• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, February 13, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఘనంగా ‘జయహో రామానుజ’ సినిమా లిరికల్ సాంగ్స్ లాంఛ్

Maari by Maari
June 22, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
ఘనంగా ‘జయహో రామానుజ’ సినిమా లిరికల్ సాంగ్స్ లాంఛ్

Share and Enjoy !

Shares
Twitter

లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘జయహో రామానుజ’. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ జూలై 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ‘జయహో రామానుజ’ సినిమా పాటలను తిలకించిన తెలంగాణ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లయన్ సాయి వెంకట్ కు అభినందనలు అందజేశారు. పాటలు బాగున్నాయంటూ వారు ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ‘జయహో రామానుజ’ లిరికల్ సాంగ్స్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ – ‘జయహో రామానుజ’ సినిమా చేయాలనేది నా మిత్రుడు లయన్ సాయి వెంకట్ కల. తన కలను నెరవేర్చుకున్న సంతోషంలో ఆయనలో కనిపిస్తోంది. ‘జయహో రామానుజ’ పాటలు చాలా బాగున్నాయి. భక్తితో పాటు సామాజిక చైతన్యాన్ని అందించేలా పాటలను రూపకల్పన చేశారు. ఇలాంటి మరిన్ని గొప్ప చిత్రాలను సాయి వెంకట్ రూపొందించాలి. ఈ సినిమా నా మిత్రుడికి గొప్ప విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ – కులమతాలు సమాజంలో విబేధాలు తీసుకురావొద్దనే గొప్ప సందేశాన్ని వెయ్యేళ్ల కిందటే ఇచ్చిన గురువు శ్రీ రామానుజాచార్యులు. ఆయన జీవిత కథతో సినిమా చేయడం లయన్ సాయి వెంకట్ చేసుకున్న అదృష్టం. సినిమాను ఎంతో వ్యయప్రయాసలతో ఆయన రూపొందించాడు. ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్స్ అన్నీ చూశాం. చాలా బాగున్నాయి. పాటలు ‘జయహో రామానుజ’ చిత్ర విజయంలో పెద్ద పాత్ర పోషిస్తాయి. లయన్ సాయి వెంకట్ కు ఈ సినిమా చిరకాల కీర్తిని అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ – ‘జయహో రామానుజ’ చిత్ర సాంగ్స్ బిగ్ సీడీ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. భక్తిని, చైతన్యాన్ని అందించేలా సంగీత సాహిత్యాలు కుదిరాయి. ‘జయహో రామానుజ’ సినిమా ఈతరం ప్రేక్షకులు చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమా రూపొందించడం సాధారణ విషయం కాదు. సాయి వెంకట్ ఎంతో ఇష్టంతో, భక్తితో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఆయనకు ‘జయహో రామానుజ’ మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.

ఎఫ్ డీసీ మాజీ ఛైర్మన్ అనిల్ కుర్మాచలం మాట్లాడుతూ – ‘జయహో రామానుజ’ చిత్ర పాటల విడుదల కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన లయన్ సాయి వెంకట్ గారికి కృతజ్ఞతలు. పాటలు చాలా బాగున్నాయి. సినిమాకు ఈ పాటలన్నీ మంచి ఆకర్షణ అవుతాయి. ప్రేక్షకులు థియేటర్ లో ఈ సినిమాను అందులో పాటలను బాగా ఆస్వాదిస్తారని అనిపిస్తోంది. సమాజానికి మంచిని చెప్పే ఇలాంటి గొప్ప సినిమా రూపొందించిన సాయి వెంకట్ గారికి నా అభినందనలు తెలుపుతున్నా. అన్నారు.

