ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు మంచి ఆదరణ ఉంది. యూత్ కి కనెక్ట్ అయ్యేలా లవ్ కథలను తెరమీద ఆవిష్కరిస్తే… అలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తాయి. అలాంటి సినిమానే దర్శకుడు మారేష్ శివన్ దర్శకత్వం వహించారు. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు హీరో హీరోయిన్లుగా నటించిన ఆ చిత్రం ‘అలా నిన్ను చేరి’. విజన్ మూవీ మేకర్స్ పతాకంపై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పించారు. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: గణేష్(దినేష్ తేజ్)కి చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. మంచి దర్శకుడై… పేరు తెచ్చుకోవాలనే తపన ఉన్న యువకుడు. అదేగ్రామానికి చెందిన దివ్య(పాయల్ రాధాకృష్ణ)అనే అమ్మాయి ప్రేమిస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే కెరీర్ లో స్థిరపడిన తరువాతే పెళ్లి గురించి ఆలోచిద్దాం అనుకుంటాడు గణేష్. ఇంతలో దివ్యకి తన మేనమామ(శత్రు)తో వివాహం అవుతుంది. మరి గణేష్ తాను అనుకున్నట్లుగా దర్శకుడిగా స్థిరపడినాడా? అందుకు సహకరించిన వారు ఎవరు? మేన మామను పెళ్లి చేసుకున్న దివ్య లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: చాలా మంది దర్శకులు యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీలను రాసుకుని… అందులో యూత్ కి ఓ చిన్న మెసేజ్ కూడా ఉండేలా చూస్తున్నారు. దర్శకుడు మారేష్ శివన్ కూడా ఇలాంటి వైవిధ్యమైన లవ్ స్టోరీని… సినిమా మీద ప్యాసన్ ఉండే ఓ యువకుని చుట్టూ కథ.. కథనాలు రాసుకుని తెరమీద ఆవిష్కరించిన తీరు ఆడియన్స్ ని అలరిస్తుంది. ఇద్దరు స్వచ్ఛమైన ప్రేమికుల మధ్య ఉండే బంధాన్ని చాలా భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలతో ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు. ఇలాంటి కథలు ఈ మధ్య కాలంలో చాలా అరదుగానే వచ్చాయని చెప్పొచ్చు. కెరీర్ ఫస్ట్… ఆ తరువాతే లవ్ కానీ… మరే ఇతర అనుకునే ఓ బాధ్యతగల యువకుడు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని కూడా వదులుకొని… కెరీర్ లో సక్సెస్ సాధించడం లాంటి పాయింట్ చుట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో చాలా సరదా సీన్లతో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా… ద్వితీయార్థంలో హెబ్బాపటేల్ రాకతో కాస్త… రొమాంటిక్ గా యూత్ కి కనెక్ట్ అయ్యేలా సీన్లను రాసుకోవడంతో… సెకెండాఫ్ చాలా తొందరగానే అయిపోయిందా అనిపిస్తుంది. అను పాత్రలో హెబ్బా పటేల్ ఎంట్రీ ఇవ్వడం… ఆ తరువాత వచ్చే సీన్లన్నీ యూత్ ని బాగా అలరిస్తాయి. ఓ క్లీన్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సరదాగా ఓ సారి చూసేయండి.
హీరోగా నటించిన దినేష్ తేజ్ దర్శకుడు కావాలనే తపన ఉన్న యువకుని పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. యాక్షన్, డ్యాన్స్ ల విషయంలో చాలా కేర్ తీసుకుని చేశారు. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన మెచ్యురిటీని చూపించారు. అతనికి జంటగా ఫస్ట్ హాఫ్ లో నటించిన పాయల్ కూడా హోమ్లీగానే కనిపిస్తూ… తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఎక్కడా ఒల్గారిటీ లేకుండా చక్కగా నటించింది. హెబ్బాపటేల్ పాత్ర కూడా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. కొన్ని సన్నివేశాల్లో కొంచెం హాట్ గా కనిపించి యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. శత్రు పాత్ర కూడా పర్వాలేదు. ఇక విలన్ గా నటించిన వ్యక్తి కూడా బాగానే చేశారు. జబర్దస్థ్ మహేష్ టైలర్ గాను, సేల్స్ మేనేజర్ గానూ కనిపించారు. చమ్మక్ చంద్ర కాసేపు ఉన్నా నవ్వించారు. యాంకర్ ఝాన్సీ… హీరోయిన్ తల్లి పాత్రలో నటించి మెప్పించారు.
దర్శకుడు మారేష్ శివన్ రాసుకున్న కథ, కథనాలు బాగున్నాయి. సాధారణంగా చిత్ర పరిశ్రమలో స్థిరపడాలనే యువకులు చాలా మంది ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటివి అన్నీ ఇందులో చూపించారు. ఓ యువకుడు దర్శకుడు కావాలనే తపనతో ప్రేమించిన అమ్మాయిని కూడా ఎలా త్యాగం చేశాడనే దాన్ని సందేశాత్మకంగా తెరమీద చూపించి సక్సెస్ అయ్యారు దర్శకుడు. ఈ చిత్రానికి సంగీతం అదనపు ఆకర్షణ. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. పాటలు, యాక్షన్ సీన్స్ ను చాలా చక్కగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా గ్రిప్పింగ్ గానే ఉంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పకుండా సినిమాని చాలా క్వాలిటీగా నిర్మించారు. సో… గో అండ్ వాచ్ ఇట్..!
రేటింగ్: 3