• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, February 14, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

మంచి క్వాలిటీతో తీసిన ‘భారతీయుడు 2’ చిత్రాన్ని అందరూ చూడండి- కమల్ హాసన్

Maari by Maari
July 7, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
మంచి క్వాలిటీతో తీసిన ‘భారతీయుడు 2’ చిత్రాన్ని అందరూ చూడండి- కమల్ హాసన్

Share and Enjoy !

Shares
Twitter

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో..

యూనివ‌ర్స‌ల్ స్టార్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘నేను చెప్పాల్సిన మాటలన్నీ నా వాయిస్‌లో బ్రహ్మానందం చెప్పేశారు. 52 ఏళ్ల క్రితం టెక్నీషియన్‌గా నా ప్రయాణం మొదలైంది. ఇన్నేళ్లుగా నాకు తోడుగా ఉన్న ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మూడు తరాలు నన్ను ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. భారతీయుడు రిలీజ్ అయినప్పుడు ఈ సీక్వెల్ గురించి ఆలోచించలేదు. భారతీయుడు భారీ హిట్ అయింది. డబ్బులు వస్తాయా? అని అందరూ అన్నారు. కానీ ఇప్పుడు ఒక షెడ్యూల్‌కి పెట్టే ఖర్చే చాలా ఎక్కువగా ఉంది. శంకర్ గారి విజన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో తెలుగు సినిమాకు గొప్ప స్థానం ఉంది. నా జీవితంలో తెలుగుకి గొప్ప స్థానం ఉంది. మరో చరిత్ర, స్వాతిముత్యం, సాగర సంగమం వంటివి నా జీవితంలో వచ్చాయి. బాలచందర్, విశ్వనాథ్ వంటి వారు భాషాబేధాలను తుడిచిపారేశారు. ఇండియన్ 2 ఇప్పటి తరానికి రిలవెంట్‌గా ఉంటుంది. జనాల గురించే ఈ చిత్రం మాట్లాడుతుంది. ఇది ప్రజల సినిమా. 28 ఏళ్ల తరువాత మళ్లీ అదే దర్శకుడు, అదే పాత్ర నాకు రావడం అదృష్టం. ఇన్నేళ్లు నన్ను స్టార్‌గా నిలబెట్టారు. ఈ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేను. ప్రతిభను పట్టుకొచ్చి అందరికీ పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. సినిమానే మీ అందరితో మాట్లాడుతుంది. ఈ మూవీ సెట్‌లో కమల్ హాసన్ ఎక్కడా కనిపించలేదని అన్నారు. నాలో సేనాపతి వచ్చాడు. అందుకే కమల్ హాసన్ ఎక్కడా కనిపించలేదు. ఇండియన్ 2 జూలై 12న రాబోతోంది. అందరూ చూడండి. నేను ఈ సినిమాలో నటించాను. ఈ మూవీకి నేను అభిమానిని. చిత్రాన్ని పెద్ద హిట్ చేయండి. మంచి క్వాలిటీతో సినిమాను తీశాం. అందరూ చూడండి. ఈ మూవీకి ఆరుగురు టాప్ స్టంట్ మాస్టర్స్ పని చేశారు. ఏసియన్ సురేష్, శ్రీలక్ష్మీ మూవీస్ మా సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.జూలై 12 కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.