దర్శకుడు, హీరో డా.లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ – ఇటీవల మా ‘జయహో రామానుజ’ సినిమా పాటలను మన ప్రియతమ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చూపించడం జరిగింది. వారు పాటలన్నీ తమకు బాగా నచ్చాయంటూ ప్రశంసిస్తూ ఆశీస్సులు అందజేశారు. మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ రోజు మా ‘జయహో రామానుజ’ సినిమా లిరికల్ సాంగ్స్ రిలీజ్ కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా ఈవెంట్ కు వచ్చిన అతిథులందరికీ కృతజ్ఞతలు. ఈ చిత్రంలోని పాటల రూపకల్పన కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. సంగీత సాహిత్యాలు గొప్పగా ఉండాలని ఎంతో టైమ్ తీసుకుని ఖర్చుకు వెనకాడకుండా సాంగ్స్ డిజైన్ చేశాం. మీ అందరికీ మా మూవీ సాంగ్స్ నచ్చాయని ఆశిస్తున్నాం. మహిళల్ని గౌరవించాలని, కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో మానవాళి ఉండాలని సందేశాన్ని ఇచ్చిన గొప్ప గురువు భగవత్ శ్రీ రామానుజాచార్యుల వారు. ఆయన గొప్పదనం ఈ తరం వారికి తెలియాలనే ఉద్దేశంతో జయహో రామానుజ చిత్రాన్ని రూపొందించాను. జయహో రామానుజ చిత్రంతో ఆయన గొప్పదనం తెలియజేయాలని సంకల్పించాను. జయహో రామానుజ సినిమా రూపకల్పనకు రెండేళ్ల సమయం పట్టింది. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. అన్నారు.

నిర్మాత ప్రవళ్లిక మాట్లాడుతూ – ‘జయహో రామానుజ’ సినిమా పాటలన్నీ మీకు నచ్చాయని నమ్ముతున్నాం. నాన్న సినిమా కోసం ఎంత శ్రమించారో ఈ పాటలు అందంగా తీసుకొచ్చేందుకు అంతే జాగ్రత్తలు తీసుకున్నారు. ‘జయహో రామానుజ’ సినిమా నాన్నగారికి ఒక కల. ఈ సినిమా చిత్రీకరణలో పిల్లలుగా మమ్మల్ని కూడా భాగస్వాములను చేశారు. భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మించాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ‘జయహో రామానుజ’ సినిమా ఉంటుంది. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం. మీరంతా మీ ఆదరించి ఘన విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

హిట్ టాక్ తో థియేటర్స్ పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న “హనీమూన్ ఎక్స్ ప్రెస్

Next Post

యూత్ ను ఆకట్టుకుంటున్న ఎమోషనల్ మ్యూజికల్ యూత్ ఎంటర్టైనర్‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’

Next Post
యూత్ ను ఆకట్టుకుంటున్న ఎమోషనల్ మ్యూజికల్ యూత్ ఎంటర్టైనర్‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’

యూత్ ను ఆకట్టుకుంటున్న ఎమోషనల్ మ్యూజికల్ యూత్ ఎంటర్టైనర్‘ప్రభుత్వ జూనియర్ కళాశాల'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

by Maari
February 12, 2026
0

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన”  స్టోరీ పోస్టర్ విడుదల

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన” స్టోరీ పోస్టర్ విడుదల

by Maari
February 12, 2026
0

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

by Maari
February 12, 2026
0

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

by Maari
February 12, 2026
0

‘ఫంకీ’ సినిమా రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది: చిత్ర బృందం

‘ఫంకీ’ సినిమా రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది: చిత్ర బృందం

by Maari
February 12, 2026
0

‘సతీ లీలావతి’ పూర్తిగా వినోదాత్మక చిత్రం- లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ పూర్తిగా వినోదాత్మక చిత్రం- లావణ్య త్రిపాఠి కొణిదెల

by Maari
February 11, 2026
0

ఘనంగా ‘ఫంకీ’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘ఫంకీ’ ప్రీ రిలీజ్ వేడుక

by Maari
February 11, 2026
0

లవ్ స్టోరీలో ఇది కె.జి.ఎఫ్. లాంటి చిత్రం: నిలవే ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్

లవ్ స్టోరీలో ఇది కె.జి.ఎఫ్. లాంటి చిత్రం: నిలవే ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్

by Maari
February 11, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.