నిరంజన్, గ్రీష్మ నేత్రికా , ప్రియ జస్పర్, దీప్తి శ్రీరంగం హీరో హీరోయిన్స్ గా జి సినిమా బ్యానర్ పై నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్న సినిమా “రుక్మిణి”. ఈ చిత్రానికి శ్రీమతి నేలబల్లి కుమారి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సరికొత్త హారర్ కామెడీ కథతో దర్శకుడు సింహాచలం గుడుపూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రోజు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా “రుక్మిణి” మూవీ టీజర్ విడుదల చేశారు. అనంతరం
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ – రుక్మిణి సినిమా టీజర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాతో నిరంజన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా అతనికి మంచి సక్సెస్ ఇవ్వాలి. టీజర్ చూస్తుంటే డైరెక్షన్, డీవోపీ వర్క్, మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నట్లు తెలుస్తోంది. “రుక్మిణి” సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా అన్నారు.
హీరో నిరంజన్ మాట్లాడుతూ – మా “రుక్మిణి” మూవీ టీజర్ లాంఛ్ చేసిన మనోజ్ గారికి చాలా థ్యాంక్స్. ఆయన మా సినిమా టీజర్ బాగుందని చెప్పడం సంతోషంగా ఉంది. నాకు ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఒక డిఫరెంట్ హారర్ కామెడీ మూవీగా రుక్మిణి మీ అందరినీ ఆకట్టుకుంటుంది అన్నారు
హీరోయిన్ గ్రీష్మ నేత్రికా మాట్లాడుతూ – మేమంతా ఎంతో ప్యాషనేట్ గా చేస్తున్న చిత్రమిది. మా సినిమాకు మీ అందరి సపోర్ట్ ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని మంచి మూవీస్ చేస్తాం. మా మూవీ టీజర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ అందించిన మనోజ్ గారికి థ్యాంక్స్ అన్నారు.
హీరోయిన్ ప్రియ జాస్పర్ మాట్లాడుతూ – రుక్మిణి మూవీ టీజర్ లాంఛ్ చేసిన మనోజ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ మా మూవీకి ఉండాలి. వీలైనంత త్వరలో మీ ముందుకు రుక్మిణి చిత్రంతో రాబోతున్నాం అన్నారు.
యాక్టర్ విఖ్యాత్ మాట్లాడుతూ- ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను. నటుడిగా నాకు మంచి పేరు తెచ్చే మూవీ అవుతుందని నమ్ముతున్నాం. రుక్మిణి మూవీ భయపెడుతూనే మీ అందరినీ నవ్విస్తుంది అన్నారు.
యాక్టర్ జయంత్ మాట్లాడుతూ- రుక్మిణి టీజర్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఈ సినిమాలోని స్ట్రాంగ్ కంటెంట్ మిమ్మల్ని ఆద్యంతం ఎంగేజ్ చేసేలా ఉంటుంది. కథా బలమున్న మా సినిమాను మీరు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాం అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ – రుక్మిణి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా సాంగ్స్, బీజీఎం మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయి. టీజర్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది అన్నారు.
నిర్మాత కట్టా గంగాధర్ రావు మాట్లాడుతూ – మా రుక్మిణి మూవీ టీజర్ ను మంచు మనోజ్ గారు రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. మోహన్ బాబుగారి సినిమాలకు అప్రెంటిస్ గా వర్క్ చేయడంతో నా కెరీర్ మొదలైంది. ఈ మూవీ కథను దర్శకుడు సింహాచలం చాలా బాగా చెప్పారు. అంతే బాగా రూపొందిస్తున్నారు. మా మూవీకి డీవోపీ వర్క్, అలాగే మ్యూజిక్ చాలా బాగుంటాయి. బీజీఎం మిమ్మల్ని ఆకట్టుకుంటంది. నిరంజన్, గ్రీష్మ నేత్రిక, ప్రియ జాస్పర్, విఖ్యాత్, జయంత్..ఇలా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మెప్పిస్తారు. త్వరలోనే రుక్మిణి సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం అన్నారు.
డైరెక్టర్ సింహాచలం గుడుపూరి మాట్లాడుతూ – కొత్త వారిని ఎంకరేజ్ చేయడంలో మంచు మనోజ్ గారు ఎప్పుడూ ముందుంటారు. మా మూవీ టీజర్ రిలీజ్ చేసి సపోర్ట్ చేసినందుకు ఆయనకు మా టీమ్ అందరి తరుపున థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ సినిమాతో హీరోగా నిరంజన్ కు మంచి పేరొస్తుంది. మా మూవీ ఇంత బాగా వచ్చిందంటే కారణం మా ప్రొడ్యూసర్స్. వారు ఎంతో ప్యాషనేట్ గా సినిమాను రాజీ పడకుండా నిర్మించారు. త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ తో మీ ముందుకు వస్తాం అన్నారు.
నటీనటులు – నిరంజన్, గ్రీష్మ నేత్రికా , ప్రియ జస్పర్ , దీప్తి శ్రీరంగం, సింహ, విఖ్యాత్, జయంత్, తదితరులు









