ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే భగవాన్’ అనే ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు గోపీ అచ్చర మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే..
మీ నేపథ్యం ఏంటి? సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చారు?
కన్నడలో ఎస్. నారాయణ అనే దర్శకుడి వద్ద పని చేశాను. సుహాస్ నాకు స్కూల్‌లో జూనియర్. ‘కలర్ ఫోటో’ నుంచి సుహాస్‌తో జర్నీ చేస్తూనే ఉన్నాను. ‘రైటర్ పద్మభూషణ్’కి కూడా నేను పని చేశాను.
సుహాస్ కోసమే ఈ కథను రాసుకున్నారా?
ఈ కథను సుహాస్‌ని దృష్టిలో పెట్టుకునే రాశాను. స్క్రిప్ట్‌లో సుహాస్ ఇన్వాల్మ్మెంట్ ఏమీ లేదు. కానీ సెట్స్ మీద మాత్రం తన ఆలోచనల్ని, అభిప్రాయాల్ని పంచుకుంటూ ఉండేవాడు.
ఈ కథలోకి శివానీ నగరం ఎలా వచ్చారు?
‘అంబాజీపేట’తో సుహాస్, శివానీ హిట్ పెయిర్‌గా నిలిచారు. ఆల్రెడీ ఆ జంట జనాల్లో ఓ ముద్రను వేసింది. అందుకే తెలిసిన జంటతోనే వెళ్దామని, శివానీని ఈ చిత్రంలో తీసుకున్నాను.
*‘హే భగవాన్’కి స్పూర్తి ఏంటి?*
సుహాస్ బలమే కామెడీ. అందుకే ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాసుకున్నాను. కామెడీతో పాటుగా ఇందులో మంచి ఎమోషన్స్ ఉంటాయి. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌ని చాలా కొత్తగా చూపించాం. అందరినీ ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది.
*‘హే భగవాన్’ అనే టైటిల్‌కి న్యాయం చేశారా?*
మన జీవితంలో ‘హే భగవాన్’ అని అనుకునే సందర్భాలెన్నో ఎదురవుతాయి. ఈ చిత్రంలోని పాత్రలకి కూడా అలాంటి ఘటనలెన్నో ఎదురవుతాయి. ఈ సినిమాకి ఈ టైటిల్ వంద శాతం సెట్ అవుతుంది.
*‘హే భగవాన్’ ఎలా ఉంటుంది?*
‘హే భగవాన్’లో ఎలాంటి కాంట్రవర్సీలను టచ్ చేయలేదు. స్టార్టింగ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు అంతా కూడా నవ్విస్తాం. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్‌గానే ఉంటుంది. చివర్లో ఓ ఎమోషనల్ టచ్ ఇస్తాం. ఫస్ట్ సీన్‌లోనే కథను ఓపెన్ చేస్తాం.
*నిర్మాతల గురించి చెప్పండి?*
నిర్మాత ఇది వరకు కన్నడలో ఓ సినిమాని చేశారు. తెలుగులో ఆయనకు ఇదే మొదటి సినిమా. ఈ ప్రయాణంలో ఆయన మాకెంతో సపోర్ట్ చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాకి ఏం కావాలో, ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు.
*వంశీ నందిపాటి గారు ఈ సినిమాలోకి ఎలా వచ్చారు?*
వంశీ గారు స్క్రిప్ట్ దశ నుంచీ ఈ ప్రయాణంలో ఉన్నారు. ఆయన సహకారం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ మూవీని కేవలం 36 రోజుల్లోనే పూర్తి చేశాం. వారికి సినిమా చాలా నచ్చింది. అందుకే ఈ మూవీని తీసుకునేందుకు ముందుకు వచ్చారు.
*సుహాస్ పాత్ర గురించి చెప్పండి?*
ఇంత వరకు సుహాస్ పాత్రలు అంటే జనాల్లో ఓ అభిప్రాయం ఉంది. కానీ ఈ సారి వారి అంచనాల్ని తలకిందులు చేసేలా ఉంటుంది. ఇంత వరకు సుహాస్ చేసిన పాత్రల్లా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఇందులోని కారెక్టర్ ఉంటుంది.ఈ మూవీలో సుహాస్ ఆద్యంతం నవ్విస్తూనే ఉంటాడు. నరేష్ గారు, వెన్నెల కిషోర్, హర్ష వర్దన్, అజయ్ ఘోష్ ఇలా అన్ని పాత్రలు అందరినీ అలరిస్తాయి. నరేష్ గారితో పని చేయడం ఓ గొప్ప అనుభూతి.
‘హే భగవాన్’ మ్యూజిక్ గురించి చెప్పండి?
‘హే భగవాన్’ పాటలకు మంచి స్పందన వస్తోంది. ఆల్రెడీ అన్ని పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోనే ఉన్నాయి.
*‘హే భగవాన్’ మీద ఇప్పటి వరకు వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పండి?*
‘హే భగవాన్’ మూవీని ఇప్పటికే చాలా మందికి చూపించాం. సినిమాని చూసిన వారంతా కూడా చాలా ఎంజాయ్ చేశారు. కడుపుబ్బా నవ్వించే చిత్రమని మెచ్చుకున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా అని ప్రశంసలు కురిపించారు.










