• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, February 13, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘షష్టిపూర్తి’ కోసం పెట్టిన బడ్జెట్ అంతా కూడా తెరపై కనిపిస్తుంది – హీరో, నిర్మాత రూపేశ్

Maari by Maari
May 27, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
‘షష్టిపూర్తి’ కోసం పెట్టిన బడ్జెట్ అంతా కూడా తెరపై కనిపిస్తుంది – హీరో, నిర్మాత రూపేశ్

Share and Enjoy !

Shares
Twitter

ప్రస్తుతం ఉన్న తరుణంలో ఓ ఫ్యామిలీ ఎమోషన్స్, కుటుంబ కథా చిత్రాలు, విలువలను చాటి చెప్పే కథల్ని నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఓ సందేశాత్మక చిత్రంగా ‘షష్టిపూర్తి’ సినిమాను రూపేశ్ నిర్మించారు. నిర్మాతగానే కాకుండా హీరోగానూ నటించారు. డా. రాజేంద్ర ప్రసాద్, నటి అర్చన, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని పవన్ ప్రభ తెరకెక్కించారు. మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం మే 30న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో హీరో, నిర్మాత రూపేశ్ మంగళవారం (మే 27) నాడు మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన విశేషాలివే..

* ‘షష్టిపూర్తి’ కథ నాకు చాలా నచ్చింది. ప్రస్తుతం ఇలాంటి కథలే రావడం లేదు. హింసతో కూడిన చిత్రాలే వస్తున్నాయి. ఇలాంటి విలువలతో స్క్రిప్ట్ నా వద్దకు రావడంతో ఎంతో ఆనందించాను. ఇందులో అన్ని రకాల అంశాలుంటాయి. ఈ చిత్రాన్ని నిర్మించడం ఆనందంగానే ఉన్నా.. నటించడాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేశాను.

* ‘షష్టిపూర్తి’ పూర్తిగా కల్పిత చిత్రమే. కానీ ఇందులోని పాత్రల్ని చూస్తే ఆడియెన్స్ మాత్రం తమని తాము చూసుకున్నట్టుగా కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం అసలు స్వచ్చమైన ప్రేమను కూడా చూపించడం లేదు. ఇందులో కుటుంబ అంశాలతో పాటుగా అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించాం.

* ‘షష్టిపూర్తి’ కథను రాజేంద్ర ప్రసాద్ గారి కోసమే పవన్ ప్రభ రాసుకున్నారు. ఆయన కొడుకుగా నటించే వారిది కొత్త మొహం అయితే ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాను చూస్తారు. అందుకే కొత్త ఫేస్ కోసం దర్శకుడు చూశారు. చివరకు నేను ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను.

* ఇళయరాజా గారి మ్యూజిక్‌తో సినిమా స్థాయి పెరిగింది. ఆయన మాకు ఎంతో సహకరించారు. ప్రతీ పాటకు ఎన్నో ఆప్షన్స్ ఇచ్చారు. బయట ప్రచారం జరిగినట్టుగా అక్కడ ఏమీ జరగలేదు. కీరవాణి గారు అడిగిన వెంటనే పాటను రాసి ఇచ్చారు. చైతన్య ప్రసాద్ గారి వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇందులోని పాటలు, ఆర్ఆర్ ఆడియెన్స్‌ను కదిలిస్తాయి.

* ‘షష్టిపూర్తి’ కథ విన్న తరువాత ఇలాంటి పెద్ద టీం ఉండాల్సిందే అని ఫిక్స్ అయ్యాను. అందుకే పెద్ద పెద్ద టెక్నీషియన్ల కోసం ట్రై చేశాం. బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువే అయింది. అయితే ఆ ఖర్చు పెట్టింది అంతా కూడా తెరపై కనిపిస్తుంది. అయితే ఎవ్వరూ కూడా ఇంత ఇవ్వాలని డిమాండ్ చేయలేదు.

* ‘షష్టిపూర్తి’ కోసం చాలా వర్క్ షాప్స్ చేశాం. నాకు అయితే ఎమోషనల్ సీన్స్ చేయడం సులభం అనిపిస్తుంది. అది నా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు.

* ‘షష్టిపూర్తి’ కథ వినే పెద్ద టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. కథలో బలం ఉందనే ఇళయరాజా గారు, తోట తరణి గారు ఒప్పుకున్నారు. దానికి తగ్గట్టే మంచి అవుట్ పుట్ వచ్చింది. నేను ముందుగా ఈ ప్రాజెక్ట్‌లోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాను. మా ఆయి ప్రొడక్షన్స్ అంటే.. మా అమ్మ ప్రొడక్షన్ అని అర్థం. అమ్మ జ్ఞాపకార్థంగానే అలా పెట్టుకున్నాను. అవుట్ పుట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాను.

* రాజేంద్ర ప్రసాద్ గారైనా, అర్చన గారైనా, ఇళయరాజా గారైనా సరే ఏదైనా ఒక పని చేస్తే వంద శాతం ఫోకస్డ్‌గా ఉంటారు. అందుకే వాళ్లు ఆ స్థాయికి వెళ్లారు. ఏ పని చేసినా వంద శాతం ఫోకస్డ్‌గా చేయాలని వాళ్లని చూసి నేర్చుకున్నాను.

