• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Thursday, May 21, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఆస్కార్ విజేత చంద్రబోస్ ఆవిష్కరించిన ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ నుంచి ‘న్యాయం చేయరా దేవుడా..’ లిరికల్ సాంగ్‌‌

Maari by Maari
March 18, 2026
in Cinema, Latest News, Movies, news, special
0
ఆస్కార్ విజేత చంద్రబోస్ ఆవిష్కరించిన ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ నుంచి ‘న్యాయం చేయరా దేవుడా..’ లిరికల్ సాంగ్‌‌

Share and Enjoy !

Shares
Twitter

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుo భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రం.. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్ర మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ఇటీవలే మేకర్స్ ప్రారంభించారు. ‘న్యాయం చేయరా దేవుడా..’ డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ డ్యాన్స్ నెంబర్‌‌తో ప్రేక్షకులను అలరించబోతున్నట్లుగా సాంగ్ గ్లింప్స్ వదిలిన మేకర్స్.. తాజాగా ఇదే పాటకు సంబంధించిన ఫుల్ లిరికల్ సాంగ్‌ను ఆస్కార్ విజేత చంద్రబోస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దర్శకనిర్మాతలతో పాటు చిత్రానికి సంబంధించిన పలువురు హాజరయ్యారు.

ఈ పాట ఆవిష్కరణ అనంతరం లిరిసిస్ట్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘ధర్మస్థల నియోజకవర్గం’ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో ‘న్యాయం చేయరా దేవుడా..’ అనే లిరికల్ సాంగ్‌ని విడుదల చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ పాటకు నేనే సాహిత్యం అందించాను. సునీత గారు ఆలపించారు.ఈ సినిమా డైరెక్టర్ జై జ్ఞాన ప్రభ తోట గారు మంచి విజన్ ఉన్న డైరెక్టర్ . ఆయనకు సాహిత్యం పై మంచి పట్టు ఉంది.ఆయనకు తగ్గట్టు మంచి టెస్ట్ ఫుల్ నిర్మాత భాస్కర్ గారు కలిసి నా నుంచి చక్కటి సాహిత్యాన్ని రాబట్టారు. మహావీర్ ఎల్లంధర్ స్వరాలు సమకూర్చారు. సినిమా చాలా బాగుంటుంది. ఇందులో మంచి మెసేజ్ ఉంది. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానని అన్నారు.

చిత్ర దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ.. ‘న్యాయం చేయరా దేవుడా..’ పాటకు లిరిక్స్ అందించడమే కాకుండా, మేము అడగగానే ఆవిష్కరించిన ఆస్కార్ విజేత చంద్రబోస్ గారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సినిమాకు ఆయన ఎంతగానో ప్రోత్సాహం అందించారు. ఒక డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ చిత్రంలో సీనియర్ నటులైన సాయికుమార్, సుమన్‌లతో పాటు యంగ్ హీరోస్ కూడా నటిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు లేని విధంగా.. డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ తో ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నారు. ఈ సాంగ్‌‌తోనే మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మొదలు పెట్టబోతున్నాం. ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చేలా ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. చంద్రబోస్ గారి లిరిక్స్, స్టార్ సింగర్ సునీత ఆలపించిన పాటలు ఈ చిత్రానికి మరో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. అన్ని హంగుల‌తో ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నాం. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు.

సంగీత దర్శకుడు మహావీర్ ఎల్లెందర్ మాట్లాడుతూ.. నేను సంగీతాన్ని అందించిన ధర్మ స్థల నియోజక వర్గం సినిమా నుండి ఈ రోజు ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్ర బోస్ గారు స్వరపరిచిన న్యాయం చేయరా దేవుడా సాంగ్ ఆయన చేతుల మీదుగా విడుదల చేయడం అదృష్టం గా భావిస్తున్నాను. ఈ చిత్రంలోనీ పాటలన్నీ చాలా వైవిద్యం గా ఉంటాయి. ప్రతి ఒక్కరికి నచ్చేలా మా చిత్రం లోని పాటలను డైరెక్టర్ గారు చిత్రీకరించారు. ఈ చిత్రం డెఫినెట్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను.అన్నారు

చిత్ర నిర్మాత మేరుం భాస్కర్ మాట్లాడుతూ.. సినిమా అంతా అద్భుతంగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా అభ్యర్థనను మన్నించి, సాంగ్ విడుదల చేసిన చంద్రబోస్ గారికి కృతజ్ఞతలు. ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం. దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట ప్రతీది చాలా క్లారిటీగా ఇందులో చూపించారు. త్వరలోనే టీజర్ లాంచ్ చేసి, విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు.

సాయికుమార్, సుమన్, నటరాజ, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల , కాలకేయ ప్రభాకర్, పృథ్వి, శివ తదితరులు నటించిన ఈ చిత్రానికి

లిరిక్స్: చంద్రబోస్,
సింగర్: సునీత,
డి ఓ పి: వెంకట హనుమ,
ఫైట్స్: నందు మాస్టర్,
కొరియోగ్రఫీ: శ్రష్టి వర్మ,
డైలాగ్స్: అస్లాం,
ఎడిటింగ్: సాయిబాబు తలారి,
సంగీతం: మహావీర్ ఎల్లంధర్,
ఆర్ట్: భార్గవాచారి నౌండ్ల ,
పి ఆర్ ఓ: బి. వీరబాబు,
నిర్మాత: మేరుo భాస్కర్,
స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జై జ్ఞాన ప్రభ తోట.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

రిలీజ్ కి ముందు “యూత్” సందడి..!

Next Post

ఉస్తాద్ భగత్ సింగ్: పవర్ ప్యాక్డ్ రివ్యూ

Next Post
ఉస్తాద్ భగత్ సింగ్: పవర్ ప్యాక్డ్ రివ్యూ

ఉస్తాద్ భగత్ సింగ్: పవర్ ప్యాక్డ్ రివ్యూ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

“సమ్మర్ హాలిడేస్” మూవీ నుంచి “మన శంకర వరప్రసాద్ గారు” మూవీ ఫేమ్ బాలనటి ఖుషి బర్త్ డే పోస్టర్ రిలీజ్

“సమ్మర్ హాలిడేస్” మూవీ నుంచి “మన శంకర వరప్రసాద్ గారు” మూవీ ఫేమ్ బాలనటి ఖుషి బర్త్ డే పోస్టర్ రిలీజ్

by Maari
May 19, 2026
0

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

by Maari
May 19, 2026
0

చిన్న హీరో – పెద్ద సహాయం నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

చిన్న హీరో – పెద్ద సహాయం నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

by Maari
May 19, 2026
0

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’

by Maari
May 17, 2026
0

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్

by Maari
May 16, 2026
0

‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రీకరణలో అదొక మెమరబుల్ మూమెంట్.. నటుడు ప్రదీప్ కొట్టె

‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రీకరణలో అదొక మెమరబుల్ మూమెంట్.. నటుడు ప్రదీప్ కొట్టె

by Maari
May 16, 2026
0

సందడిగా   డబ్బింగ్ కళాకారులకు “వాగ్దేవి అవార్డ్స్ ” ప్రదానం

సందడిగా డబ్బింగ్ కళాకారులకు “వాగ్దేవి అవార్డ్స్ ” ప్రదానం

by Maari
May 11, 2026
0

హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

by Maari
May 11, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.