• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Tuesday, May 19, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఫాల్స్ ప్రెస్టీజికి పోయి లోన్ యాప్స్ ఉచ్చులో అష్టకష్టాలు పడే కుర్రాడి కథ “తకిట తధిమి తందాన”

Maari by Maari
February 28, 2025
in Reviews
0
ఫాల్స్ ప్రెస్టీజికి పోయి లోన్ యాప్స్ ఉచ్చులో అష్టకష్టాలు పడే కుర్రాడి కథ “తకిట తధిమి తందాన”

Share and Enjoy !

Shares
Twitter

ఓపెన్ గా.. “ఇదీ నా పరిస్థితి” అని చెప్పి, బయటపడకుండా… ఓవర్ కాన్ఫిడెన్స్ ఫాల్స్ ప్రెస్టేజ్ తో లేనిపోని కష్టాలు కొని తెచ్చుకునే కుర్రాడి కథ “తకిట తధిమి తందాన”. ఆలోచింపజేస్తూనే వినోదాన్ని పంచే ట్రెండీ ఎంటర్టైనర్.

“మర్డర్” ఫేమ్ గణాదిత్య – అచ్చ తెలుగమ్మాయి “ప్రియ కొమ్మినేని” జంటగా.. రాజ్ లోహిత్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. తాను నిర్మాతగా అరంగేట్రం చేస్తూ… “ఎల్లో మ్యాంగో ఎంటర్‌టైన్‌మెంట్” పతాకంపై.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ టర్నెడ్ ప్రొడ్యూసర్ “చందన్ కుమార్ కొప్పుల” నుంచి వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న సినెటేరియా మీడియా వర్క్స్ ద్వారా విడుదలైంది. గంగవ్వ, సతీష్ సారిపల్లి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. “ఎప్పటికీ ఇలాగే పెద్ద మొత్తంలో నెలనెలా జీతం అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుందనే భ్రమలో, కలల్లో విహరించే కుర్రాళ్లకు కొంతలోకొంత కనువిప్పు కలిగేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు యువ దర్శకుడు రాజ్ లోహిత్.

రామ్ గోపాల్ వర్మ “మర్డర్”తోపాటు… “సమ్మేళనం” అనే వెబ్ సిరీస్ లో నటించిన గణాదిత్య నేటి యువతరానికి ప్రతినిధిలా తన పాత్రలో ఒదిగిపోయాడు. తనను తాను ఇంకొంచెం సానబెట్టుకుంటే ఈ కుర్రాడికి హీరోగా మంచి భవిష్యత్ ఉంటుంది. హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి “ప్రియ కొమ్మినేని”కి కూడా. పరభాషా హీరోయిన్లను చూసి చూసి విసిగిపోతున్న ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. హావభావాలపై మరి కాస్త దృష్టి పెడితే, ఈ అచ్చ తెలుగమ్మాయికి కూడా ప్రేక్షకులు కచ్చితంగా పట్టం కడతారు. గంగవ్వ కనిపించేది కాసేపే అయినా… కథకు/సినిమాకు చాలా హెల్పయ్యే పాత్ర. హీరోయిన్ తండ్రి పాత్రధారి సతీష్ సారిపల్లి కూడా మంచి మార్కులే స్కోర్ చేస్తాడు. స్వతహా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన నిర్మాత చందన్.. ఇందులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ గా కనిపిస్తారు. “నిర్మాణంతోపాటు… నటనపై కూడా ఫోకస్ పెట్టొచ్చు” అనేంతగా… తన నటన చాలా నేచురల్ గా ఉంది. హరిశంకర్ ఎడిటింగ్ ఈ చిత్రానికి ఎస్సెట్. నరేన్ రెడ్డి సంగీతం గురించి పెద్దగా వంకలు పెట్టడానికి ఏమీ లేకపోయినా… ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేదనిపిస్తుంది.

