హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ తక్కువ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తు భారతదేశంలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మక వి ఎఫ్ ఎక్స్ సినిమాగా నిర్మించబడుతున్న సినిమా “ఫస్ట్ టైం”. నేడు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మరియు సాంగ్ లాంచ్ ఘనంగా జరిగాయి. ఈ సినిమాలో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతుండగా ‘బిగ్ బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ గా అనిక్క విక్రమన్ హీరోయిన్ గా ఇతర ముఖ్య పాత్రల్లో మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు నటిస్తున్నారు. శ్రీ వెంకట్ మరియు సూరజ్ ఎస్ కురుప్ సంగీతాన్ని అందించగా వేణు మురళీధర్ మరియు రామ్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు.
AI ని ఎక్కడ ఇన్వాల్వ్ చేయకుండా HI( హ్యూమన్ ఇంటలిజెన్స్) తో హై రేంజ్ గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఘనంగా జరిగింది. ఈవెంట్ కి అతిథులుగా సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు, బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి గారు,జీ చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ విచ్చేయగా ముఖ్యఅతిథిగా అందాల తార పాయల్ రాజ్ పుత్ విచ్చేశారు.
ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ : “నేను చిత్ర పరిశ్రమకు వచ్చి 50 సంవత్సరాలు. ఇప్పటికి నేనే పెళ్లి చేసుకోవాలంటే కష్టం కానీ రాజమౌళి గారిని ఆదర్శంగా తీసుకుని హేమంత్ ఒకరే ఒక సినిమాకు సంబంధించిన ఎన్నో పనులు చేయడం అందరం అభినందించవలసిన విషయం. ఓ సరికొత్త కథతో కొత్త కాన్సెప్ట్ తో కొత్త కుర్రాళ్ళు చేసే ప్రయత్నాన్ని అందరం అభినందించవలసిన విషయం. ఈ నెల 22వ తేదిన రానున్న ఫస్ట్ టైం చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ చూసి సినిమాకు మంచి విజయం అందించాలని కోరుకుంటున్నాను” అన్నారు .
సంగీత దర్శకుడు శ్రీ వెంకట్ మాట్లాడుతూ : “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. ఈ సినిమాకు హేమంత్ గారు మూల స్తంభం వంటి వారు. సినిమాకు కావలసిన సంగీతాన్ని ఆయన దగ్గర ఉంది చేయించుకున్నారు. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. మీడియా వారు సినిమా విజయానికి సహకరించాలని కోరుకుంటున్నాను. నన్ను నమ్మినందుకు హేమంత్ గారికి థాంక్స్” అన్నారు.
నటి గాయత్రి గుప్తా మాట్లాడుతూ : “సహజంగా సమాజంలో ఒక మార్పు రావాలంటే ప్రత్యేకమైన మనుషుల వల్లనే అవుతుంది. అటువంటి వ్యక్తులు దువ్వాడ శ్రీనివాస్ గారు, మాధురి గారు. పాయల్ ఎంతో బలమైన వ్యక్తిత్వం కలిగిన వ్యతి. ఇటువంటి కొత్త తరహా చిత్రాన్ని తీయడం, హేమంత్ గారు అన్ని చూసుకోవడం చాలా గొప్ప విషయం. 22న ఈ సినిమాను అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నటి అనిక్క విక్రమన్ మాట్లాడుతూ : “మా సినిమాకు ముందు నుంచి అండగా నిలబడిన పాయల్ కు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ థాంక్స్. సినిమాను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
జీ చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ మాట్లాడుతూ : “ఈ సినిమాను మొదలు నుండి చూస్తున్నాను. ఈ సినిమా పూర్తిగా హేమంత్ గారి కష్టమే. హీరో మీద ఆధారపడి సినిమాలు నడుస్తున్న ఈ సమయంలో దర్శకుడు సినిమాగా తెరకెక్కనున్న సినిమా ఫస్ట్ టైం. ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ చాలా బలం. సినిమా ద్వారా అందరికీ మంచి పేరు వస్తుంది. ఇటువంటి సినిమాను ప్రోత్సహిస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి” అన్నారు.
దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి మాట్లాడుతూ : “ఈ సినిమాకు వెనుక ఉండి మాకు దైర్యం ఇచ్చిన వ్యక్తి పాయల్. ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థాంక్స్. అందరూ ఈ సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను అందరూ సినిమా థియేటర్ లో చూడాలి” అన్నారు.
బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి మాట్లాడుతూ : “ఫస్ట్ టైం చిత్రం సనాతన ధర్మానికి, ఆధునికతకు అద్దం పట్టేలా ఉంది. ఒక సినిమా చేయడంలో ఎంత కష్టం ఉంటుందో చూస్తున్నాను. ఈ సినిమా చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ : “అందరికీ నమస్కారం. ఒక సినిమాకు రచన, దర్శకత్వం, నిర్మాణం, ఎడిటింగ్ వంటి ఎన్నో పనులు ఒకరే చేయడం చాలా కష్టం. అటువంటి హేమంత్ గారు ఈ సినిమా చేయడం గొప్ప విషయం. ఈ విశ్వంలో అందరికంటే పైన ఉండే బ్రహ్మ దేవున్ని చూపిస్తూ, ఈ విశ్వాన్ని ఎలా ముందుకు నడిపిస్తారో చూపిస్తున్నట్లు ఉంది. థియేటర్ కి వెళ్ళి ఈ సినిమా చూడతాగినట్లు ఉంది. మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నటుడు సౌరబ్ ధింగ్ర మాట్లాడుతూ : “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ థాంక్స్. మాకు వెన్నుండి మా సినిమాను మార్కెట్ లోకు తీసుకుని వెళ్ళిన మా స్పందన గారికి స్పెషల్ థాంక్స్. ఈ సినిమా కోసం మా దర్శకుడు తమ కుటుంబానికి దూరంగా ఉండి ఎంతో కష్టపడ్డారు. ఈ కార్యక్రమానికి వచ్చి అతిధులుగా వచ్చి మా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వెళ్లేందుకు తోడ్పడినందుకు చాలా థాంక్స్. నాకు ప్రతి విషయంలో నాకు అండగా నిలబడి నన్ను ప్రోత్సహిస్తూ వచ్చిన పాయల్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంతకాలం నీ వల్ల నేను గర్వపడ్డాను, ఇప్పుడు నా వల్ల నువ్వు గర్వపడేలా చేస్తాను” అన్నారు.
