• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఈ నెల 26న తెలుగులో శివ కార్తికేయన్ ‘అయలాన్’ విడుదల

admin by admin
January 17, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
ఈ నెల 26న తెలుగులో శివ కార్తికేయన్ ‘అయలాన్’ విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘అయలాన్’. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కెజెఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాడి జె. రాజేష్ నిర్మించగా… ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా తమిళనాడులో విడుదలైంది.

అయలాన్ అంటే ఏలియన్. ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రావడం ఇదే తొలిసారి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న తెలుగులో విడుదల చేయనున్నట్లు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్న గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తెలియజేసింది. తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ అందుకున్న ‘వరుణ్ డాక్టర్’ సినిమా తర్వాత శివ కార్తికేయన్, కెజెఆర్ స్టూడియోస్, గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది.
తమిళనాడులో ‘అయలాన్’ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

కేవలం నాలుగు రోజుల్లో రూ .50 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ వారంలో వంద కోట్ల మార్క్ చేరువ కానుంది. శివ కార్తికేయన్ నటనతో పాటు కామెడీ, సినిమా కాన్సెప్ట్ తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సైన్స్ ఫిక్షన్ యూనివర్స్ కాన్సెప్ట్ కావడంతో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు కూడా సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. 

కోటపాడి జె. రాజేష్ మాట్లాడుతూ ”హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోని సినిమా భారతీయ ప్రేక్షకులకు అందించాలని క్వాలిటీ విషయంలో మీ టీమ్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఎక్కువ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉండటంతో, ఆ వర్క్ కంప్లీట్ కావడానికి సుమారు రెండేళ్లు పట్టింది. తమిళ ప్రేక్షకుల ఆదరణ చూశాక మా కష్టాన్ని మర్చిపోయాం. అంత సంతోషంగా ఉంది. ఏఆర్ రెహమాన్ గారి పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా చూపించాలని ఈ నెల 26న ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం” అని చెప్పారు. 

శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ సినిమాలో ఇషా కొప్పికర్, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫేమ్ శరద్ కేల్కర్, సీనియర్ హీరోయిన్ భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్, బాల శరవణన్ ఇతర తారాగణం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా ‘అయలాన్’కు వర్క్ చేశారు. ఈ సినిమాకు ఎడిటర్ : రూబెన్, పోస్టర్ డిజైన్ : గోపి ప్రసన్న, ప్రొడక్షన్ డిజైన్ : టి. ముత్తురాజ్, వీఎఫ్ఎక్స్ : బిజోయ్ ఆర్పుతరాజ్ (ఫాంటమ్ ఎఫ్ఎక్స్), కాస్ట్యూమ్ డిజైన్ : పల్లవి సింగ్, నీరజా కోన, కొరియోగ్రఫీ : గణేష్ ఆచార్య, పరేష్ శిరోద్కర్, సతీష్ కుమార్, సంగీతం : ఏఆర్ రెహమాన్, నిర్మాత : కోటపాడి జె. రాజేష్, దర్శకత్వం : ఆర్. రవికుమార్.

Shiva Karthikeyan’s ‘Ayalan’ releasing in Telugu on 26th of this month


‘Ayalan’ is a fantasy sci-fi film starring Siva Karthikeyan and Rakul Preet Singh directed by Ravikumar. Kotapadi J produced this film under the banner of KJR Studios. Produced by Rajesh…Oscar award winner and legendary music director AR Rahman composed music. It was released in Tamil Nadu on 12th of this month for Sankranti.
Ayalan means Alien. This is the first time that alien played a lead role in a film in southern languages. Ganga Entertainments has announced that it will be released in Telugu on 26th of this month .
In Telugu states After ‘Varun Doctor’ which was a super duper hit in Telugu as well, this movie is coming in the combination of Siva Karthikeyan, KJR Studios and Ganga Entertainments.
In Tamil Nadu, the movie ‘Ayalan’ has received a blockbuster talk.
It collected Rs 50 crores in just four days. And will soon reach the hundred crore club this week. Along with Siva Karthikeyan’s acting, the comedy and the concept of the movie impressed the Tamil audience. Being a sci-fi universe concept, there are plenty of elements in the movie that will appeal Telugu audience.
Kotapadi J. Rajesh said, “Your team has not compromised anywhere in terms of quality to provide the Hollywood experience to Indian audience With a lot of VFX shots, the work took about two years to complete. After seeing the reception of the Tamil audience, we forgot our hardship. So happy. AR Rahman’s songs and background music are the special attraction of the movie. We are releasing this film in AP and Telangana on 26th of this month,” he said.
Starring Sivakarthikeyan and Rakul Preet Singh, the film also stars Isha Koppikar, ‘Sardar Gabbar Singh’ fame Sharad Kelkar, senior heroine Bhanupriya, Yogibabu, Karunakaran and Bala Saravanan. Famous cinematographer Nirav Shah has also worked for ‘Ayalan’. Editor of this movie: Reuben, Poster Design: Gopi Prasanna, Production Design: T. Muthuraj, VFX : Bijoy Arputaraj (Phantom FX), Costume Design : Pallavi Singh, Neeraja Kona, Choreography : Ganesh Acharya, Paresh Shirodkar, Satish Kumar, Music : AR Rahman, Producer : Kotapadi J. Rajesh, Directed by: R. Ravikumar.

Previous Post

ఘనంగా ప్రారంభమైన హీరోయిన్ వేదిక సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ “ఫియర్”

Next Post

ఎన్టీఆర్ ‘మనదేశం’ సినిమా 75 సంవత్సరాల వేడుకలు

Next Post
ఎన్టీఆర్ ‘మనదేశం’ సినిమా 75 సంవత్సరాల వేడుకలు

ఎన్టీఆర్ 'మనదేశం' సినిమా 75 సంవత్సరాల వేడుకలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 29, 2025
0

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.