రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా రహస్యం ఇదం జగత్. సింగిల్ సెల్ యూనివర్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మాణంలో కోమల్ ఆర్ భరద్వాజ్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా నేడు నవంబర్ 8న థియేటర్స్ లోకి వచ్చింది. టైం ట్రావెల్, మల్టీ యూనివర్స్ కథాంశాలతో ఈ సినిమాని తెరకెక్కించారని ప్రమోషన్స్ లో చెప్పారు. మరి ఎలా ఉంటుందో చూద్దం పదండి.
కథ: ఈ కథ అంతా అమెరికాలోనే జరుగుతుంది.
ఇండియాలో ఉన్న అకీరా(స్రవంతి) తండ్రి చనిపోవడంతో తల్లి కోసం ఇండియాకు షిఫ్ట్ అయిపోదాం అనుకుంటుంది. అకీరా బాయ్ ఫ్రెండ్ అభి(రాకేష్) కూడా ఆమె కోసం ఇండియా వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతాడు. వెళ్లేముందు పాత ఫ్రెండ్స్ తో ఓ ట్రిప్ వేద్దాం అనుకోని వెళ్తారు. అలా ఓ అడవిలో ఉండే చిన్న ఊరుకు వెళ్తారు. అక్కడికి వీళ్ళ ఫ్రెండ్స్ కళ్యాణ్, అరు వస్తారు. అకీరా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ విశ్వ కూడా వస్తాడు. వాళ్ళు బుక్ చేసుకున్న హోటల్ మంచు కురవడం వల్ల క్లోజ్ అయిపోవడంతో అక్కడే ఓ ఖాళీ ఇంట్లో రాత్రికి స్టే చేయాల్సి వస్తుంది.
సైంటిస్ట్ అయిన అరు ఓ మెడికల్ ఎక్యుప్మెంట్, మల్టీ యూనివర్స్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. దీంతో వీళ్ళ మధ్యలో మన లాంటి యూనివర్స్, మనం ఇంకో చోట ఉంటాము అని వీటి గురించి చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో అకీరా కోసం అభి, విశ్వకు గొడవ జరుగుతుంది. విశ్వ ఓ భయంకరమైన డ్రగ్ తీసుకొని అకీరా, కళ్యాణ్ లను చంపేస్తాడు. అదే సమయంలో అరు మల్టీ యూనివర్స్ కి వెళ్లే దారి ఆ ఊళ్ళోనే ఉందని తెలుసుకొని అభిని తీసుకొని వెళ్తుంది. అక్కడ అరుని ఎవరో కాల్చి చంపేస్తారు. దీంతో తన ఫ్రెండ్స్ ని బతికించుకోడానికి అభి మల్టీ యూనివర్స్ లోకి తీసుకెళ్లే వామ్ హోల్ లోకి వెళ్లి మళ్ళీ వీళ్లంతా ఉన్న చోటికి వస్తాడు. అభి ఆ వామ్ హోల్ లోకి ఎలా వెళ్ళాడు? చనిపోయిన తన గర్ల్ ఫ్రెండ్, ఫ్రెండ్స్ ని బతికించుకున్నాడా? అరు రీసెర్చ్ కి ఆ ఊళ్ళో ఏం దొరికింది? విశ్వ డ్రగ్స్ కథేంటి? అభి, అకీరా ఇండియా వెళ్ళారా? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
తెలుగు వాళ్ళు తీశారు. షూటింగ్ మొత్తం అమెరికాలోనే తీశారు. అమెరికాలో ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్.. లాంటి టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసి ప్రేరణ పొంది తీసినట్టు ఉంటుంది ఈ సినిమా. అయితే ఇక్కడి జనాలకు కనెక్ట్ అవ్వడానికి మన పురాణాల్లో కూడా హనుమంతుడు ఒక లోకం నుంచి ఇంకో లోకానికి ట్రావెల్ చేయడం, కృష్ణుడు ఒకేసారి పలు చోట్ల కనపడటం, శ్రీచక్రం నుంచి వామ్ హోల్ ఏర్పడటం.. లాంటి ఉదాహరణలు తీసుకొని మైథలాజి కనెక్ట్ ఇచ్చారు.
