మంచి ఎమోషన్స్‌తో అవుట్ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా వచ్చిన చిత్రం వీ లవ్ బ్యాడ్ బాయ్స్. ఈ చిత్రం నేటి యువత, ప్రేమకు అద్దం పట్టేలా ఉంటుంది. ఈ సినిమాను ఎమోషనల్‌గా మలిచినా కూడా మన మూలాల్ని చూపించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఉన్న తల్లిదండ్రులు, యువత తప్పకుండా చూడదగ్గ చిత్రంగా థియేటర్లోకి వచ్చింది.
బిగ్ బాస్ అజయ్ కతుర్వార్, వంశీ ఏకసిరి, ఆదిత్య శశాంక్, రొమికా శర్మ, రోషిణి సహోత, ప్రగ్యా నయన్ ముఖ్య పాత్రల్లో నటించారు. పోసానీ కృష్ణ మురళీ, కాశీ విశ్వనాథ్, అలీ, సప్తగిరి, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, శివా రెడ్డి వంటి వారు ఇతర కీ రోల్స్ పోషించారు. బీఎం క్రియేషన్స్ బ్యానర్ మీద పప్పుల కనకదుర్గా రావు నిర్మించిన ఈ చిత్రానికి రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మార్చి 8న థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
ప్రశాంత్ (అజయ్ కతుర్వార్), వినయ్ (వంశీ యాకసిరి), అరుణ్ (ఆదిత్య శశాంక్) రూమ్‌మేట్స్ పైగా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ముగ్గురూ నిజమైన, స్వచ్చమైన ప్రేమ కోసం ఎదురుచూస్తుంటారు. దివ్య (రోమికా శర్మ), రమ్య (రోషిణి సహోతా) మరియు పూజ (ప్రజ్ఞా నయన్) అక్కాచెల్లెళ్లు. ఈ ముగ్గురూ ఆ ముగ్గురి ప్రేమలో పడతారు. అంటే దివ్య ప్రశాంత్‌తో, రమ్య వినయ్‌తో, పూజ అరుణ్‌లతో ప్రేమలో పడతారు. దీంతో వారి తండ్రి (పోసాని కృష్ణ మురళి) వారిష్టపడ్డ వారితో వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ ప్రశాంత్, వినయ్ వారిని వివాహం చేసుకోవడానికి విస్మరిస్తారు. ప్రశాంత్, వినయ్ పెళ్లిని ఎందుకు నిరాకరించారు? అసలు ఈ జంటల మధ్య ఏం జరిగింది? వీరి ప్రేమ కథకు ఎలాంటి ముగింపు వచ్చింది? అనేది మిగతా కథ.
నటీనటులు
అజయ్, వంశీ, ఆదిత్య అందరూ తమ తమ పాత్రలను పర్ఫెక్ట్‌గా సరిపోయారు. నేటి యువత ఎలా ఉంటుందో అలానే కనిపించారు. ప్రస్తుత యువత ఈ పాత్రలలో బాగా కనెక్ట్ అవుతారు. రోమికా శర్మ అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రోషిణి సహోతా, ప్రగ్యా నయన్ తెరపై అందంగా కనిపించారు. నటనతోనూ వారు మెప్పిస్తారు. ఇతర పాత్రల్లో పోసాని కృష్ణమురళి, కాశీ విశ్వనాథ్, అలీ, సప్తగిరి, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి, శివారెడ్డి తదితరులు ప్రేక్షకులను నవ్విస్తారు.. ఆకట్టుకుంటారు.
విశ్లేషణ
నేటి యవతకు రిఫ్లెక్ట్‌గా ఈ సినిమాను దర్శకుడు ఆద్యంతం వినోద భరితంగా తెరకెక్కించాడు. లవ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను నవ్విస్తుంది. ఆలోచింపజేస్తుంది. నేటి యువతకు మంచి సందేశాన్ని ఇస్తుంది. ఫస్ట్ హాఫ్ ఆహ్లాదకరంగా, ఎంతో వినోదభరితంగా సాగుతుంది. సెకండాఫ్ కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. క్లైమాక్స్‌లో ఇటు యూత్‌కి అటు పేరెంట్స్‌కి ఇచ్చిన సందేశం అందరినీ కదిలిస్తుంది.
పోలీస్ స్టేషన్ సన్నివేశం, వేశ్య సన్నివేశం, అలీ ఎపిసోడ్‌లు మరియు క్లైమాక్స్ ఎపిసోడ్‌లు వంటి కొన్ని ఎపిసోడ్‌లు నవ్విస్తాయి. దర్శకుడు రాజు రాజేంద్ర ప్రసాద్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అందించారు. సినిమా కాస్త నిడివిగా కనిపించడంతో పాటు ట్రిమ్ చేయాల్సి ఉంది. ఇది రొటీన్ సినిమా కాబట్టి ఓవరాల్ గా సినిమా ఇంకాస్త బాగుండేది.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. పాటలు బాగున్నాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంతో ఎంగేజ్ చేస్తుంది. లొకేషన్‌లు బాగున్నాయి. విజువల్స్ అందంగా కనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్‌గా ఉన్నాయి.
తీర్పు:
వి లవ్ బ్యాడ్ బాయ్స్ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం యూత్‌కి నచ్చుతుంది. ఇదొక రోలర్ కోస్టర్ రైడ్.అందరూ తప్పకుండా వెళ్లి చూడదగ్గ చిత్రం.
రేటింగ్ : 2.75










