రాజుబాబు జయంతి అందరికీ స్ఫూర్తినివ్వాలి
– స్మారక అవార్డుల ప్రదానంలో టి.డి. జనార్థన్ –
రాజుబాబు జయంతిని ప్రతీసంవత్సరం ఆయన మిత్రులు జరపటం ఎంతో సముచితంగా ఉందని, ఇది అందరికీ మార్గదర్శనం కావాలని పలువురు వక్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.
టి.వి., సినిమా నటుడు రాజుబాబు 69వ స్మార్థక అవార్డుల కార్యక్రమం శనివారం నాడు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులను ఈ సందర్భంగా సత్కరించారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు టి.డి. జనార్థన్ పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ రాజబాబు జయంతిని ఆయన మిత్రులు జరపటం ఎంతో ఆనందంగా ఉందని, ఇది ప్రతీ వారికీ ఆదర్శం కావాలని తాను ఆకాంక్షిస్తున్నాని చెప్పారు.
ఎన్టీ రామారావును ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ తెలుగు జాతికీ, తెలుగు నేలకు విశేషమైన సేవలందించిన ఎన్టీఆర్ పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో పధకాలని ప్రవేశ పెట్టారని, అలాగే మహిళలకు ఆస్తిలో హక్కును కల్పించారని ఈ సందర్భంగా జనార్థన్ గుర్తుచేశారు. తల్లిదండ్రులు పోయిన తర్వాత పిల్లలు గుర్తు చేసుకోవటంతో పాటు వారిని సంస్మరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని జనార్థన్ హితవు పలికారు.
దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ రాజుబాబు జయంతి వేడుకలకు ప్రతీ సంవత్సరం తాను హాజరవుతున్నానన్ని ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి అవసరమని చెప్పారు.
మరో దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ రాజుబాబు జయంతి వేడుకలు ఆయన మిత్ర బృందం ఎంతో స్ఫూర్తిధాయకంగా నిర్వహిస్తున్నారని, అందుకే తానుకూడా తప్పనిసరిగా ఈ వేడుకలలో పాల్గొంటున్నటు తెలిపారు.
ఇంకా దర్శకులు ఎ. కోదండ రామిరెడ్డి, ప్రదీప్, కాదంబరి కిరణ్ కుమార్, ఎస్.పి. నాగేశ్వరరావు, కోట శంకర రావు, గీతా భాస్కర్, మేఘన ముసునూరి, తోట భావ నారాయణ, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని మల్లిఖార్జున రావు నిర్వహించగా, కాకాని బ్రహ్మం స్వాగతం పలికారు. రమేష్ వందన సమర్పణ చేశారు.










