రాయల్ పిక్చర్స్ పతాకంపై లక్మీ శ్రీనివాస్ దర్శకత్వంలో, సుబ్బారావు రాయన, శివకృష్ణ నిచ్చన మెట్ల సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘14’. ఇందులో ప్రముఖ నటుడు నోయల్ ఓ డిటెక్టివ్ పాత్ర పోషించగా…. సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి సీఎం పాత్రలో కనిపించారు. లీడ్ రోల్స్ లో డెబ్యూ నటుడు రామ్ రతన్ రెడ్డి, విషాక ధీమాన్ జంటగా నటించారు. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్, జబర్దస్త్ మహేష్, నటి రూపా లక్ష్మీ, లోహిత్ తదితరులు ఇందులో మిగతా పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన ఈ సస్పెన్స్ రొమాంటిక్ క్రైం థ్రిల్లర్… ఆడియన్స్ ను ఏమాత్రం థ్రిల్ కు గురి చేసిందో చూద్దాం పదండి.
కథ: రతన్(రామ్ రతన్ రెడ్డి) ముఖ్యమంత్రి(పోసాని కృష్ణ మురళి) కుమారుడు. చాలా జాలీగా తిరుగుతూ స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ కాలం గడిపేస్తుంటారు. అతనికి జూనియర్ డాక్టర్ అయిన నేహా(విషాక ధీమాన్)తో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరి మనసులు కలిస్తాయి. ఇద్దరూ రొమాంటిక్ లైఫ్ ను గుడుపుతూ ఉంటారు. ఉన్నట్టుండి ఓ రోజు ఇద్దరూ నేహా ఫ్లాట్ లో విగత జీవులుగా పడి ఉంటారు. దీనిని పోలీసులు ఆత్మహత్య కింద కేసు నమోదు చేసి కేస్ ను క్లోజ్ చేస్తారు. అయితే జర్నలిస్ట్ అయిన సుబ్బు(శ్రీకాంత్ అయ్యంగార్)… వీరిది ఆత్మహత్య కాదని… హత్య అని నిరూపిస్తా అని… తన మిత్రులతో ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. మరి జర్నలిస్ట్ సుబ్బు మిత్రులు చేసిన ఇన్వెస్టిగేసన్ లో వీరి మరణానికి గల కారణాలు ఏంటి? వీరిని ఎవరు చంపారు? ఈ మర్డర్ మిస్టరీకి గల కారణాలు కనుగొన్నారా? అందులో సీఎం పాత్ర ఎంత వరకూ ఉంది? డిటెక్టివ్ అయిన నోయల్ ఈ కేస్ స్టడీలో ఎంత వరకూ ఉపయోగపడ్డారు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: రొమాంటిక్ క్రైం సస్పెన్స్ థ్రిల్లర్ కథలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. దానికి కావాల్సిందల్లా… గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో పాటు.. ఆడియన్స్ ఎంగేజ్ చేసే మూమెంట్స్ ఉండాలి. అప్పుడే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ప్లాట్ తెలిసిందే అయినా… దానికి చుట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆద్యంతం ఆడియన్స్ ను థ్రిల్ కు గురిచేయాలి. దాంతో ప్రేక్షకులు చివరి దాకా సినిమాను చూడటానికి ఎంగేజ్ అవుతారు. ఈ చిత్ర దర్శకుడు లక్ష్మీ శ్రీనివాస్ కూడా ఇలాంటి గ్రిప్పింగ్ అండ్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేను అనేక మలుపులతో ఆడియన్స్ ను థ్రిల్ కు గురిచేశారనే చెప్పొచ్చు. మొదట్లో ఓ సాధారణ మర్డర్ మిస్టరీలాగ కథను ప్రారంభించి… ఆ తరువాత ఇంట్రెస్టింగ్ మలుపులతో ఆడియన్స్ ఎక్కడా ప్రిడిక్ట్ చేయకుండా కథ… కథనాలను ముందుకు నడిపించారు. ఇందులో మధ్యలో యూత్ ను మెప్పించే రొమాంటిక్ సన్నివేశాలను కూడా పెట్టడంతో మూవీ ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఓహ్ సినిమా అయిపోయిందా అప్పుడే… ఇంకేముంటుంది అనుకునేలోపే సెకెండాఫ్ లో కూడా మలుపులతో సినిమాని చివరిదాకా సస్పెన్స్ తో లాగించేశారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమాను నడిపిన విధానం ఆకట్టుకుంటుంది. 