ఉప్పెన సినిమా ఫేమ్ వైష్ణవ తేజ్ …ఆ తరువాత రంగ రంగ వైభవంగా, కొండపొలం అని రెండు సినిమాల్లో నటించిన పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు . అయితే హీరోగా మాత్రం ఈ రెండు సినిమాలు అతనికి ఓ మోస్తారు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు వినూత్నంగా ఊర మాస్ యాంగిల్ ట్రై చేసి ఆదికేశవ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం గత కొద్ది కాలంగా వరుస వాయిదాలు పడుతూ వచ్చి ఎట్టకేలకు ఈరోజు థియేటర్లలో విడుదలైంది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండి.
స్టోరీ: హైదరాబాదులో జాబ్ కోసం వెతుకుతూ బిజీగా ఉంటాడు బాలు ( వైష్ణవ్ తేజ్). ఒక కాస్మెటిక్ కంపెనీకి సీఈఓ అయిన చిత్ర (శ్రీలీల).. ఆ కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చిన మాట తీరు నచ్చడంతో మెల్లిగా అతనిపై అట్రాక్షన్ పెరుగుతుంది. క్రమంగా వీళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలవడం గమనించిన ఆమె తల్లిదండ్రులు… ఇలాంటివాడికి కూతుర్నివ్వడం ఇష్టం లేక వేరే సంబంధం సెట్ చేస్తారు. ఇంకొక బిజినెస్ ఫ్యామిలీతో శ్రీలీలకు పెళ్లి సెట్ చేసి ఆమె పుట్టినరోజు సందర్భంగా అందరి ముందు దాన్ని అనౌన్స్ చేస్తాడు ఆమె తండ్రి. పనిలో పనిగా తన కూతురికి దూరంగా ఉండమని బాలుకి వార్నింగ్ కూడా ఇవ్వాలని ట్రై చేస్తాడు. కరెక్ట్ గా అదే టైంకి అక్కడికి వస్తారు ఎమ్మెల్యే మహాకాళేశ్వర్ రెడ్డి అతని అన్నయ్య(తనికెళ్ల భరణి). తన తండ్రి చనిపోయాడు అని తెలుసుకున్న బాలు… బ్రహ్మసముద్రం చేరుకుంటాడు. అక్కడ జరుగుతున్న దారుణాలను బాలు ఎలా అరికట్టాడు?అతని తండ్రి ఎలా చనిపోయాడు? మహాకాళేశ్వర్ రెడ్డికి బాలుకి మధ్య అసలు ఏం జరిగింది? బాలు తన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా? తదితర వివరాలు తెలియాలి అంటే సినిమా చూడాలి.
విశ్లేషణ: స్టోరీ రొటీన్ గా ఉన్న కాస్త కామెడీ యాంగిల్ జోడించడంతో ఫస్ట్ అఫ్ బాగా నవ్వుకోవచ్చు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం సీమకు షిఫ్ట్ అయినట్టే ఉంటుంది.. సన్నివేశాలు ఇంతకుముందు ఫ్రాక్షన్స్ సినిమాల్లో చూసిన వాటి లాగానే అనిపిస్తాయి. మరి ముఖ్యంగా సీమ సీక్వెన్స్ మొత్తం బోయపాటి మార్క్ కనిపిస్తుంది. ఫైటింగ్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. వైష్ణవి తేజ్ మొదటిసారి ఊర మాస్ గెటప్ లో బాగా ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో మంచి ఫన్నీ సీన్స్ కడుపుబ్బ నవ్విస్తాయి. ఇక సెకండ్ హాఫ్ విపరీతమైన ఫ్యాక్షనిజం తట్టుకోవడం కష్టమే అనిపిస్తుంది. శ్రీ లీల మాత్రం సూపర్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి లో నువ్వు విజిలె ఇస్తే ఆంధ్ర సోడా బుగ్గి పాటకి శ్రీ లీల డాన్స్ హైలెట్గా నిలిచింది. మాస్ ఆడియెన్స్ కోసం దర్శకుడు రాసుకున్న కథనం మెప్పిస్తుంది. మాస్ ఆడియెన్స్ ఎక్కడా బోర్ కొట్టకుండా చూస్తారు. బీసీ సెంటర్స్ లో ఆది కేశవ అలరిస్తుంది. చివరగా ..భారీ యాక్షన్ చిత్రాలు నచ్చేవాళ్ళకి.. పవర్ఫుల్ పంచ్ డైలాగ్ లు ఎంజాయ్ చేసే వాళ్ళకి ..ఈ మూవీ మంచి ఛాయిస్.నిర్మాణ విలువలు క్వాలిటీగా ఉన్నాయి. గో అండ్ ది ఇట్.
రేటింగ్: 3