• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

జూలై 31న విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ విడుదల

admin by admin
July 7, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
జూలై 31న విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

జూలై 31న విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ విడుదల

అదిరిపోయే యాక్షన్ ప్రోమోతో కొత్త విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం

తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్‌డమ్’ ఒకటి. విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘హృదయం లోపల’ గీతం విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘కింగ్‌డమ్’ విడుదల కోసం విజయ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు.

‘కింగ్‌డమ్’ చిత్రం జూలై 31, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. యాక్షన్, హీరోయిజం, డ్రామాల సమ్మేళనంగా శక్తివంతమైన చిత్రంగా ‘కింగ్‌డమ్’ రూపుదిద్దుకుంటోంది. ప్రోమోలో యుద్ధ సన్నివేశాలు, భావోద్వేగాలు, విజువల్స్ కట్టిపడేశాయి. మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సినిమాటిక్ దృశ్యాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నట్లు ఈ ప్రోమో హామీ ఇస్తోంది.

ఈ అద్భుతమైన చిత్రాన్ని వెండితెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు కొత్త విడుదల తేదీ ప్రకటన ఎంతో ఉపశమనాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. అభిమానుల అంచనాలకు మించే చిత్రాన్ని అందించాలనే ఏకైక లక్ష్యంతో ‘కింగ్‌డమ్’ కోసం చిత్ర బృందం అదనపు సమయాన్ని కేటాయిస్తోంది.

కొత్త విడుదల తేదీ ప్రకటన సందర్భంగా నిర్మాతలు స్పందిస్తూ.. “కింగ్‌డమ్ కేవలం సినిమా కాదు.. ఇది మేము ఎంతో మక్కువతో నిర్మించిన ఒక గొప్ప ప్రపంచం. ప్రతి ఫ్రేమ్ మరపురానిదిగా ఉండాలని మేము కోరుకున్నాము. జూలై 31న ఈ చిత్రం బాక్సాఫీస్ తుఫానుకు నాంది పలుకుతుంది.” అన్నారు.

కింగ్‌డమ్ రిలీజ్ డేట్ ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అద్భుతమైన విజువల్స్, సంగీతంతో రూపొందిన ఈ ప్రోమో అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది.

ప్రతిభగల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ‘కింగ్‌డమ్’ కోసం అద్భుతమైన కథను ఎంచుకున్నారు. ఆ అద్భుతమైన కథను, అంతే అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు.

‘కింగ్‌డమ్’ చిత్రానికి ప్రతిభగల సాంకేతిక బృందం పని చేస్తోంది. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. జోమోన్ టి. జాన్ మరియు గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం అత్యున్నత స్థాయిలో ఉండనుంది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్ర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ‘కింగ్‌డమ్’ చిత్రం.. ప్రేక్షకులను మునుపెన్నడూ చూడని గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించనుందని నిర్మాతలు హామీ ఇచ్చారు.

తారాగణం: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య

సంగీతం: అనిరుధ్ రవిచందర్

ఛాయాగ్రహణం: జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISC
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకరా స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్

The Wait Ends! ‘KINGDOM’ to Release Worldwide on July 31st – Team Unveils New Action-Packed Promo!

The much-anticipated action drama ‘KINGDOM’ starring Vijay Deverakonda, Satyadev, Bhagyasree Borse and Written & Directed by Gowtam Tinnanuri have officially announced that the film will release worldwide on July 31st, 2025. Alongside the release date, the team has also dropped a high-octane promo that has left fans thrilled and wanting more.

Bringing together a potent blend of action, heroism and high-stakes drama. The newly released promo teases intense action sequences, dramatic confrontations and visually arresting battle visuals… all of which promise a cinematic spectacle like never before.

The announcement of the new release date comes as a huge relief and excitement for fans who have been eagerly waiting to witness this epic unfold on the big screen. The team has reportedly used the extra time to further enhance the scale and finesse of the film.

Speaking about the new date, the makers shared, KINGDOM is not just a film…it’s a vision and a world we’ve passionately built. We want every frame to be unforgettable. July 31st will mark the beginning of a cinematic storm. The promo has already started trending across social media, with fans praising its larger-than-life scale, thumping score, and electrifying glimpses of the lead characters.

The film is produced by S Naga Vamsi of Sithara Entertainments and Sai Soujanya of Fortune Four Cinemas & Presented by Srikara Studios. This grand production boasts a stellar technical team Music by the sensational Anirudh Ravichander, Editing by National Award winner Navin Nooli and Cinematography by the acclaimed duo Jomon T John and Girish Gangadharan. With such an exceptional crew, Kingdom promises to be a cinematic spectacle like no other.

Get ready to witness the KINGDOM roar into theatres this July 31st, 2025.

Previous Post

11న థియేటర్లలో “దీర్ఘాయుష్మాన్ భవ”

Next Post

శివుడు, విష్ణువుల అవతారం ఈ ‘వీరమల్లు’

Next Post
శివుడు, విష్ణువుల అవతారం ఈ ‘వీరమల్లు’

శివుడు, విష్ణువుల అవతారం ఈ 'వీరమల్లు'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

by admin
August 29, 2025
0

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

by admin
August 29, 2025
0

Review: బ్రహ్మాండ

Review: బ్రహ్మాండ

by admin
August 29, 2025
0

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… త్రిబాణధారి బార్బరిక్

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… త్రిబాణధారి బార్బరిక్

by admin
August 29, 2025
0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదల

by admin
August 28, 2025
0

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

by admin
August 28, 2025
0

డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

by admin
August 26, 2025
0

త్రిబాణధారి బార్బరిక్’ లాంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి – ప్రముఖ సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి

త్రిబాణధారి బార్బరిక్’ లాంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి – ప్రముఖ సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి

by admin
August 24, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.