ఫస్ట్ హాఫ్ అంతా ఫ్రెండ్స్ ట్రిప్ కి వెళ్లడం, అక్కడ వీళ్ళ మధ్య గొడవలు, డ్రామాతో బాగా సాగదీశారు. ఇంటర్వెల్ ముందు అభి ఫ్రండ్స్ చనిపోయి అతను వాళ్ళను కాపాడుకోవడానికి వామ్ హోల్ కి వెళ్లడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆసక్తిగా మారుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో వామ్ హోల్ ద్వారా టైం ట్రావెల్ చేసి అభి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళను ఎలా కాపాడతాడు అనేది ఆసక్తిగా చూపించారు. క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్ సీన్స్ కు కనెక్ట్ చేస్తూ ఇవ్వడం అదిరిపోతుంది. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే బాగుంటుంది. కాకపోతే ఆడియన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వొచ్చు. ఇక ఈ సినిమాని మొత్తం అమెరికాలోనే తీయడంతో చాలా మంది అక్కడి ఆర్టిస్టులు వాడటం, అంతా అమెరికన్ ఇంగ్లీష్ లోనే డైలాగ్స్ చెప్పడం సాధారణ ప్రేక్షకులకు అర్ధం కాకపోవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే డైలాగ్స్ పరంగా మాత్రం కొన్నిచోట్ల హాలీవుడ్ సినిమా చూసినట్టు ఉంటుంది.
ఫిలిమ్స్ తో మెప్పించిన రాకేష్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా వామ్ హోల్ లోకి ట్రావెల్ చేసి వచ్చే వ్యక్తిగా చాలా బాగా నటించాడు. స్రవంతి క్యూట్ గా మెప్పిస్తుంది. సైంటిస్ట్ పాత్రకు అరు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. భార్గవ్ అక్కడక్కడా కామెడీతో మెప్పిస్తాడు. నెగిటివ్ పాత్రలో కార్తీక్ కూడా బాగా చేసాడు. అయితే వీళ్లంతా అక్కడే సెటిల్ అవ్వడం, అక్కడే థియేటర్ ఆర్ట్స్ చేయడంతో అందరి పాత్రలపై అమెరికన్ యాక్సెంట్, హాలీవుడ్ నటన ప్రభావం అయితే కనిపిస్తుంది. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అమెరికాలో ఉండే మంచి లొకేషన్స్ వెతికి మరీ ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా చోట్ల డైలాగ్స్ ని డామినేట్ చేసే విధంగా ఉంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. డబ్బింగ్ కూడా ఇంకొంచెం పర్ఫెక్ట్ గా చెప్పిస్తే బెటర్ అనిపిస్తుంది. దర్శకుడికి మొదటి సినిమా అయినా ఈ వామ్ హోల్ కాన్సెప్ట్ ను కొత్తగా రాసుకొని మంచి స్క్రీన్ ప్లేతో బాగానే తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా కూడా ఉన్నంతలో బాగానే ఖర్చుపెట్టి మంచి అవుట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నించారు.
మొత్తంగా ‘రహస్యం ఇదం జగత్’ సినిమా.. ఓ హీరో తన ఫ్రెండ్స్ ని కాపాడుకోవడానికి వామ్ హోల్ లోకి ఎలా వెళ్ళాడు, ఎలా కాపాడాడు, సైన్స్ కాన్సెప్ట్ కు మన పురాణాలు జోడించి కొత్తగా ఎలా చూపించారు అని ఆసక్తిగా తెరకెక్కించారు. గో అండ్ వాచ్ ఇట్
రేటింగ్: 3