ప్రేమకథలు వెండితెరపై ఎప్పుడూ ఫ్రెష్ గానే కనిపిస్తాయి. బలమైన కథ… గ్రిప్పింగ్ కథనంతో కాస్త ఎమోషన్స్ ని జోడించి సినిమాను తెరపైన ఆవిష్కరించగలిగితే ఆ సినిమా… యూత్ ని బాగా ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. అందుకే కొత్త దర్శకులు, సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలనుకునే నిర్మాతలు ఇలాంటి సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సక్సెస్ అవుతుంటారు. నటీనటులు కూడా కొత్త వారైతే… ఇలాంటి ప్రేమకథలు కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాయి. ఈ వారం ప్రేక్షకుల మందుకు ‘ప్రేమకథ’ పేరుతో ఓ లవ్ డ్రామా మన ముందుకు వచ్చింది. ఇందులో కిషోర్ శాంతి దినకరన్, దియా సీతేపల్లి, వినయ్ మహాదేవ్, నేత్ర, పుష్ప ఫేమ్ రాజ్ తిరందాసు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని శివ శక్తి రెడ్ డి దర్శకత్వంలో నిర్మాత విజయ్ మిట్టపల్లి నిర్మించారు. మరి ఈ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: కుటుంబాన్ని పోషించుకోడానికి ప్రేమ్(కిషోర్ శాంతి దినకరన్) ఓ స్టీల్ ఫ్యాక్టరీలో పనికి చేరుతాడు. అక్కడ తన ఫ్రెండ్ కి లవ్ మ్యాటర్ లో హెల్ప్ చేద్దామని వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్ లవర్ ఫ్రెండ్ అయినటువంటి నటి దియా సీతేపల్లిని చూసి మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఇద్దరూ ఘాడంగా ప్రేమించుకుంటారు. అయితే ఇది ఆమె పెద్దలకు మాత్రం ఇష్టం ఉండదు. మరీ వీరి ప్రేమకథ ఎలాంటి టర్న్ తీసుకుంది? వీరి ప్రేమకథ గెలిచిందా? అందుకోసం ఇద్దరూ ఏమి చేశారు? చివరకు ప్రేమ్ తనది స్వచ్ఛమైన ప్రేమ అని నిరూపించుకోవడం కోసం ఎలాంటి స్టెప్ తీసుకున్నాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: హృదయాన్ని తాకే ప్రేమకథలు ఎప్పుడూ డీసెంట్ గానే ఉంటాయి. ఈ సినిమాలో కూడా అలాంటి డీసెంట్ లవ్ స్టోరీనే కనిపిస్తుంది. హీరో, హీరోయిన్లు ఈ కథకు యాప్ట్. చాలా సింపుల్ కథే అయినా… వీరిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్… స్నేహితులతో తన బాధను చెప్పుకునే హీరో క్యారెక్టరైజేషన్ అంతా చాలా డీసెంట్ గా చూపించాడు దర్శకుడు. ఎక్కడా వల్గారిటీ ఉండదు. ప్రధాన పాత్రల పిక్చరైజేషన్ కూడా బాగుంది. వారు ధరించిన కాస్ట్యూమ్స్ నుంచి… వారి మధ్య వచ్చే సంభాషణలు, రొమాంటిక్ సీన్స్ అన్నీ ‘ప్రేమకథ’లో చాలా డీసెంట్ గానే ఉంటాయి. లవ్ డ్రామా కాబట్టి… డ్రామ కొంచెం ఎక్కవ అయినట్టు కనిపించినా… వీరిద్దరి పెయిర్ డామినేట్ చేస్తుంది. సో… ఈ లవ్ డ్రామా ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ మాటలు చాలా బాగున్నాయి. లవ్ డ్రామ ఇష్టపడే ప్రేక్షకులు ఓ సారి చూసేయొచ్చు.
ఈ చిత్రంలో హీరో హీరోయిన్స్ నటన చాలా డీసెంట్ గా ఉంది. ప్రేమ్ గా యువ నటుడు కిషోర్ సెన్సిబుల్ పెర్ఫామెన్స్ ని చాలా నాచురల్ గా కనబరిచాడు. అలాగే యంగ్ నటి దియా కూడా బ్యూటిఫుల్ లుక్స్ లో కనిపించి ఆకట్టుకుంది. వీరితో పాటుగా నటించిన ఫ్రెండ్ పాత్రలు వినయ్ మహాదేవ్, నేత్రలు కూడా డీసెంట్ గా నటించారు. ఇక వీరితో పాటుగా పుష్ప ఫేమ్ రాజ్ తిరందాసు తన పాత్రకి న్యాయం చేసాడు. వీరితో పాటుగా మిగతా కొందరు నటులు ఓకే అనిపిస్తారు.
నిర్మాత ఎక్కడా ఖర్చుకి వెనుకాడలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాలో మ్యూజిక్ పర్వాలేదు. రధన్ డీసెంట్ సాంగ్స్ అండ్ స్కోర్ ని అందించాడు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. హీరో హీరోయిన్ జంటను బాగా చూపించారు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. దర్శకుడు శివ శక్తి రెడ్ డి రాసుకున్న కథ… కథనం ఎంగేజింగ్ గా ఉంది. యూత్ బాగా కనెక్ట్ అవుతారు. ఎక్కడా బోరింగ్ లేకుండా సినిమాని తెరకెక్కించారు. మరో ప్రేమిస్తే లా ఉంది సినిమా. లవ్ లో ఆర్థ్రత ఉంది కాబట్టి.. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. సో… గో అండ్ వాచ్ ఇట్.
నటీనటులు: కిషోర్ శాంతి దినకరన్, దియా సీతేపల్లి, వినయ్ మహాదేవ్, నేత్ర, పుష్ప ఫేమ్ రాజ్ తిరందాసు
దర్శకుడు : శివ శక్తి రెడ్ డి
నిర్మాతలు: విజయ్ మిట్టపల్లి
సంగీతం: రధన్
సినిమాటోగ్రఫీ: వాసు పెండెం
ఎడిటింగ్: ఆలయం అనీల్
రేటింగ్: 3