• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“హ్యాపీ ఎండింగ్” ఒక మంచి రొమాంటిక్ డ్రామా – దర్శకుడు కౌశిక్ భీమిడి

admin by admin
January 27, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
“హ్యాపీ ఎండింగ్” ఒక మంచి రొమాంటిక్ డ్రామా  – దర్శకుడు కౌశిక్ భీమిడి
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

యంగ్ హీరో యష్ పూరి హీరోగా నటించిన కొత్త సినిమా “హ్యాపీ ఎండింగ్”. ఈ చిత్రంలో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. “హ్యాపీ ఎండింగ్” సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సినిమా హైలైట్స్ ను లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు దర్శకుడు కౌశిక్ భీమిడి.

  • నేను పెళ్లి చూపులు, వికీ డోనర్ లాంటి న్యూ అప్రోచ్ మూవీస్ ను ఇష్టపడతాను. ఒక రోజు మహాభారతం చదువుతుంటే అందులో చాలా శాపాలు గురించి తెలిసింది. ఇలాంటి శాపాన్ని ఇప్పటి జెనరేషన్ కుర్రాడు ఎదుర్కొంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో “హ్యాపీ ఎండింగ్” కథ మొదలైంది. ఇలాంటి మూవీస్ ఏవైనా తెలుగులో వచ్చాయా అని ఆలోచించాను. అప్పట్లో బాలకృష్ణ నటించిన ఒక సినిమా ఉంది కానీ ఈ మధ్య ఏదీ రాలేదు. దాంతో స్క్రిప్ట్ రైటింగ్ మీద దృష్టి పెట్టాను. పురాణాల నుంచి తీసుకున్న అంశం కాబట్టి..కథకు ట్రీట్ మెంట్ మాత్రం చాలా మోడరన్ గా ఉండాలని అనుకున్నాను. అప్పుడే ఈ జనరేషన్ ప్రేక్షకులకు సినిమాను రీచ్ చేయగలమని బిలీవ్ చేశాను. కథ బ్రీఫ్ గా అనుకున్నప్పుడు సిల్లీ మాంక్స్ అనిల్ గారిని కలిసి నా దగ్గర ఉన్న ఐడియా చెప్పాను. ఆయన చాలా బాగుందని చెప్పి మళ్లీ మీట్ అవుదాం అన్నారు. నేను స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాను. ఈలోగా జీ5 వాళ్ల కోసం హవాలా అనే వెబ్ సిరీస్ రూపొందించాను. అనిల్ గారు మళ్లీ పిలిచి యష్ అనే యంగ్ హీరో ఉన్నాడు. మీ కథ చెప్పండి అని పంపారు. యష్ ను చూడగానే నాకు చాలా ప్రామిసింగ్ గా అనిపించాడు. నా స్టోరీకి బాగా సెట్ అవుతాడని నమ్మాను. యష్ కు కూడా కథ బాగా నచ్చింది. అలా “హ్యాపీ ఎండింగ్” ప్రాజెక్ట్ టేకాఫ్ అయ్యింది. ఈ కథను థియేటర్లోనే చూపించాలని అనుకున్నాం. వికీ డోనర్ లాంటి మూవీస్ ఐడియా పరంగా అడల్ట్ గా ఉన్నా..మూవీ ట్రీట్ మెంట్ మాత్రం అందరూ చూసేలా కన్విన్సింగ్ గా ఉంటుంది. మేము కూడా “హ్యాపీ ఎండింగ్” ను అలా ప్రేక్షకులంతా చూసేలా తెరకెక్కించాలి అనుకున్నాం. ఓటీటీకి రిలీజ్ కు వెళ్తే మా సినిమా టైటిల్ ను బట్టి ఆడియెన్స్ ప్రైవేట్ గా మూవీ చూస్తారు. బాగుంటే మిగతా వాళ్లకు చెబుతారు. నా దృష్టిలో సినిమా అంటే థియేటర్ లో సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇవ్వాలి. అందుకే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్నాం.
  • “హ్యాపీ ఎండింగ్” ఒక మంచి రొమాంటిక్ డ్రామా అని చెబుతాను. కథలో హీరోకు శాపం ఉంటుంది కాబట్టి అది అతనికి ట్రాజెడీ. కానీ చూసే ఆడియెన్స్ కు మాత్రం నవ్వుకునేలా ఉంటుంది. ఈ సినిమా పోస్టర్ లో హీరోయిన్స్ ను చూపించలేదు గానీ సినిమాలో వాళ్ల క్యారెక్టర్స్ చాలా కీలకంగా ఉంటాయి. నాకు కె విశ్వనాథ్, శేఖర్ కమ్ముల గారి మూవీస్ ఇష్టం. వారి సినిమాల్లో లేడీ క్యారెక్టర్స్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే నేనూ ఈ మూవీలో హీరోయిన్స్ కు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ డిజైన్ చేశాను. చిన్నప్పుడే ఓ బాబా శాపం పొందిన ఓ యువకుడు ప్రేమలో పడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటాడు అనేది చూపిస్తున్నాం. శాపం వల్ల తన పార్టనర్ తో ఫిజికల్ గా ఉండలేకపోయినా..అతను వేరే పద్ధతులతో తన ప్రేమను ఆమెపై చూపిస్తాడు. తన ప్రేయసిని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియజేస్తాడు. ఇప్పటిదాకా మన సినిమాల్లో రొమాన్స్, సన్నిహితంగా ఉండటాన్ని ఒకరకంగా చూపించాం. కానీ “హ్యాపీ ఎండింగ్”లో ఆ రొమాన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. అయితే ఎక్కడా అసభ్యత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఎంటర్ టైనింగ్ తో సినిమా రూపొందించాను.