స్టార్ డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ.. ‘భారతీయుడు అయిన తరువాత చాలా సినిమాలు తీశాం. లంచం తీసుకునే వార్తలు చూస్తూనే ఉంటున్నాను. ఆ వార్తలు చూసినప్పుడల్లా నాకు సేనాపతి గుర్తుకు వస్తుంటాడు. కానీ స్టోరీ సెట్ అవ్వలేదు. 2.ఓ తరువాత నాకు స్టోరీ సెట్ అయింది. ఆ కథను కమల్ సర్‌కి చెప్పాను. ఆయనకు కూడా బాగా నచ్చింది. భారతీయుడు సినిమాకు గెటప్ కోసం తోట తరణి గారికి కమల్ హాసన్ గారి ఫాదర్, బ్రదర్స్ ఫోటోలన్నీ ఇచ్చాను. ఆయనిచ్చిన లుక్ చూసి షాక్ అయ్యాను. భారతీయుడు 2 సినిమా సెట్‌లోకి సేనాపతిగా కమల్ హాసన్ గారిని చూసి నాకు ఒక గూస్‌బంప్స్ వచ్చింది. ఆడియెన్స్‌కి కూడా అలాంటి ఫీలింగే వస్తుంది. నేను రాసిన దాని కంటే.. ఆయన నటించిన తరువాత ఆ సీన్ స్థాయి పదింతలు పెరుగుతుంది.అలాంటి నటులు దొరకడం అదృష్టం. రోప్‌ మీద ప్రోస్థటిక్ మేకప్‌తో నాలుగు రోజులు షూట్ చేశాం. ఆయనలా నటించే వారు ఈ వరల్డ్‌లోనే లేరు. బాయ్స్ సినిమాతో సిద్దార్థ్‌ను నేను పరిచయం చేశాను. ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. సిద్దార్థ్‌ను చూస్తుంటే గర్వంగా ఉంటుంది. రకుల్ ప్రతీ సీన్‌ను తెలుసుకుని, అర్థం చేసుకుని నటించారు. ఎస్ జే సూర్య ఎంత చేసినా సంతృప్తి అవ్వరు. బాబీ సింహా గారు ప్రాణం పెట్టి నటించారు. సముద్రఖని గారి వాయిస్ నాకు చాలా ఇష్టం. ఆయనలో ఓ డిగ్నిటీ కనిపిస్తుంటుంది. నేను బ్రహ్మానందం గారికి అభిమానిని. ఇందులో కేమియో రోల్‌లో కనిపిస్తారు. అడగ్గానే చేశారు. గేమ్ చేంజర్‌లోనూ ఓ చిన్నకేమియోలో కనిపిస్తారు. కాజల్ గారు పార్ట్ 3లో కనిపిస్తారు. అనిరుధ్ ఓ ట్యూన్ ఇస్తారు. ఎలా ఉందని అడుగుతారు. 80 శాతం బాగుందని చెబుతాను. వంద శాతం తృప్తి చెందే వరకు ట్యూన్లు ఇస్తారు. రవి వర్మన్ కెమెరా వర్క్ బాగుంటుంది. ముత్తు రాజ్ గారు అద్భుతమైన సెట్స్ వేశారు. శ్రీకర్ ప్రసాద్ గారితో మొదటి సారిగా పని చేశాను. సీన్‌లోని ఆత్మ పోకుండా కట్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతంగా వచ్చాయి. తెలుగులో పాటలు అనుకున్నదాని కంటే బాగా ఇచ్చారు. నేను అనుకున్నది అనుకున్నట్టుగా తీసేలా సహకారం అందించిన లైకా సుభాస్కరణ్, రెడ్ జెయింట్‌లకు థాంక్స్. ఇంత వరకు నేను తెలుగులో ఒక్క సినిమా చేయలేదు. ఏ ఎం రత్నం వల్లే నా సినిమాలన్నీ ఇక్కడకు వచ్చాయి. ఇక్కడ నన్ను ఎక్కువగా ఆదరించారు. ఇక్కడి ఆడియెన్స్ కోసం ఒక తెలుగు సినిమాను చేయాలని అనుకున్నాను. అదే గేమ్ చేంజర్. ఈ చిత్రానికి సంబంధించి రామ్ చరణ్ పోర్షన్ అయిపోయింది. రామ్ చరణ్‌ది ఎక్స్‌లెంట్ స్క్రీన్ ప్రజెన్స్. ఆయనలో ఒక కంట్రోల్డ్ పవర్ ఉంటుంది. ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందా? అని అనిపిస్తుంది. గేమ్ చేంజర్ సినిమా చూస్తే మీకు అది తెలుస్తుంది. భారతీయుడు 2 జూలై 12న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

