• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Wednesday, March 4, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘ఫంకీ’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది: దర్శకుడు కె.వి. అనుదీప్

Maari by Maari
February 10, 2026
in Cinema, Latest News, Movies, news
0
‘ఫంకీ’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది: దర్శకుడు కె.వి. అనుదీప్

Share and Enjoy !

Shares
Twitter

‘జాతిరత్నాలు’తో హాస్య చిత్రాలలో కొత్త పంథాను సృష్టించిన దర్శకుడు కె.వి. అనుదీప్, ఇప్పుడు ‘ఫంకీ’తో మరోసారి థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించడానికి వస్తున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్‌ కథానాయిక. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 13న విడుదలవుతున్న ‘ఫంకీ’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకొని అంచనాలను రెట్టింపు చేశాయి. ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాల విందుని అందించడానికి ‘ఫంకీ’ చిత్రం ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగుపెడుతున్న నేపథ్యంలో తాజాగా దర్శకుడు కె.వి. అనుదీప్ మీడియాతో ముచ్చటించి సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సినిమాకి ‘ఫంకీ’ అనే టైటిల్ పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి?
‘ఫంకీ’ టైటిల్ వినడానికి క్యాచీగా ఉంటుంది. అలాగే ఈ తరం అభిరుచులకు తగ్గట్టుగా ఉంటుందని ఈ టైటిల్ ను ఎంచుకోవడం జరిగింది. హీరో పాత్రకు కూడా ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుంది.

విశ్వక్ సేన్ పాత్ర ఎలా ఉండబోతుంది?
విశ్వక్ సేన్ ఇందులో ఒక సినిమా దర్శకుడి పాత్రలో కనిపిస్తారు. ఈ పాత్రను రాసుకున్నప్పుడే విశ్వక్ అయితే బాగుంటారు అనిపించింది. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది.

‘ఫంకీ’ సినిమా జానర్, కథాంశం ఏమిటి? జాతిరత్నాలకు భిన్నంగా ఉంటుందా?
‘జాతిరత్నాలు’తో పోలిస్తే ‘ఫంకీ’ చిత్రం పూర్తి కొత్తగా ఉంటుంది. ఇది అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో దర్శకుల జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనలను సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా సరదాగా చూపించడం జరిగింది. అలాగే ప్రేమ కథతో పాటు కుటుంబానికి సంబంధించిన మంచి భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉంటాయి. నిజ జీవితంలో ప్రేక్షకులను కనెక్ట్ అయ్యే సీన్స్ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది ఈ సినిమా ఉంటుంది.

‘ఫంకీ’ సినిమాలో లాజిక్ ఉంటుందా?
ఖచ్చితంగా లాజిక్ ఉంటుంది. నా సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, లాజిక్ ఉండదని మీకు అనిపించవచ్చు. కానీ అన్ని సినిమాల్లో లాజిక్ ఉంటుంది.

‘జాతిరత్నాలు’ తరహా హాస్యం ప్రయత్నించి కొందరు విఫలమయ్యారు.. దానిపై మీ అభిప్రాయం?
మన సృష్టించే ప్రపంచం, పాత్రలు నిజ జీవితానికి దగ్గరగా ఉండాలి. హాస్య సన్నివేశాల్లో సహజత్వం ఉట్టిపడాలి. అప్పుడే అది ప్రేక్షకులకు చేరువ అవుతుందని నేను నమ్ముతాను. ‘ఫంకీ’ కూడా సినీ నేపథ్యం అయినప్పటికీ, సాధారణ ప్రేక్షకులకు చేరువ అయ్యేలా రూపొందించడం జరిగింది.

ఈ సినిమాలో మీరు నటించారా? భవిష్యత్తులో పూర్తిస్థాయి నటుడిగా మారే ఆలోచన ఉందా?
‘ఫంకీ’లో నేను అతిథి పాత్రలో కనిపిస్తాను. నాకు నటుడిగా కంటే దర్శకుడిగా సినిమాలు చేయడమే ఆసక్తి. పూర్తిస్థాయి నటుడిగా మారే ఆలోచన లేదు. చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయి. దర్శకుడిగానే మరిన్ని సినిమా చేయాలని ఉంది.

ట్రైలర్ లో కామెడీ పంచ్ లు బాగా పేలాయి. మీరిలా కామెడీ సినిమాలు మాత్రమే చేస్తారా?
విభిన్న తరహా సినిమాలు చేయాలని ఉంది. ట్రైలర్ అనేది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం పూర్తి వినోదభరితంగా రూపొందించడం జరుగుతుంది. ‘ఫంకీ’లో హాస్యంతో పాటు అందమైన ప్రేమ కథ, కుటుంబ భావోద్వేగాలు కూడా ఉంటాయి. అన్ని అంశాలు చక్కగా కుదిరాయి. ఇందులో కొన్ని సర్ ప్రైజ్ లు కూడా ఉంటాయి.

