• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, June 27, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

కె విశ్వనాథ్ గారి స్మారక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఫైనల్ స్క్రీనింగ్ విజేతలు వీరే…

Maari by Maari
November 9, 2023
in Cinema, deccanfilm.com, Movies, news, special
0
కె విశ్వనాథ్ గారి స్మారక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఫైనల్ స్క్రీనింగ్ విజేతలు వీరే…

Share and Enjoy !

Shares
Twitter

కె విశ్వనాథ్ గారి స్మారక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఫైనల్ స్క్రీనింగ్ మరియు విజేతల ప్రకటన బుధవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ సంధర్భంగా విజేతలను శాలువాలతో అల్లు అరవింద్, మంజు భార్గవి తదితరులు సన్మానించారు.

స్క్రీనింగ్‌ అనంతరం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ, విశ్వనాథ్‌ గారితో నేను యంగ్‌గా వున్నప్పుడే శుభలేఖ సినిమా తీశాను. అది అదృష్టంగా భావిస్తున్నా. ఆయన నాకు ఇచ్చిన గిఫ్ట్‌గా కూడా ఫీలవుతాను. విజేతలు 8 మంది స్టేజీ పైకి వచ్చారు. అందరిలోనూ ఎంతో టాలెంట్‌ వుంది. వీరంతా లఘు సినిమాను తీసి ప్రశసంలు పొందారు. మీ టాలెంట్‌ను మహావృక్షంలా మలుచుకోవాలని కోరుకుంటున్నాను. అన్ని సినిమాలు చూశాను. మంచి విలువలతో కూడినవిగా అనిపించాయి. ఈ సినిమాలు చూడగానే నేను తీసిన పాత సినిమాలు కూడా ఒకసారి చూడాలనిపించింది అని చెప్పారు.

నటి, డాన్సర్ మంజు భార్గవి మాట్లాడుతూ, లఘు చిత్రాలు ఎలా వుంటాయో అని మొదట్లో అనిపించింది. కానీ చూడగానే కథ, ఎమోషన్స్‌ ఇందులో వున్నాయి. రెండున్నర గంటలు గొప్ప ఎచీవ్‌మెంట్‌గా అనిపించాయి. ప్రతి షాట్‌ ఫిలిం చూశాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆనందంగావుంది. నా గురువుగారు వెంపటి చినసత్యం గారి వల్లే నేను డాన్సర్‌గా 2వేల స్టేజీ పెర్‌ఫార్మెన్స్‌ చేశాను. వారి స్పూర్తితో బామకలాపం చేశాను. అందులో భాగంగానే శివ, శ్రీనివాస, కృష్ణ పాత్రలు నేను వేశాను. విశ్వనాథ్‌గారి శంకరాభరణం నా కెరీర్‌ మార్చేసింది. కేరళలో 50పైగా పెర్‌ఫార్మెన్స్‌ చేశాను. 43 ఏళ్ళయినా ఆ సినిమా ఎఫెక్ట్‌ ఇంకా వుంది. దేశంలో ఎక్కడైనా డాన్స్‌ కాంపిటేషన్‌కు వెళితే నన్ను గుర్తుపట్టి నేను శంకరాభరణంలో చేసిన ఇంటర్‌వెల్‌ భాగాన్ని చక్కని పెయింట్‌గా వేసి గిఫ్ట్‌గా ఇచ్చేవారు. ఇప్పుడు ఈ షాట్‌ ఫిలింస్‌లోనూ విశ్వనాథ్‌గారి ఛాయలు కనిపించాయి అని తెలిపారు.

నటి అమల అక్కినేని మాట్లాడుతూ, విశ్వనాథ్‌ గారి మెమోరియల్‌ షాట్‌ పిలింకాంటెస్ట్‌ను ఇండికా ఫిలింస్‌ ఆర్గనైజింగ్‌ చేయడం ఆనందంగావుంది. యంగర్‌ జనరేషన్‌కు స్పూర్తిగా వుంది. మా మామగారు నాగేశ్వరరావుగారితో విశ్వనాథ్‌గారికి మంచి స్నేహసంబంధాలు వుండేవి. నేను చిన్నతనంలోగా ఉండగా. శంకరాభరణం చూశాను. నేను భరతనాట్యం కూడా నేర్చుకున్నాను. తెలుగు సినమాకు ఒక పిల్లర్ గా విశ్వనాథ్‌గారు నిలిచారు. ఆర్ట్‌, కల్చర్‌, డాన్స్‌, మ్యూజిక్‌ అన్నీ కలగలిపిన దర్శకుడు ఆయన. ఈరోజు నేను చూసిన లఘుచిత్రాలు మంచి కథలతో వున్నాయి. అరవింద్‌గారు ఇప్పటి ఫిలింమేకర్స్‌కు స్పూర్తిగా నిలిచారు అని అన్నారు.