నటి పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ : “అందరికి నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చి మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి థాంక్స్. ముందుగా దర్శకులు హేమంత్ గారికి ఆల్ ది బెస్ట్. ఆయన ఈ సినిమా కోసం సర్వం పెట్టీ పని చేశారు. విడుదల తర్వాత ఈ సినిమాలో ముఖ్యంగా విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడతారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రికార్డు సృష్టిస్తుంది. అలాగే చిత్రంలో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు వస్తుంది అని అర్థం అవుతుంది. సౌరబ్ గురించి చెప్పాలి అంటే సినిమా అనేది ఒక ప్రతిజ్ఞలా తీసుకుని ఈ సినిమా కోసం పని చేశారు. చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను” అంటూ ముగించారు.
నటీనటులు :
సౌరబ్ ధింగ్ర హీరోగా, అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ గా అనిక్క విక్రమన్ హీరోయిన్ నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు నటిస్తున్నారు.
సాంకేతిక వర్గం :
రచయిత ఎడిటర్ విఎఫ్ఎక్స్ లీడ్ నిర్మాత మరియు దర్శకుడు : హేమంత్ ఇప్పలపల్లి
సంగీతం : శ్రీ వెంకట్ మరియు సూరజ్ ఎస్ కురుప్
సినిమాటోగ్రఫీ : వేణు మురళీధర్ మరియు రామ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి. రాజశేఖర్
పి ఆర్ ఓ : ఎస్ నాగేశ్వరరావు (ఎస్ ఎన్ ఆర్)
మార్కెటింగ్ పార్టనర్ : పుష్యమి మీడియా
పబ్లిసిటీ డిజైనర్ : వెంకట్ మజ్జి
Grand Pre-Release Event and Song Launch of the Movie “First Time”
The pre-release event and the launch of the song “Ee Pilla Nenu Anukoneledu” for the upcoming movie “First Time” were celebrated grandly. Written, directed, edited, and produced by Hemanth Ippalapalli, the film is made on a low budget but boasts high technical values. It is being promoted as one of India’s most prestigious VFX-heavy films, uniquely created entirely with Human Intelligence (HI) rather than using AI for its high-end graphics.
The movie is scheduled to hit theaters on the 22nd of this month. Thammareddy Bharadwaj, Ex MLC Duvvada Srinivas, Bigg Boss Fame Divvela Madhuri and Gorgeous Heroine Payal Rajput attended as Chief Guests for the event.
Senior Producer Thammareddy Bharadwaj : “He praised director Hemanth for taking on multiple responsibilities (like director S.S. Rajamouli) and applauded the fresh concept brought by the young team. He urged the audience to watch the film on the 22nd and make it a success”.
Music Director Sri Venkat : “Saying Hemanth the pillar of the movie, he thanked the director for his trust on his musical work. He expressed confidence that the audience would love the film and requested media support”.
Artist Gayatri Gupta : “She appreciated the efforts of the director and praised strong personalities like Duvvada Srinivas, Madhuri, and Payal. She requested the audience to support this new kind of cinema”.
Actress Anicka Vikraman : “She thanked Payal Rajput for her constant support from the very beginning and asked for the audience’s blessings”.
Zee Chief Editor Bharat Kumar : “He noted that in an era of hero-centric films, ‘First Time’ is a true director’s film. He highlighted the VFX as a major strength and stated that encouraging such films will lead to more good cinema”.
Director Producer Hemanth Ippalapalli : “He credited Payal Rajput as the backbone who gave the team courage. He thanked everyone for their support and requested audiences to experience the film in theaters”.
Bigg Boss Fame Divvela Madhuri : “She mentioned that the film perfectly reflects a blend of Sanatana Dharma and modernity. She wished the entire team a great success”.
Former MLC Duvvada Srinivas, “He appreciated the director’s massive effort in handling multiple crafts single-handedly. He noted that the film beautifully portrays Lord Brahma and the functioning of the universe, making it a must-watch in theaters”.
Actor Saurabh Dhingra : “He thanked Spandana for taking the film to the market and praised the director for sacrificing family time to work on the film. He expressed a heartfelt thanks to Payal Rajput for her constant encouragement, saying, “Till now I was proud of you; now I will make you proud of me”.
Actress as Chief Guest Payal Rajput : “She wished the director the best, noting that he gave his all for this project. She confidently stated that post-release, the film’s VFX will be the talk of the town, create box-office records, and bring great recognition to the cast”.
Cast :
Saurabh Dhingra, Akhil Sarthak, Anicka Vikraman, Mime Gopi, Shiva, Bhupal Raju, Gayatri Gupta, Annapurnamma, Ajay Ratnam, Dhee Pandu & others.
Technical Crew :
Writer, Editor, VFX Lead, Producer & Director: Hemanth Ippalapalli
Music Directors: Sri Venkat, Sooraj S Kurup
Cinematography: Venu Muralidhar and Ram
Executive Producer: P. Rajasekhar
PRO: S. Nageswara Rao (SNR)
Marketing Partner: Pushyami Media
Publicity Designer: Venkat Majji