  • దర్శకుడిగా నాకు ఇది మొదటి సినిమా కాబట్టి నాతో పనిచేసే టెక్నీషియన్స్ కూడా ఆల్మోస్ట్ కొత్త వాళ్లు ఉంటే నాకు కంఫర్ట్ ఉంటుందని అనిపించింది. నా ఐడియాస్ సీనియర్స్ తో షేర్ చేసుకుంటే వాళ్లు పది రకాల ప్రశ్నలు వేస్తారు. కొత్త వాళ్లైతే అర్థం చేసుకుని వర్క్ చేస్తారు. సో నేను సీనియర్ టెక్నీషియన్స్ ను తీసుకుని వాళ్లను కన్విన్స్ చేస్తూ ఉండటం కన్నా కొత్త వాళ్లే బెటర్ అనిపించింది. ఎగ్జాంపుల్ గా మా మ్యూజిక్ డైరెక్టర్ రవిని తీసుకుంటే. అతను నేను చెప్పే విభిన్నమైన కాన్సెప్టులు విని, దానికి తగినట్లు మ్యూజిక్ ఇచ్చాడు. మిగతా టెక్నీషియన్స్ కూడా అలాగే కంఫర్ట్ గా వర్క్ చేశారు. మా సినిమా బిగినింగ్ లోనే హీరోకు ఉన్న శాపం గురించి రివీల్ చేస్తాం. అక్కడి నుంచి కథ ట్రావెల్ అవుతుంది. మంచి బిగినింగ్, ఇంటర్వెల్, ఎండ్..ఇలా కథను సిద్ధం చేసుకున్నాను. క్లైమాక్స్ లో అతని శాపవిముక్తితో హ్యాపీగా సినిమా ముగుస్తుంది. చిన్నప్పుడు హీరో చేసిన తప్పేంటి, ఎందుకు శాపం ఎదుర్కొన్నాడు. క్లైమాక్స్ లో అతని శాపం ఎలా విముక్తి అయ్యింది, అసలు అతనికి శాపం ఉందా లేదా అనేది చిన్న రీకాలింగ్ సీన్స్ తో సైకలాజికల్ డ్రైవ్ తో చూపించాం. ఈ ప్రెజెంటేషన్ స్క్రీన్ మీద కొత్తగా ఉంటుంది. బాలీవుడ్ లో బదాయి దో అనే సినిమా ఉంటుంది. అది కథగా కన్విన్సింగ్ గా లేకున్నా…సినిమా చూస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇలాంటి కథలు మన ఓటీటీ వాళ్లకు చెబితే నువ్వు బాలీవుడ్ లో ట్రై చేయి అన్నారు. కానీ మన తెలుగు ఆడియెన్స్ బదాయి దో సినిమాను ఓటీటీలో బాగా చూశారు. మన ఆడియెన్స్ కు మంచి టేస్ట్ ఉంది. అన్ని రకాల మూవీస్ ను ఆదరిస్తారు. నేను ఈ కాన్సెప్ట్ మూవీ చేయడానికి కూడా ఈ నమ్మకమే కారణం.
  • “హ్యాపీ ఎండింగ్” స్క్రిప్ట్ కు యష్, అపూర్వ ఇద్దరూ బాగా యాప్ట్ అయ్యారు. వాళ్ల పర్ ఫార్మెన్స్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. మేము షూట్ కు వెళ్లే ముందు వర్క్ షాప్స్ పెట్టుకున్నాం. అలాగే స్క్రిప్ట్ గురించి వాళ్లకు పూర్తిగా నెరేట్ చేశాను. యష్, అపూర్వ కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. వాళ్ల పర్ ఫార్మెన్స్ పట్ల నేను దర్శకుడిగా చాలా సంతృప్తిగా ఉన్నాను. “హ్యాపీ ఎండింగ్” ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను.
  • “Happy Ending” Promises a Unique Blend of Romance and Tragedy: Director Kowshik Bheemidi
  • Yash Puri, who made a mark with his performances in ZEE5’s web film Alanti Sitralu, the comedy Cheppalani Undhi and the recently released epic drama Shaakuntalam is gearing up for the release of another film Happy Ending. This light-hearted coming of age tale, directed by Kowshik Bheemidi has god good buzz with the interesting promotional content. Apoorva Rao is cast as the female lead. Yogesh Kumar, Sanjay Reddy, Anil Pallala are bankrolling the film under Hamstech Films and Silly Monks Studios. Today the director Kowshik Bheemidi shared insights with media.