* ‘షష్టిపూర్తి’ చిత్రంలో అందమైన ప్రేమ కథ కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో అలాంటి ఓ సింపుల్, సెన్సిబుల్ లవ్ స్టోరీ రాలేదు. ఆకాంక్ష చక్కగా నటించారు. ఆమెతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. కమర్షియల్ కోసం ఎలాంటి అనవసరపు అంశాల్ని జోడించలేదు. కథకు తగ్గట్టుగా ఇళయరాజా గారు అద్భుతమైన సంగీతం, పాటలు అందించారు. యువన్ శంకర్ రాజా గారు పాడిన ఎరోటిక్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.

* నాన్ థియేట్రికల్ ద్వారా మంచి బిజినెస్ జరిగింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మా చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాం. ఇక్కడి స్పందనను చూసి ఓవర్సీస్‌లో కాస్త ఆలస్యంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. మౌత్ టాక్‌తోనే ఈ మూవీ ముందుకు వెళ్లాలని నేను కోరుకుంటున్నాను.

 

“Every bit of the budget spent on ‘Shashtipoorthi’ is visible on screen” – Hero and Producer Rupeysh

In the current scenario, producing a film that emphasizes family emotions, values, and meaningful storytelling is no small task. Rupeysh has taken up such a mission with the film Shashtipoorthi. He not only produced the film but also played the lead role. Directed by Pavan Prabha, the film features Dr. Rajendra Prasad, actress Archana, and Aakanksha Singh in key roles. Made under the banner of MAA AAIE Productions, the film is set for release on May 30. As part of the promotions, hero and producer Rupeysh interacted with the media on Tuesday (May 27) and shared several insights about the film. Here are the highlights:
• “I really liked the story of Shashtipoorthi. These kinds of stories are rare these days. Most films now are filled with violence. So, when a script with such values came to me, I felt truly happy. The film includes all kinds of emotions. Though producing it was satisfying, I enjoyed acting in it even more.”
• “Shashtipoorthi is a completely fictional story. But when audiences see the characters, they’ll feel a strong connection, as if they’re seeing themselves on screen. Genuine love is hardly portrayed in current cinema. In this film, we’ve shown all kinds of emotions, along with strong family elements.”
• “Pavan Prabha wrote the story of Shashtipoorthi specifically for Rajendra Prasad garu. Since the role of his son is played by a newcomer, the audience will watch it with no prior expectations. That’s why the director looked for a new face, and I eventually became part of the project.”
• “Ilaiyaraaja sir’s music elevated the film. He supported us wholeheartedly and gave us several options for each song. Contrary to rumors, nothing negative happened. He composed a song immediately when Keeravani garu requested. All of this became possible thanks to Chaitanya Prasad garu. The songs and background score in the film will touch the audience.”
• “After hearing the story of Shashtipoorthi, I was convinced we needed a top-tier team. So, we aimed for experienced technicians. The budget went beyond our initial estimate, but all that money is reflected on screen. No one demanded high fees—they all worked with commitment.”
• “We conducted many workshops for Shashtipoorthi. For me personally, emotional scenes come naturally. That’s not overconfidence—it’s just where I feel comfortable.”
• “Veteran technicians joined this project after hearing the story. Ilaiyaraaja sir and Thota Tharani sir agreed to come on board because they believed in the strength of the script. And the output reflects that belief. I first came into this project as a producer. MAA AAIE Productions means ‘My Mother’s Production.’ I named it in memory of my mother. I’m very happy with how the film turned out.”
• “Whether it’s Rajendra Prasad garu, Archana garu, or Ilaiyaraaja garu—whenever they take up a task, they give it 100% focus. That’s how they reached their level of success. Watching them, I learned to give my fullest to whatever I do.”
• “Shashtipoorthi also features a beautiful love story. In recent times, we haven’t seen a simple and sensible love story like this. Aakanksha acted wonderfully. I enjoyed working with her. We didn’t include any unnecessary elements just for commercial reasons. Ilaiyaraaja garu provided music and songs that truly suit the story. The erotic song sung by Yuvan Shankar Raja will grab attention.”
• “We’ve done good business through non-theatrical rights. We’re planning a wide release in both Telugu states. Based on the response here, we’re thinking of releasing the film overseas with a slight delay. I hope Shashtipoorthi progresses through strong word-of-mouth.”

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

టొవినో థామస్ ‘నరివెట్ట’ కు మంచి రెస్పాన్స్ , త్వరలో తెలుగులో రిలీజ్ !!!

Next Post

షష్టిపూర్తి’ గొప్ప చిత్రం అవుతుందని నా గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నా – నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్

Next Post
షష్టిపూర్తి’ గొప్ప చిత్రం అవుతుందని నా గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నా – నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్

షష్టిపూర్తి’ గొప్ప చిత్రం అవుతుందని నా గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నా - నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Review: A Beautiful Breakup

Review: A Beautiful Breakup

by Maari
February 13, 2026
0

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

by Maari
February 13, 2026
0

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

by Maari
February 13, 2026
0

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

by Maari
February 12, 2026
0

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన”  స్టోరీ పోస్టర్ విడుదల

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన” స్టోరీ పోస్టర్ విడుదల

by Maari
February 12, 2026
0

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

by Maari
February 12, 2026
0

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

by Maari
February 12, 2026
0

‘ఫంకీ’ సినిమా రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది: చిత్ర బృందం

‘ఫంకీ’ సినిమా రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది: చిత్ర బృందం

by Maari
February 12, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.