ఇండికా పిక్చర్స్‌ అధినేత మట్లాడుతూ, ఈ లఘు చిత్రాలు ఇండియన్‌ కల్చర్‌ను వెలుగులోకి తీసుకురావాలని చేసినవి. గురుశిష్య పరంపరలో మన కల్చర్‌ ఇమిడి వుంది. అది రిఫ్లక్ట్‌ చేసేవిధంగా మా లఘు సినిమాలు వుంటాయి. నాలుగేళ్ళ క్రితమే ఇండికా పిక్చర్స్‌ నెలకొల్పాం. పాజిటివ్‌ ఫిలింస్‌, కల్చర్‌, హెరిటేజ్‌ పిలింస్‌ చేయాలనుకున్నాం. అందులో భాగంగా విశ్వనాథ్‌గారి జోనర్‌ చేయాలనుకున్నాం. ప్రతి ఏడాది కాంటెస్ట్‌ ఏర్పాటు చేస్తాం అని అన్నారు.

లఘు చిత్రాల దర్శకుడు మాట్లాడుతూ, ఇలాంటిఫ్లాట్‌పాం వుంటేనే మంచి సినిమాలు చేయగలం అని అన్నారు.
ఐశ్వర్య మాట్లాడుతూ, అనన్య పాత్ర రాస్తున్నప్పుడు నా ఎమోషన్స్‌ను కూడా రిప్లక్ట్‌ అయ్యాయి. నటీనటులు అంతా కొత్తవారే. సినిమా అయ్యేవంతవరకు చాలా ఎనర్జీతో వున్నారు. ఇక నేను డాన్స్‌ పెర్‌ఫార్మ్‌ చేసిన వాటికి విశ్వనాథ్‌గారు జడ్జిగా వచ్చేవారని గుర్తు చేసుకున్నారు.

కిట్టగాడు చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, ఫాదర్‌ అండ్‌ సన్‌ రిలేషన్‌తో 18 మంది టీమ్‌ కలిసి కిట్టుగాడి కథ చేశాం. అన్నపూర్ణ కాలేజీలో ఫిలిం మేకింగ్‌ చేశాను అన్నారు.
దర్శకుడు షణ్ముక కార్తీక్‌, హరికిరణ్‌, కె.ఎల్‌.నారాయణ, మైత్రీ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’ చిత్రం ప్రేక్షకులను మరింత మెప్పిస్తుంది: చిత్ర బృందం

Next Post

కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఒక సోషల్ ఇష్యూ ని ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నమే ‘మై నేమ్ ఇస్ శృతి’ – దర్శకుడు ఓంకార్

Next Post
కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఒక సోషల్ ఇష్యూ ని ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నమే ‘మై నేమ్ ఇస్ శృతి’ – దర్శకుడు ఓంకార్

కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఒక సోషల్ ఇష్యూ ని ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నమే ‘మై నేమ్ ఇస్ శృతి’ - దర్శకుడు ఓంకార్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ టీజర్, పాటల ఆవిష్కరణ

ఘనంగా ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ టీజర్, పాటల ఆవిష్కరణ

by Maari
June 26, 2026
0

సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్, హీరో ప్రియదర్శి కాంబో మూవీ “ఇడుపు కాయితం” ప్రారంభం

సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్, హీరో ప్రియదర్శి కాంబో మూవీ “ఇడుపు కాయితం” ప్రారంభం

by Maari
June 26, 2026
0

కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి మరో సెన్సేషనల్ సాంగ్ ‘జిగితార..’ రిలీజ్

కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి మరో సెన్సేషనల్ సాంగ్ ‘జిగితార..’ రిలీజ్

by Maari
June 20, 2026
0

సినిమా రివ్యూ: బాలన్ (Balan)

సినిమా రివ్యూ: బాలన్ (Balan)

by Maari
June 20, 2026
0

రివ్యూ: ‘దీవాన’ – ప్రేమకు లక్ష్యం తోడైతే జీవితమే గెలుస్తుందని చెప్పిన హృద్యమైన కథ

రివ్యూ: ‘దీవాన’ – ప్రేమకు లక్ష్యం తోడైతే జీవితమే గెలుస్తుందని చెప్పిన హృద్యమైన కథ

by Maari
June 20, 2026
0

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – బదిలీలు ఆపలేని న్యాయ పోరాటం

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – బదిలీలు ఆపలేని న్యాయ పోరాటం

by Maari
June 19, 2026
0

రివ్యూ: మా ఇంటి బంగారం… సమంత వన్‌ ఉమెన్‌ షో.. పక్కా ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్‌టైనర్!

రివ్యూ: మా ఇంటి బంగారం… సమంత వన్‌ ఉమెన్‌ షో.. పక్కా ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్‌టైనర్!

by Maari
June 19, 2026
0

“దీవాన” సరికొత్త ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

“దీవాన” సరికొత్త ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

by Maari
June 17, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.