ఎస్‌.జె.సూర్య మాట్లాడుతూ.. ‘ఎప్పుడెప్పుడు సినిమా వస్తే చూద్దామా? అనే ఆత్రుతలో అందరూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇండియన్ 2, గేమ్ చేంజర్, ఇండియన్ 3లో నటించాను. నాకు ఎంతో అదృష్టం ఉందనిపిస్తుంది. ఈ రెండో పార్టులో నాది క్యామియోలా ఉంటుంది. మూడో పార్టులో నా పాత్ర ఎక్కువగా ఉంటుంది. కమల్ హాసన్ గారికి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మార్క్ ఆంటోనిలో నేను గడ్డం పెట్టుకుని నటించేందుకు చాలా కష్టపడ్డాను. కానీ కమల్ హాసన్ గారు ఈ వయసులోనూ ప్రోస్థటిక్ మేకప్‌తో ఉదయం నుంచి రాత్రి వరకు అలానే ఉండేవారు. ఆయనకు సినిమా పట్ల ఉండే అంకిత భావం ముందు మనం ఎంత డబ్బు ఇచ్చినా తక్కువే అవుతుంది. ప్రేమతో మాత్రమే దాన్ని కొలవగలం. ఆయన దగ్గర్నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇళ్లు కట్టి చూడండి.. పెళ్లి చూసి చూడండి అని అంటారు.. కానీ శంకర్ గారి సెట్‌లో ప్రతీ రోజూ పది ఇళ్లు కట్టినట్టు.. పది పెళ్లిళ్లు చేసినట్టు ఉంటుంది. బ్రహ్మాండం అనే పదానికి శంకర్ గారు సూట్ అవుతారు. ఆయన మూడు పెద్ద సినిమాలు ఒకే సారి తీశారు. ఏ నటుడి నుంచి ఎంత రాబట్టుకోవాలో తెలిసిన దర్శకుడు. మంచి ఎమోషన్, మెసెజ్ ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. సిద్దార్థ్‌ గారితో మంచి రిలేషన్ ఏర్పడింది. రకుల్ గారు చక్కగా నటించారు. సముద్రఖని గారు, బాబీ సింహా గారు అద్భుతంగా నటించారు. భారతీయుడు పాటల్లానే కొడితే కాపీ కొట్టారంటారు. ఆ సినిమాను మించేలా అనిరుధ్ గారు మంచి సంగీతాన్ని అందించారు. రవి వర్మన్ గారి కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటుంది. ఇంత భారీగా సినిమాను నిర్మించిన లైకా సుభాస్కరణ్, రెడ్ జెయింట్‌లకు థాంక్స్. జూలై 12న మా చిత్రం రాబోతోంది. బ్రహ్మాండమైన విజయాన్ని అందించండి’ అని అన్నారు.

హీరో సిద్దార్థ్ మాట్లాడుతూ.. ‘20 ఏళ్ల క్రితం బాయ్స్ సినిమా ఆడియో లాంచ్ కోసం హైద్రాబాద్‌కు వచ్చాను. ప్రతీ యూత్‌కి బాయ్స్ సినిమా ఎక్కుతుందని నన్ను హీరోగా పెట్టి శంకర్ గారు సినిమా తీశారు. మళ్లీ 20 ఏళ్ల తరువాత ప్రతీ భారతీయుడుకి ఈ భారతీయుడు 2 ఎక్కుతుందని నన్ను మళ్లీ హీరోగా తీసుకొచ్చారు. నన్ను డిస్కవర్ చేసిన నా కొలంబస్ శంకర్ గారికి థాంక్స్. ఇంత వరకు నేను ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా కూడా నాకు ఇష్టమైన హీరో ఎవరంటే కమల్ హాసన్ గారు అని చెబుతూనే వచ్చాను. ఆయనతో ఇలా కలిసి నటించడం, ఆయనతో కలిసి ఇలా కూర్చోవడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన, నాకు చిత్రం ఇంత స్వేచ్చను ఇచ్చిన కమల్ హాసన్ గారికి థాంక్స్. శంకర్ గారిని తెలుగు దర్శకుడే అని ఇక్కడి ప్రేక్షకులు భావిస్తుంటారు. మళ్లీ భారతీయుడు 2తో ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ప్రతీ ఒక్కరూ సినిమాను చూడండి. భవిష్యత్తు తరాల గురించి ఈ చిత్రం మాట్లాడుతుంది. సినిమాను నిర్మించిన లైకా సుభాస్కరణ్, రెడ్ జెయింట్ మూవీస్‌‌కు థాంక్స్. ఈ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. రకుల్, బాబీ సింహా, సముద్రఖని అన్నాకు థాంక్స్. జూలై 12న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

