rajesh,Dr. Kamakshi Bhaskarla, Getup Srinu, Rockend Mouli, Baladitya, Sahitya Dasari, Ravi Varma, Chilam Srinu, Akshatha Srinivas in lead Roles .

The film has completed its post-production work. The film is set to release in theatres worldwide on November 3. Popular distributor Vamsi Nandipati, bought the rights to this film at a fancy rate and released it worldwide. Meanwhile, the Trailer Launch event of this film was held on Saturday.

Director Harish Shankar, Karthikeya, and Bunnyvas released the Trailer of the film..
Harish Shankar said that Polimera 1 was good in OTT. I also liked it when I saw it. The content is veritably strong. I suppose Polimera 2 will be good in the same tone. I’ve a good relationship with Bunny Vasu. He’s supporting this movie and releasing this movie. The caravan of this movie shows how important the director of this movie loves pictures. Coming with a good Telugu title,the actors who shared in this movie
All specialized experts will get a good name. Bunny Vas said,’ I like it and I’ll support this film. This is Vamsi’s first film. Vamsi is releasing this movie after watching the 2018 movie and suggested that we release it in Telugu. I trust his judgment. I’m sure that this short story will be liked by everyone. Satyam will be a plus for Rajesh’s career. There’s also Polimera 3. The script of Polimera 2 is accessible indeed for those who haven’t seen the first part. I want this movie to give everyone a good break. I wish to play well for Polimera 2.

Karthikeya said that watching similar flicks on the big screen gives a veritably good feeling. It feels like a veritably hard- made movie. He said that he wanted the film to be a good success. Vamsi Nandipati said supporting me, moment I’m at this position because of Bunnyvas. I believe that everyone will surely like the movie. Gourkrisena said congratulations to Buunyvas and Vamsi Nandipati who are supporting similar small flicks and have good faith in the success of the film. Actually, the director has made this film.

Satyam Rajesh said that as Vamsi Nandipati liked this movie, he’s happy that the trip of this movie has reached this point. Said. DirectorDr. Anil Vishwanath said that it’s positive that Harish Shankar, Karthikeya, and Bunnyvas are coming to this form and there will be part 2 after part 1. It’s a great pleasure to release Vamsi Nandipati’s movie.

Balaaditya said that
It’s been 20 times since everyone who watched Polimera asked if there was ever a part 2. Part 1 is numerous times more amazing. Those who have not seen part 1 must watch it and come to part 2, your smarts will have a lot of work to do. Every scene is amazing. There are numerous surprises in the movie. Satyam Rajesh has proved himself with this film.

Previous Post

యాక్షన్ ఎంటర్ టైనర్… మధుర పూడిగ్రామం అనే నేను

Next Post

అక్టోబర్ 27న ‘మార్టిన్ లూథర్ కింగ్’ విడుదల

Next Post
అక్టోబర్ 27న ‘మార్టిన్ లూథర్ కింగ్’ విడుదల

అక్టోబర్ 27న 'మార్టిన్ లూథర్ కింగ్' విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.