• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

రోటి క‌ప‌డా రొమాన్స్ నుంచి అరెరె అరెరె లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేసిన మ్యూజిక్ స‌న్సేష‌న్ త‌మ‌న్

admin by admin
December 28, 2023
in Cinema, Latest News, Movies, news, special
0
రోటి క‌ప‌డా రొమాన్స్ నుంచి అరెరె అరెరె లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేసిన మ్యూజిక్ స‌న్సేష‌న్ త‌మ‌న్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ డోస్ (టీజ‌ర్‌)కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం సెకండ్‌డోస్ లో భాగంగా ఈ సినిమాలోని అరెరె.. అరెరె అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను మ్యూజిక్ స‌న్సేష‌న్ త‌మ‌న్ విడుద‌ల చేశారు.
ఆర్‌.ఆర్. ధ్రువ‌న్ సంగీతాన్ని అందించిన ఈ పాట‌కు ర‌ఘ‌రామ్ సాహిత్యం అందించ‌గా, క‌పిల్ క‌పిల‌న్ ఆల‌పించారు. ఈ సంద‌ర్భంగా త‌మ‌న్ మాట్లాడుతూ ఇదొక వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా క‌నిపిస్తుంది. ఈ చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు ఆర్‌.ఆర్ ధ్రువ‌న్ మ‌ల్టీ టాలెంటెడ్‌, పాట‌ల ర‌చ‌యిత‌గా, సింగ‌ర్‌గా త‌ను నాకు తెలుసు. ఈ చిత్రంతో అత‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా మార‌డం ఎంతో ఆశ్చ‌ర్యంగా వుంది. న‌మ్మ‌లేక‌పోతున్నాను. ఈ సాంగ్‌ను నేను లాంచ్ చేయ‌డం హ్య‌పీగా వుంది. విన‌గానే షూర్ షాట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సాంగ్‌లా అనిపించింది. ఈ పాట‌లో చాలా పాజిటివ్ వైబ్స్ వున్నాయి. త‌ప్ప‌కుండా ఈ పాట సినిమా విజ‌యంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. పాట‌తో పాటు చిత్రం కూడా హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. త‌మ‌న్ గారి చేతుల మీదుగా ఈ పాట విడుద‌ల కావ‌డం ఎంతో సంతోషంగా వుంద‌ని సంగీత ద‌ర్శ‌కుడు ఆర్‌.ఆర్. ధ్రువ‌న్ తెలిపారు.
ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ త‌మ‌న్ గారు మా పాట‌ను విడుద‌ల చేయ‌డం శుభ‌సూచ‌కంలా అనిపిస్తుంది.ఈచిత్రం న‌లుగురు స్నేహితుల క‌థ ఇది. వారి స్నేహం, ప్రేమ‌, వారి లైఫ్ జ‌ర్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం. నేటి యువ‌త‌రాన్ని అమితంగా ఆక‌ట్టుకునే ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో కుటుంబ ప్రేక్ష‌కుల‌ను అల‌రించే భావోద్వేగాలు కూడా వున్నాయి. అభిరుచి గ‌ల నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌తో క‌లిసి సృజన్‌ కుమార్ బొజ్జం ఈ చిత్రాన్ని ఎక్క‌డా రాజీప‌డ‌కుండా నిర్మించారు.త‌ప్ప‌కుండా ఈ చిత్రం యూత్‌కు ఓ ఫెస్ట్‌లా వుంటుంది* అన్నారు.

హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి,
కొరియోగ్రఫీ: జేడీ మాస్టర్,
కాస్ట్యూమ్ డిజైనర్: అశ్వంత్‌ భైరి, ప్రతిభా రెడ్డి
అసోసియేట్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డె,
డీఓపీ: సంతోష్ రెడ్డి,
సంగీతం: హర్ష వర్థన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధ్రువన్, వసంత్.జి
పాటలు: క్రిష్ణ కాంత్, కాసర్ల శ్యామ్, రఘురామ్

ఎడిటర్: విజయ్ వర్థన్
నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, సృజన్‌ కుమార్ బొజ్జం
కథ, స్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: విక్రమ్ రెడ్డి

‘Roti Kapda Romance’: ‘Arere Arere’ is lilting, romantic

SS Thaman unveils ‘Arere Arere’ from ‘Roti Kapda Romance’

‘Roti Kapda Romance’, the coming-of-age bromantic and romantic comedy, is produced by Bekkem Venugopal and Srujan Kumar Bojjam. Lucky Media of ‘Hushaaru’, ‘Cinema Choopistha Mama’, ‘Mem Vayasuku Vaccham’, ‘Prema Ishq Kadhal’ and ‘Paagal’ fame is poised to score a hit at the box office. Recently, the film’s Teaser was released and it showed what kind of a new-age rom-com we are in for.

On Thursday, music sensation SS Thaman unveiled the second song from the movie. Titled ‘Arere Arere’, its lyrics have been written by Raghuram. Composed by RR Dhruvan, it is sung by Kapil Kapilan.

Unveiling the beautiful song shot on the three lead pairs, Thaman described the film as a youthful romantic entertainer with a fresh storyline. “RR Dhruvan is super talented. I know him as a lyricist and singer as well. I am glad that he has turned into a music director with this promising film. I am pleasantly surprised. I am happy to launch this song, which is a sure-fire chartbuster, thanks to its tuning and positive vibes,” he said.

The makers said that the song is going to play an important role in the success of the film. They added that Thaman unveiling it was a good sign. “This film is the story of four friends. We are showing their friendship, love and their journey in life. This youthful entertainer, which appeals to the youth of the current generation, is laced with emotions and scenes that are family-friendly,” the makers added.

Producers Bekkem Venugopal and Srujan Kumar Bojjam mounted the rom-com without compromising on the quality, the team said.

Cast:

Harsha Narra, Sandeep Saroj, Tarun, Supraj Ranga, Sonu Thakur, Nuveksha, Megha Lekha, Khushboo Chaudhary and others.

Crew:

Cinematographer: Santhosh Reddy; Music Director: Harshavardhan Rameshwar, RR Dhruvan, Vasanth G; Background Music: Sunny MR; Lyricists: Krishna Kanth, Kasarla Shyam, Raghuram; Editor: Vijayvardhan; Art Director: Kiran Mamidi: Dance Choreography: JD Master; Costume Designers: Ashwanth Bhairi, Pratibha Reddy; Associate Producer: Nagarjuna Vadde; Producers: Bekkem Venugopal, Srujan Kumar Bojjam; Story, Screenplay, Direction: Vikram Reddy.

Previous Post

కమర్షియల్ అంశాలున్న ‘డెవిల్’ వంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆడియెన్స్‌ని మెప్పిస్తుంది: నందమూరి కళ్యాణ్ రామ్

Next Post

ఆశిష్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్నతాజా చిత్రంలో హీరోయిన్‌గా వైష్ణవి చైతన్య

Next Post
ఆశిష్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్నతాజా చిత్రంలో హీరోయిన్‌గా వైష్ణవి చైతన్య

ఆశిష్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్నతాజా చిత్రంలో హీరోయిన్‌గా వైష్ణవి చైతన్య

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.