నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ అతిథులుగా ఘనంగా “అహోం” సినిమా ప్రారంభోత్సవం
వివేక్ మిశ్రా, శృతిక జంటగా నటిస్తున్న సినిమా “అహోం”. ఈ చిత్రాన్ని ఈగల్ ఐ స్టూడియో ఇంటర్నేషనల్ బ్యానర్ పై దశరథ్ నిర్మిస్తున్నారు. ప్రసాద్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో సినిమా తెరకెక్కనుంది. నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిథులుగా ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో
నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ – డైరెక్టర్ ప్రసాద్ రాజు మంచి అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన దర్శకత్వంలో ఈ సినిమా పలు భాషల్లో రూపొందడం సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు సినిమా ఒక్క భాషలో చేస్తే వర్కవుట్ కావడం లేదు. హిందీతో పాటు దక్షిణాది అన్ని ప్రధాన భాషల్లో “అహోం” సినిమాను రూపొందిస్తున్నారు. బెంగాళీ, మరాఠీ వంటి భాషలతో పాటు ఈ చిత్రానికి ఇంగ్లీష్ లోనూ డబ్ చేయాలని సూచిస్తున్నా. నిర్మాత దశరథ్ గారికి కంగ్రాట్స్. కొత్త నిర్మాతలు బాగుంటేనే మరిన్ని చిత్రాలు తెరకెక్కి ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్న వారికి ఉపాధి కల్పిస్తాయి. “అహోం” సినిమా మంచి విజయం సాధించాలని కోరుతున్నా. అన్నారు.
హీరోయిన్ శృతిక మాట్లాడుతూ – “అహోం” చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు నన్ను నాయికగా ఎంచుకున్న మా డైరెక్టర్ ప్రసాద్ రాజు గారికి థ్యాంక్స్. ఈ చిత్రం కోసం కష్టపడి పనిచేయాలని అనుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.
హీరో వివేక్ మిశ్రా మాట్లాడుతూ -హైదరాబాద్ అంటే మూవీస్, మ్యూజిక్ కన్సర్ట్స్ లకు ఫేమస్. మా మూవీలో నటించేందుకు ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. ఒకప్పుడు హిందీ సినిమా, తెలుగు సినిమా అని పిలుచుకునేవాళ్లం. ఇప్పుడు మన సినిమా వరల్డ్ సినిమా అయ్యింది. ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. అన్నారు.
ప్రముఖ మోడల్ దీప్తి మాట్లాడుతూ – “అహోం” చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు నన్ను ఆహ్వానించిన దర్శకుడు ప్రసాద్ రాజు గారికి థ్యాంక్స్. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు ఆజాద్ మాట్లాడుతూ – ఈ చిత్రానికి మంచి టైటిల్ పెట్టుకున్నారు. హీరో హీరోయిన్స్ జంట కూడా బాగుంది. ప్రసాద్ రాజు గారు అనుభవం ఉన్న దర్శకుడు. ఆయన ఒక సక్సెస్ ఫుల్ పాన్ ఇండియా మూవీ చేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
నటుడు విశ్వ మాట్లాడుతూ – ప్రసాద్ రాజు గారు దర్శకత్వం అవకాశం కోస చాలాకాలంగా వేచి చూస్తున్నారు. ఆయనకు ఈ సినిమాతో మంచి అవకాశం దక్కింది. ఈ సినిమా పేరులోనే పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. నాకు ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేసే అవకాశం కలిగింది. అన్నారు.
నటుడు కోటకొండ కృష్ణ మాట్లాడుతూ – నాకు నటుడిగా మొదటి అవకాశం కల్పించింది ప్రసాద్ రాజు గారే. ఆయన మహానంది సినిమాలో నాకు నటుడిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత 25 చిత్రాల్లో నటించాను. ప్రసాద్ రాజు గారు తెరకెక్కిస్తున్న “అహోం” నా 26వ సినిమా కావడం సంతోషంగా ఉంది. అన్నారు.
హైదరాబాద్ యూత్ ఐకాన్ వినయ్ మాట్లాడుతూ – ప్రసాద్ రాజు గారు ఈ చిత్రంతోనే కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తున్నారని అనుకోవద్దు. ఆయన గతంలో తను పనిచేసిన ఎన్నో చిత్రాల్లో ఎంతోమంది న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేశారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న “అహోం” సినిమా పెద్ద విజయం సాధించాలి. అన్నారు.
నటుడు శాండీ మాట్లాడుతూ – ఈ మూవీలో వర్క్ చేసే అవకాశం రావడం ఎగ్జైటింగ్ గా ఉంది. మా హీరో హీరోయిన్స్ తో పాటు డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి, మీడియా మిత్రులకు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
డైరెక్టర్ ప్రసాద్ రాజు గారు మాట్లాడుతూ – నేను సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు తప్పకుండా వస్తానని ప్రారంభోత్సవానికి వచ్చిన మా వినాయక్ గారికి, కేఎస్ రామారావు గారికి థ్యాంక్స్. సినిమా బాగుంటే ప్రేక్షకుల చూస్తారు. ప్రతి ఫిలింమేకర్ తమ సినిమా బాగుండాలనే రూపొందిస్తాడు. నేనూ అలాగే ఒక మంచి సినిమా చేయాలని ఈ మూవీ మొదలుపెట్టాను. మా మూవీకి ఎలాంటి విజయం అందించాలి అనేది ప్రేక్షక దేవుళ్ల మీద ఆధారపడి ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం. అన్నారు.
ప్రొడ్యూసర్ దశరథ్ మాట్లాడుతూ – “అహోం” సినిమాను మా ఈగల్ ఐ స్టూడియో ఇంటర్నేషనల్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నాం. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో మా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సరికొత్త కథా కథనాలతో మా దర్శకుడు ప్రసాద్ రాజు సినిమాను రూపొందిస్తున్నారు. మీ అందరి సపోర్ట్ మా మూవీకి ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటీనటులు – వివేక్ మిశ్రా, శృతిక, అజయ్ ఘోష్, శాండీ, కోటకొండ కృష్ణ, తదితరులు
టెక్నికల్ టీమ్
కొరియోగ్రాఫర్ -ఎంఆర్ బి
ఫైట్స్ – జయరాం
లిరిక్స్ – శ్రీరామ్ తపస్వి
ఎడిటర్ – శివ శర్వాణి
మ్యూజిక్ – వివేక్ – పునీత్
డీవోపీ – వెంకట్ ఆనెం
బ్యానర్ – ఈగల్ ఐ స్టూడియో ఇంటర్నేషనల్
నిర్మాత – దశరథ్
పీఆర్ఓ – వీరబాబు
స్క్రిప్ట్, డైరెక్షన్ – ప్రసాద్ రాజు