  • “I am drawn to films with a fresh approach, like those portraying marriage and movies like ‘Vicky Donor.’ The idea for ‘Happy Ending’ originated when I was reading Mahabharata, discovering the multitude of curses within it. This led to the concept of exploring how a boy from the current generation would face such a curse. While there have been movies in Telugu featuring curses, none had been produced recently, prompting me to focus on scriptwriting. Given the Puranic backdrop, I felt the need to present the story in a modern and relatable manner to resonate with the current generation. When I pitched the idea to Anil garu of Sillymonks, he found it compelling, and that’s how the project started.”
  • “Yash, the young hero, was introduced to me by Anil garu, and upon seeing him, I felt his potential aligned perfectly with the character in ‘Happy Ending.’ Yash also resonated with the story, and that’s how the project took off. We envisioned this story for a theatrical experience, as opposed to an OTT release, to ensure it reaches a wider audience. Even though movies like ‘Vicky Donor’ explore adult themes, the treatment makes them accessible to all, and we aimed to achieve the same with ‘Happy Ending.'”
  • “‘Happy Ending’ is a romantic drama with a unique twist. The protagonist faces a curse, adding a tragic element to the story, yet the audience will find moments of laughter. The poster intentionally doesn’t reveal the heroines, but their characters play a crucial role. Drawing inspiration from directors like K Vishwanath and Shekhar Kammula, I emphasized the importance of female characters, providing full-length roles for the heroines. The narrative explores the journey of a young man cursed in childhood, falling in love, and navigating the consequences of the curse, bringing forth a different kind of romance.”
  • “As a first-time director, I found comfort working with relatively new technicians. Their fresh perspectives aligned with my ideas, and the collaborative process was smooth. For instance, music director Ravi listened to my diverse concepts and crafted music accordingly. The story is meticulously structured, with a compelling beginning, interval, and a satisfying climax where the hero is released from the curse. The climax includes a small recalling scene with a psychological drive, offering a novel cinematic experience. While Bollywood has experimented with similar storylines, the Telugu audience’s diverse taste and appreciation for various genres motivated me to explore this concept.”
  • “Both Yash and Apoorva were aptly suited for their roles in ‘Happy Ending.’ We conducted workshops before the shoot, ensuring they were thoroughly familiar with the script. Their on-screen chemistry is fresh and satisfying, leaving me as a director thoroughly pleased with their performances. I believe ‘Happy Ending’ will resonate with audiences as a clean family entertainer, combining romance, tragedy, and a unique storytelling approach.”
  • Cast – Ajay Ghosh, Vishnu, Jhansi, Anita Chaudhary, Harsh Roshan, Jiya Sharma, Vamsi Nekkanti, KMM Mani, Kamal Tumu, Shweta etc.
  • Technical team
  • Music – Ravi Nidamarthi
  • Cinematography- Ashok Seepalli
  • Editor – Pradeep R Moram
  • Screenplay – Nagasai
  • Line Producer – Prasad Billakurthy
  • PRO – GSK Media
  • Executive Producer – Kiran Ramanujam
  • Producers – Yogesh Kumar, Sanjay Reddy, Anil Pallala
  • Story & direction – Kaushik Bhimidi
Previous Post

