హీరోయిన్ వేదిక ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘ఫియర్’. యువ హీరో అరవింద్ కృష్ణ, సాయాజీ షిండే, జయప్రకాష్, అనీష్ కురువిల్లా, పవిత్ర లోకేష్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా పతాకంపై నిర్మాత డాక్టర్ వంకి పెంచలయ్య, ఎ.ఆర్.అభి సంయుక్తంగా నిర్మించారు. డాక్టర్ హరిత గోగినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం థ్రిల్ కు గురిచేసిందో చూద్దాం పదండి.
కథ: సింధూ(వేదిక) చిన్నప్పటి నుంచి ఉన్నది లేనట్లు… లేనిది ఉన్నట్లు ఊహించుకొని విపరీతంగా భయపడిపోతూ వుంటుంది. దాంతో ఆమెను శీను, గీత(సాయాజీ షిండే, సత్యవతి)లు నిర్వహించే మానసిక వికలాంగులకోసం పనిచేసే ఆశ్రమంలో ఉంచి పెంచుతారు. అక్కడ సింధూ ఎలా పెరిగి పెద్దదైంది? ఆశ్రమంలో చేరిన తరువాత సింధూ ప్రవర్తన మారిందా? తనకున్న భయాన్ని పోగొట్టుకుందా? ఆమె ఎలాంటి డిజార్డర్ తో బాధపడుతోంది? ఆమె జీవితం చివరకు ఎలాంటి టర్న్ తీసుకుంది? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. సరైన కథ… కథనాలు ఉంటే… ఆడియన్స్ ను సీట్లో కదలనీయకుండా కూర్చోబెట్టొచ్చు. ఇలాంటి కథ… కథనాలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. అందుకే కొత్తగా వచ్చిన నిర్మాతలు గానీ, దర్శకులు గానీ ఇలాంటి కథలను… కథనాలను గ్రిప్పింగ్ గా తెరమీద చూపించి విజయం సాధిస్తున్నారు. అలాంటి గ్రిప్పింగ్ కథ… కథనాలతో తెరకెక్కిన చిత్రమే ‘ఫియర్’. మలయాళీ భామ వేదికను లీడ్ రోల్ లో చూపించారు. ఫస్టాఫ్ లో ఆమె ఉన్న ఉన్నది లేనట్టు… లేనిది ఉన్నట్టు ఊహించుకునే ‘హ్యాలూజినేషన్’తో బాధపడే అమ్మాయిగా చూపించారు. సెకెండాఫ్ లో ఆమె బాల్యంలో జరిగిన ఘటనలు, ఆమె తల్లిదండ్రులు ఎందుకు ఆమె బాల్యాన్ని పట్టించుకోలేదు… తదితర వివరాలను చివర్లో సైకియాట్రిస్ట్ అనీష్ కురువిల్లా ద్వారా కన్వెన్సింగ్ గా చెప్పించారు. ఓవరాల్ గా బాల్యంలో పిల్లల నడవడికను పట్టించుకోకుంటే… వాళ్ల ఎదుగుదల ఎలా వుంటుంది? వారి జీవితం ఎలా మారిపోతుందనేది తల్లిదండ్రులకు ఓ మెసేజ్ ఇచ్చేలా వుంది. దర్శకురాలు గోగినేని హరిత మంచి కాన్సెప్ట్ ను ఎంచుకుని తీశారు. పిల్లల తల్లిదండ్రులకు ఈ సినిమా ఓ ఓరియంటేషన్ మూవీలా వుంది. గో అండ్ వాచ్ ఇట్.
వేదిక భయపడే అమ్మాయిగా… హ్యాలూజనేషన్ తో బాధపడే అమ్మాయిగా రెండు పాత్రల్లో వేరియేషన్ చూపించి నటించారు. ఆమె తల్లిదండ్రులుగా నటించిన జేపీ, పవిత్ర లోకేష్ బాగా నటించారు. పిల్లలను పోగొట్టుకుని ఓ అనాథ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ… మానసిక వికలాంగుల బాగోగులను చూసుకునే పాత్రలో సాయాజీ షిండే, సత్య కృష్ణలు చాలా బాగా చేశారు. వేదికను చిన్నప్పటి నుంచి తన డిజార్డర్ గురించి తెలుసుకుని తమ ఆశ్రమంలోనే పెంచి పెద్ద చేస్తారు. యువ హీరో అరవింద్ కృష్ణ… సంపత్ పాత్రలో తన పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇందులో హీరోయిన్ సంపత్ ప్రేమలో పడి తన జీవితంలో ఎలాంటి ఒడుదొడుకులు ఎదుర్కొందనేది చాలా బాగా చూపించారు. పొసెసివ్ నెస్ తో అమ్మాయిలు ఎలాంటి కష్టాలు తెచ్చుకుంటారనేది కూడా ఇందులో చూపించారు. మితా పాత్రలన్నీ తమ తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
దర్శకురాలు ఎంచుకున్న కథ… కథనాలు బాగున్నాయి. పిల్లల తల్లిదండ్రులకు మెసేజ్ ఇచ్చేలా సినిమాని రూపొందించారు. బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి అదనపు బలం. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా కథ.. కథనాలు నడిపించడానికి బాగా ఉపయోగపడింది. అలాగే నిడివి కూడా ఈ సినిమాకి అదనపు బలం. చాలా తక్కవు రన్ టైం వుండటంతో సినిమా ఎక్కడా బోరింగ్ గా అనిపించదు. సినిమాటోగ్రఫీ బాగుంది. వేదికను చాలా అందంగా చూపించారు. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3