14 ఏళ్ల యువకుల్లో వచ్చే మార్పులు ఎలావుంటాయి? వారు టెక్నాలజీలో పడి ఎలాంటి వాటికి బానిస అవుతున్నారు? తల్లిదండ్రులు వారి పట్ల ప్రవర్తిస్తున్న తీరు తదితర విషయాలను ప్రీ క్లైమాక్స్ నుంచి బాగా చూపించి… తల్లిదండ్రులకు ఓ మెసేజ్ ఇచ్చారనే చెప్పొచ్చు. ఇలాంటి కథలు నిత్యం మన చుట్టూ ఏదో ఒక చోట చూస్తూనే ఉంటాం. అందుకే ఇప్పటికే బాల నేరస్తుల పాఠశాలలు అన్ని రాష్ట్రాల్లోనూ క్రిక్కిరిసి పోతున్నాయి. తల్లిదండ్రులు ముందు మారితేనే అలాంటి పాఠశాలల్లో పిల్లలు చదువుకునే దుస్థితి రాదు అనేది ఇందులో చాలా చక్కగా చూపించారు. పిల్లల ఎదురుగా తల్లిదండ్రులు ఎలాంటి పనులు చేయకూడదో… అలా చేయడం వల్ల వారు ఎలాంటి క్షణికావేశాలకు లోనవుతారనేది ఇందులో చూపించారు. ఓవరాల్ గా దర్శకుడు చేసిన ఈ ప్రయత్నం చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. గో అండ్ వాచ్ ఇట్.
నోయల్ డిటెక్టివ్ గా… ప్రీ క్లైమాక్స్ లో ఆకట్టుకుంటారు. లీడ్ రోల్ పోషించిన రతన్, విషాక చాలా రొమాంటిక్ గా నటించి యూత్ ను ఆకట్టుకున్నారు. వీరి జంట స్క్రీన్ పై చాలా క్యూట్ గా ఆకట్టుకుంటుంది. హీరోయిన్ విషాక… చాలా మచ్యూర్ గా నటించింది. ముఖ్యంగా టీచర్ పాత్రలో చూపించినప్పుడు ఆమె నటన అందరినీ ఆకట్టుకుంటుంది. జూనియర్ డాక్టర్ పాత్రలోనూ ఒక ప్రియుని విషయంలో ప్రియురాలు ఎలా ఆలోచించాలనేది ఆమె నటనలో చూపించారు. ఎక్కడా తడబాటు లేకుండా నటించారు ఈ జంట. వీరితో పాటు రుషి పాత్రలో నటించిన యువ నటి కూడా పర్వాలేదు అనిపించింది. పోసాని కృష్ణ మురళి పాత్ర ఓకే. జబర్దస్త్ మహేష్ పాత్ర కాసేపు ఉన్నా… తన మార్కు సంభాషణలతో ఆకట్టుకుంటారు. జర్నలిస్ట్ సుబ్బు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ కూడా ఆకట్టుకున్నారు. అతని భార్య పాత్రలో నటించిన నటి రూపా లక్ష్మీ పాత్ర కూడా ఒకే. మిగతా పాత్రలన్నీ తమ తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
దర్శకుడు లక్ష్మీ శ్రీనివాస్ రాసుకున్న కథ… కథనాలు చాలా బాగున్నాయి. రొమాంటిక్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్స్ ను ఎంత బాగా ట్విస్టులతో నడిపితే… ఆడియన్స్ థ్రిల్ కు గురవుతారో… అలాంటి ట్విస్టులతో సినిమాని రన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. చివర్లో ఓ మంచి మెసేజ్ ను కూడా తల్లిదండ్రులకు ఇచ్చారు. అది ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. లీడ్ జంటను చాలా రొమాంటిక్ గా, అందంగా చూపించారు. సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాని నిర్మించారు. క్వాలిటీగా ఉంది. సరదాగా ఈ వారం సినిమాను చూసేయండి.
రేటింగ్: 3










