సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా పరిచయం అవుతుంది. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా బుధవారంనాడు మాదాపూర్ లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాయని సునీత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ చిత్ర ట్రైలర్ ను ప్రదర్శించారు.
అనంతరం సింగర్ సునీత మాట్లాడుతూ, ఈ మధ్య చాలా తక్కువ సినిమాల్లో చక్కటి భావోద్వేగాలు చూస్తుంటాం. అలా అన్నీ ఎమోషన్స్ చూపించేలా వున్న చిత్రమే ’నిలవే‘. కాలం మారినా ఇంటెన్స్ మ్యూజిక్ అలానే వుంటుంది. నేను ఇక్కడ వుండడానికి కారణం కూడా అదే. నిలవే అనేది అద్భుతమైన ఫొటోగ్రఫీ, దర్శకత్వం, తగిన నటీనటులు వున్న సినిమా ఇది. ఈ సినిమా చూశాను. అర్థవంతమైన సినిమా ఇది. మ్యూజికల్ లవ్ స్టోరీ థియేటర్ లో ఆడేలా ప్రేక్షకులు తీర్పు ఇస్తారని, క్లాసికల్ మూవీస్ సఖి, ఏ మాయే చేశావే తరహాలో మంచి ఫీల్ గుడ్ సినిమా అవుతుందని భావిస్తున్నా. ఇందులోని పాటలు బాగున్నాయని ఓసారి కీరవాణిగారిని వినమంటే ఆయన విని తనవంతు సపోర్ట్ ఇస్తానని ప్రమోషన్ చేయడం కూడా సినిమా పై పాజిటివ్ నెలకొంది. ఈ సందర్భంగా అందరికీ మరోసారి విషెస్ చెబుతున్నానని అన్నారు.
హీరోయిన్ శ్రేయాసి సేన్ మాట్లాడుతూ, సినిమా ఇండస్ట్రీ. లో అతి పెద్దదైన తెలుగు ఇండస్ట్రీలో నాయికగా నటించినందుకు ఆనందంగా వుంది. ఈ సినిమా నేను అంగీకరించడానికి సంగీతమే ప్రధాన కారణం. డైలగ్స్ కూడా ఫీల్ కలిగేలా వున్నాయి. జంజీ జనరేషన్ కు చెందిన మా జనరేషన్ సినిమా ఇది. ఈ సినిమా చూశాక ప్రేమ మీద మంచి అభిప్రాయానికి వస్తారని నమ్ముతున్నాను. ఇంత మంచి సినిమా చేసిన టీమ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.
హీరో సౌమిత్ పోలాడి మాట్లాడుతూ, నేను సినిమాలో వెళుతున్నానని చెప్పినప్పటినుంచీ మా నాన్నగారు ఎంతో సపోర్ట్ చేశారు. నన్ను హీరో, దర్శకుడిగా మార్చింది సాయి కే వెన్నం. చిన్నప్పటినుంచీ నటుడు కావాలనే కోరిక వుండేది. అందుకు నాకు స్పూర్తి మెగాస్టార్ చిరంజీవిగారే. ఫిబ్రవరి 13న నా తొలి సినిమా విడుదలకాబోతుంది నిన్న ప్రీమియర్ వేశాం. అందరూ చాలా బాగుందని అభినందించారు. రేపు ప్రేక్షకులు కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. యాక్షన్ మూవీస్ లో కె.జి.ఎఫ్. ఎలా వుందో లవ్ స్టోరీస్ లో కే జీ ఎఫ్ – నిలవే.
చిత్ర దర్శకుడు సాయి కే వెన్నం మాట్లాడుతూ, 30 లక్షల్లో మంచి సినిమా తీయవచ్చు. కానీ జనాల్లోకి తేవాలంటే కోట్లు ఖర్చుపెట్టాలని ఆమధ్య ఓ దర్శకుడు అన్నారు. మా సినిమా కంటెంట్ సినిమా. ప్రేక్షకులకు మంచి బిలీవ్ నేను ఇవ్వగలిగాను. నాని గారు కోర్ట్ సినిమా తీశాక చూడండి నచ్చకపోతే నా తదుపరి సినిమా చూడకండి అంటూ బెట్ కూడా వేశారు. కానీ మా దగ్గర అలాంటి బెట్ లు లేవు. మా దగ్గర మంచి సినిమా వుంది. దాన్ని మీరు చూసి ఆశీర్వదించండి. ఇందులో అందరూ కొత్తవారు కావచ్చు. అందరి క్రిషితో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గారిని కలిసినప్పుడు ‘ఇక్కడ ఎవరూ క్రిస్టోఫర్ నోలన్ లేరు.. మన సినిమాను మనమే నమ్మాలి. నాకది వర్క్‌వుట్ అయ్యింది. నువ్వు కూడా అదే నమ్ము’ అని చెప్పిన మాట నాలో స్ఫూర్తిని నింపింది’ అని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్: కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ, చక్కటి ఫీలింగ్ తో కూడిన లవ్ స్టోరీ లో సంగీతం కీలకం. చక్కటి సంగీతాన్ని సమకూర్చాను. మా సంగీతాన్ని మెచ్చుకుని కీరవాణిగారి దగ్గరకు చేరేలా చేసిన సునీత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో 11 పాటలున్నా కథతో సాగేవే. వినసొంపుగా వుంటాయి. సంగీత ప్రేమకథా చిత్రాల్లో నిలవే చిత్రం కేజీఎఫ్ లాంటి సినిమా అని తెలిపారు.
నిర్మాత రాజ్ అల్లాడ మాట్లాడుతూ, నిన్ననే ప్రీమియర్ వేశాం. మంచి స్పందన వచ్చింది. చక్కటి మ్యూజికల్ లవ్ స్టోరీ. కొత్తవారైనా అందరూ బాగా నటించారు. హీరో కమ్ దర్శకుడు కూడా పాత్రలో లీనమై మురిపించాడు. ఇందులో నటించిన నటీనటులకు, సాంకేతితిక సిబ్బంది పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత మాధురి, నటి సత్య శ్రీ, ఆర్ అండ్ ఎ ట్రావెల్స్ అనురాధా, ప్రవీణ కడియాల, ప్రొడ్యూసర్ గిరిధర్ రావు, నటుడు రూపేష్ తదితరులు మాట్లాడుతూ, బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా రూపొందిన నిలవే చిత్రం, భావోద్వేగాలతో పాటు కొత్త ఆలోచనలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారని వెల్లడించారు. చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.