ఇక దర్శకత్వం విషయానికి వస్తే… స్వయంగా కథ – సంభాషణలు సమకూర్చుకున్న రాజ్ లోహిత్… రచయితగా మంచి మార్కులు స్కోర్ చేసినా… దర్శకుడిగా కొంచెం తడబడ్డాడనిపిస్తుంది. నేరేషన్ లో స్పీడ్ పెంచి, ఆడియో క్వాలిటీపరంగా కేర్ తీసుకుని… “మేడ్ ఫర్ ఈచ్ అదర్” అనిపించేలా ఉన్న హీరో-హీరోయిన్ మధ్య ఇంకొంచెం కెమిస్ట్రీ, ఎమోషన్స్ వర్కవుట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ చిత్రం మరింత బాగుండేది. అయితే చిన్న చిత్రాలకుండే బడ్జెట్ పరిమితులు, ప్రాక్టికల్ డిఫికల్టీస్ గురించి కూడా ఆలోచించినప్పుడు.. దర్శకుడిగానూ అతన్ని మెచ్చుకోవచ్చు. ముఖ్యగా… హీరో ఏ ఫాల్స్ ప్రెస్టేజ్ తో అప్పులు పాలయ్యాడో… ఆ ఫాల్స్ ప్రెస్టేజ్ ని పక్కన పెట్టి, వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే, తాత్కాలిక ఉపశమనం కోసం “స్విగ్గి బాయ్” అవతారం ఎత్తడం వంటి సీన్స్ దర్శకుడి ప్రతిభకు అద్దం పడతాయి!!

ఇక ఈ చిత్రంతో నిర్మాతగానూ, నటుడిగానూ మారిన చందన్ కుమార్ కొప్పుల, తన తొలి ప్రయత్నంలొనే… ఓ ప్రతిభావంతుడ్ని దర్శకుడిగా, ఓ తెలుగమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చెయ్యడం కచ్చితంగా అభినందనీయం. వినోదంతోపాటు చిన్న సందేశాన్ని జోడించి.. ఒక క్లీన్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చిన చందన్ నుంచి కచ్చితంగా మరిన్ని మంచి చిత్రాలు ఆశించవచ్చు. యూత్ ఫుల్ చిత్రం అనగానే.. అనవసరమైన అసభ్యతను చొప్పించే నేటి కాలంలో… హీరోహీరోయిన్ల నడుమ వచ్చే రొమాంటిక్ సీన్స్.. శృతి మించకుండా, పొయిటిక్ గా తెరకెక్కించడం యూత్ కూడా ఇష్టపడేలా ఉన్నాయి.

చివరిగా చెప్పాలంటే…
ఆలోచింపజేస్తూనే ఆనందింపజేసే
క్లీన్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్

రేటింగ్: ౩/5

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

ఎంగేజింగ్ సూపర్ థ్రిల్లర్… గార్డ్

Next Post

థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ : ప్రెస్ మీట్ లో చిత్ర బృందం

Next Post
థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ : ప్రెస్ మీట్ లో చిత్ర బృందం

థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చిత్రం 'మ్యాడ్ స్క్వేర్' : ప్రెస్ మీట్ లో చిత్ర బృందం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

“సమ్మర్ హాలిడేస్” మూవీ నుంచి “మన శంకర వరప్రసాద్ గారు” మూవీ ఫేమ్ బాలనటి ఖుషి బర్త్ డే పోస్టర్ రిలీజ్

“సమ్మర్ హాలిడేస్” మూవీ నుంచి “మన శంకర వరప్రసాద్ గారు” మూవీ ఫేమ్ బాలనటి ఖుషి బర్త్ డే పోస్టర్ రిలీజ్

by Maari
May 19, 2026
0

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

by Maari
May 19, 2026
0

చిన్న హీరో – పెద్ద సహాయం నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

చిన్న హీరో – పెద్ద సహాయం నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

by Maari
May 19, 2026
0

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’

by Maari
May 17, 2026
0

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్

by Maari
May 16, 2026
0

‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రీకరణలో అదొక మెమరబుల్ మూమెంట్.. నటుడు ప్రదీప్ కొట్టె

‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రీకరణలో అదొక మెమరబుల్ మూమెంట్.. నటుడు ప్రదీప్ కొట్టె

by Maari
May 16, 2026
0

సందడిగా   డబ్బింగ్ కళాకారులకు “వాగ్దేవి అవార్డ్స్ ” ప్రదానం

సందడిగా డబ్బింగ్ కళాకారులకు “వాగ్దేవి అవార్డ్స్ ” ప్రదానం

by Maari
May 11, 2026
0

హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

by Maari
May 11, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.