మన్నికైన నాణ్యత గల ఆభరణాల సంస్థ గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ షోరూం విజయనగరం ఎంజీ రోడ్డులోని 21వ స్టోర్ శనివారం ఉదయం ప్రారంభమైంది. దీనిని సినీనటి రితికా నాయక్ లాంఛనంగా ప్రారంభించారు. హీరోయిన్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. యువతులు అందంగా కనిపించేందుకు ఈ జ్యువెలరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ షోరూంలో మంచి సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్లు ఉన్నాయని సినీనటి రితికా నాయక్ అన్నారు.
గోయాజ్ జ్యూవెలరీ ఛైర్మన్ వేములూరి రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ” గోయాజ్ స్టోర్ ప్రారంభం సందర్భంగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 15 వరకు అద్భుతమైన ఆఫర్లను గొప్ప ప్రారంభ ఆఫర్లతో అందిస్తున్నట్లు తెలిపారు. అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొందిన ఏకైక సిల్వర్ జ్యువెలరీ స్టోర్ గోయాజ్ లో వెండి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే త్వరలో దక్షిణ భారత దేశంలో మరో ఐదు జ్యూవెలరీ షోరూం లు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. “