హీరోయిన్ రకుల్ ప్రీత్ మాట్లాడుతూ.. ‘శంకర్ గారు, కమల్ హాసన్ గారి సినిమాలో నటించడం గర్వంగా ఉంది. సిద్దార్థ్ అద్భుతమైన నటుడు. ఆయనతో మళ్లీ నటించాలని కోరుకుంటున్నాను. రవి వర్మన్ గారు మా అందరినీ చక్కగా చూపించారు. జూలై 12న మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘కమల్ హాసన్ సర్, శంకర్ కాంబోలో వచ్చిన ఈ భారతీయుడు 2లో నటించడం ఆనందంగా ఉంది. నేను చదువుకునే రోజుల నుంచీ కమల్ హాసన్ గారిని చూస్తున్నాను. ఆయన శరీరంలోని ప్రతీ అణువణువు నటిస్తుంది. ఎంత కావాలో అంతే నటించగలిగే సత్తా ఉన్న నటులు. తాజ్ మహల్‌ను చూస్తే ఎంత అందంగా ఉందో అని అంటాం.. అలానే కమల్ హాసన్ గారు మన ముందుంటే.. ఆయన గొప్ప నటులు అని అనాల్సిందే. కమల్ హాసన్ గారు తన జీవితాన్ని సినిమాలకే అంకితం చేశారు. ఆర్టిస్టుల నుంచి ఎంత నటన కావాలో రాబట్టుకునే దర్శకుడు శంకర్. కమల్ హాసన్ గారి సమకాలీకుడనని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతుంటాను.

సముద్రఖని మాట్లాడుతూ.. ‘భారతీయుడు 2 చిత్రంలో నటించడంతో నా కల నెరవేరింది. శంకర్ గారు, కమల్ హాసన్ గారితో సినిమాలో నటించడం కంటే గొప్ప విషయం ఏం ఉంటుంది. కమల్ హాసన్ గారి పక్కన నటించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

బాబీ సింహా మాట్లాడుతూ.. ‘నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన శంకర్ గారికి థాంక్స్. భారతీయుడు సినిమాను విజయవాడలో చూశాను. ఆ మూవీని ఆ టైంలోనే ఆరేడు సార్లు చూశాను. కమల్ హాసన్ గారు ఓ లెజెండ్. ఆయన పక్కన నటించే అవకాశం రావడం అదృష్టం. బ్రహ్మానందం గారికి పెద్ద అభిమానిని. ఖని అన్నా, సిద్దార్థ్, రకుల్, ఎస్ జే సూర్య గారితో నటించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. ‘కమల్ హాసన్ లాంటి గొప్ప వ్యక్తి సినిమాకు పాట రాయడం అదృష్టంగా భావిస్తున్నాను. శంకర్ గారు తీసిన రోబో, శివాజీ చిత్రాలకు పాటను రాశాను. మళ్లీ ఇప్పుడు శౌర అనే పాటను రాశాను. డైరెక్టర్ శంకర్ గారు తెలుగు హృదయాన్ని చక్కగా అర్థం చేసుకుంటారు. ఇంత మంచి పాటను రాసేందుకు అవకాశం ఇచ్చిన శంకర్ గారికి థాంక్స్’ అని అన్నారు.

కాసర్ల శ్యాం మాట్లాడుతూ.. ‘భారతీయుడు సినిమాకు బ్లాక్‌లో టికెట్ కొనుక్కుని చూశాను. ఇప్పుడు భారతీయుడు 2 సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. తెలుగు పాటలానే వినిపించాలని శంకర్ గారు ప్రతీ పదాన్ని అడిగి మరీ రాయించుకున్నారు. తాతా వస్తారే అనే పాటను రాయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ‘శంకర్ గారి సినిమాలో మెసెజ్ ఎంతో గొప్పగా ఉంటుంది. నేను రాసిన పాట మూడో పార్టులో ఉంటుంది. ఈ రెండో పార్ట్ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

ఘనంగా జరిగిన విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ “తుఫాన్” ట్రైలర్ ఇంట్రడక్షన్ ఈవెంట్

Next Post

ఆగస్టు 2న ఉషా పరిణయం విడుదల

Next Post
ఆగస్టు 2న ఉషా పరిణయం విడుదల

ఆగస్టు 2న ఉషా పరిణయం విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

by Maari
February 14, 2026
0

Review: A Beautiful Breakup

Review: A Beautiful Breakup

by Maari
February 13, 2026
0

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

by Maari
February 13, 2026
0

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

by Maari
February 13, 2026
0

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

by Maari
February 12, 2026
0

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన”  స్టోరీ పోస్టర్ విడుదల

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన” స్టోరీ పోస్టర్ విడుదల

by Maari
February 12, 2026
0

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

by Maari
February 12, 2026
0

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

by Maari
February 12, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.