బోయ‌పాటి శ్రీ‌ను – అల్లు అర‌వింద్ కల‌యిక‌లో త్వరలో భారీ ప్రాజెక్ట్…

Next Post

ఒక ప్రాంతంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ను సినిమాగా తెరకెక్కించి చూపిస్తున్నాం – నిర్మాత ధీరజ్ మొగిలినేని

Next Post
ఒక ప్రాంతంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ను  సినిమాగా తెరకెక్కించి చూపిస్తున్నాం  – నిర్మాత ధీరజ్ మొగిలినేని

ఒక ప్రాంతంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ను సినిమాగా తెరకెక్కించి చూపిస్తున్నాం - నిర్మాత ధీరజ్ మొగిలినేని

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఆకట్టుకునే “శుభం”

ఆకట్టుకునే “శుభం”

by admin
May 9, 2025
0

ఇంద్రజ, అజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘CM పెళ్లాం’ మే 9న విడుదల

ఇంద్రజ, అజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘CM పెళ్లాం’ మే 9న విడుదల

by admin
May 7, 2025
0

హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘డిజైనతాన్’ను నిర్వహించింన Coursevita

హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘డిజైనతాన్’ను నిర్వహించింన Coursevita

by admin
May 5, 2025
0

M4M Heroine Jo Sharma Invited to WAVES Summit 2025 as USA Delegate

M4M Heroine Jo Sharma Invited to WAVES Summit 2025 as USA Delegate

by admin
May 5, 2025
0

వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ లాంచ్ చేసిన నటి అనన్య నాగళ్ల

వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ లాంచ్ చేసిన నటి అనన్య నాగళ్ల

by admin
May 3, 2025
0

ఐశ్వర్య రాజేష్ నటించిన గరుడ 2.౦ ఆహా ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది

ఐశ్వర్య రాజేష్ నటించిన గరుడ 2.౦ ఆహా ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది

by admin
April 29, 2025
0

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 2 వేల మందికి అన్నదానం

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 2 వేల మందికి అన్నదానం

by admin
April 29, 2025
0

ఘనంగా ఖుషి డాన్స్ స్టూడియో తొలి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా ఖుషి డాన్స్ స్టూడియో తొలి వార్షికోత్సవ వేడుకలు

by admin
April 27, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.