ఈ సినిమాలో అతిథి పాత్రల్లో ఎవరెవరు కనిపిస్తారు?
ఈ సినిమాలో దర్శకులు హరీష్ శంకర్ గారు, కళ్యాణ్ శంకర్, నిర్మాతలు దిల్ రాజు గారు, నాగవంశీ గారు అతిథి పాత్రల్లో కనిపిస్తారు. అయితే ఆ పాత్రలు కథలో భాగంగానే వస్తాయి. ఆ పాత్రలతో కూడా సహజమైన సంభాషణలతో హాస్యాన్ని పుట్టించే ప్రయత్నం చేశాము.

మీ గత చిత్రం ‘ప్రిన్స్’ ఫలితం మీపై ఏమైనా ప్రభావం చూపిందా?
జయాపజయాలు సహజం. ఏ సినిమాకి అయినా ఒక మంచి సినిమా చేస్తున్నామనే ఉద్దేశంతోనే శాయశక్తులా కృషి చేస్తాము. అయితే ‘ప్రిన్స్’ స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి అప్పుడు తగిన సమయం లేదు. ఇప్పుడు ‘ఫంకీ’కి తగిన సమయం తీసుకొని, మంచి స్క్రిప్ట్ ని సిద్ధం చేశాము.

‘ఫంకీ’ కథ మొదట ఎవరికి వినిపించారు?
నిర్మాత నాగవంశీ గారికి మొదట ఈ కథ వినిపించాను. ఆయనకు కథ నచ్చి, వెంటనే సినిమా చేయడానికి అంగీకరించారు.

త్రివిక్రమ్ గారు సినిమా చూశారా?
నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో త్రివిక్రమ్ గారు సినిమా చూశారు. ఆయనకు సినిమా నచ్చింది. కొన్ని విలువైన సూచనలు చేశారు.

నిర్మాత చినబాబు(ఎస్.రాధాకృష్ణ) గారి గురించి?
ఈ సినిమా కోసం చినబాబు గారితో ఎంతగానో ప్రయాణం చేశాను. సినిమాకి సంబంధించిన అన్ని విషయాలు ఆయనతో చర్చించేవాడిని. ఆయన పలు సలహాలు, సూచనలు ఇచ్చేవారు.

నరేష్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది?
నరేష్ గారి పాత్ర చాలా బాగుంటుంది. ఆ పాత్ర రాసుకునేటప్పుడే ఆయనైతే బాగుంటుంది అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి నరేష్ గారంటే అభిమానం. ‘జాతిరత్నాలు’ కోసం ఆయనతో కలిసి పనిచేశాను. ఇప్పుడు మరోసారి కలిసి పని చేయడం సంతోషంగా ఉంది.

భీమ్స్ సిసిరోలియో సంగీతం గురించి?
భీమ్స్ గారితో పనిచేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఆయన దర్శకులకు విలువ ఇస్తారు, ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఫంకీ సినిమాకు ఆయన అద్భుతమైన సంగీతం అందించారు.

సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉంది?
సినిమా నిడివి 2 గంటల 5 నిమిషాలు. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా చూసి చాలా బాగుంది అన్నారు.

మీ తదుపరి చిత్రాలు?
మూడు నిర్మాణ సంస్థలలో సినిమాలు చేయాల్సి ఉంది. ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ కథ రాస్తున్నాను. అలాగే, వెంకటేష్ గారి కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నాను.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” సాంగ్స్ లాంఛ్

Next Post

WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

Next Post
WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి: ప్రీరిలీజ్‌ వేడుకలో అతిథులు

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి: ప్రీరిలీజ్‌ వేడుకలో అతిథులు

by Maari
March 4, 2026
0

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసే పర్‌ఫెక్ట్‌ సినిమా – దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసే పర్‌ఫెక్ట్‌ సినిమా – దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌

by Maari
March 2, 2026
0

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి ‘విశ్వనాథ్ & సన్స్’ టైటిల్ ఖరారు

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి ‘విశ్వనాథ్ & సన్స్’ టైటిల్ ఖరారు

by Maari
March 2, 2026
0

సన్ ఆఫ్ రివ్యూ.. కట్టి పడేసే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్

సన్ ఆఫ్ రివ్యూ.. కట్టి పడేసే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్

by Maari
February 28, 2026
0

‘VISA – వింటారా సరదాగా’ చిత్రం నుండి మధుర గీతం ‘అనగా అనగా అమెరికా’ విడుదల

‘VISA – వింటారా సరదాగా’ చిత్రం నుండి మధుర గీతం ‘అనగా అనగా అమెరికా’ విడుదల

by Maari
February 28, 2026
0

హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

by Maari
February 28, 2026
0

హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నూతన కథాంశంతో కొత్త చిత్రం ప్రారంభం

హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నూతన కథాంశంతో కొత్త చిత్రం ప్రారంభం

by Maari
February 28, 2026
0

హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

by Maari
February 28, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.