• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, August 14, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

హుషారు పిట్టలు… యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్

Maari by Maari
August 14, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, Reviews, special, sports
0
హుషారు పిట్టలు… యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్

Share and Enjoy !

Shares
Twitter

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా నటించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘హుషారు పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మించారు. బిక్షు దర్శకత్వం వహించారు. ఇప్పటికే టీజర్… ట్రైలర్ లతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే చాలా చోట్ల ముందస్తు షోలను ప్రదర్శించి అన్ని వర్గాలనుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న చిత్ర యూనిట్… మీడియాకు కూడా ఓ షోను వేసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్‌ – సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ: ఊళ్ళో టెన్త్ క్లాస్ లో స్కూల్ టాపర్ గా నిలుస్తాడు రవి(అన్షు). అయితే ఆ ఊళ్ళోనే ఉండే అంజి అండ్ బ్యాచ్ రవికి సెల్ ఫోన్లో అశ్లీల వీడియోస్ ను బలవంతంగా చూపిస్తూ అతనిని వాటికి అడిక్ట్ అయ్యేలా చేస్తారు. అదే సమయంలో అదే గ్రామానికి చెందిన పుట్ట చిట్టి(వాసవి గణేశన్) రజస్వలం చెంది… స్కూల్ టాపర్ అయిన రవికి ఆకర్షితురాలవుతుంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన ఆకర్షణ కాస్తా… ఇద్దరూ ఒక్కటయ్యేంత వరకూ వెళుతుంది. దాంతో రవి చదువు పక్కదారి పడుతుంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన టీనేజ్ ఆకర్షణ… చివరకు కడుపు తెచ్చుకునే దాకా వెళ్తుంది. దాంతో వీరిద్దరు వివాహం చేసుకోవాలనుకుంటారు. అందుకు పెద్దలు అంగీకరించారా? వీరి టీనేజ్ లవ్ స్టోరీ చివరకు ఎలాంటి మలుపులు తిరిగింది? అసలు పుట్ట చిట్టి అంత చిన్న వయసులోనే శారీరక వాంఛలకు ఎందుకు ఆకర్షితురాలైంది? తదితర వివరాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: నేటి ఆధునిక ప్రపంచ యుగంలో అరచేతిలోనే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత జీవన శైలి గురించి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ సెల్ఫోన్లో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా నీలి చిత్రాలు టీనేజర్స్ ను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో అనేది ఇందులో చూపించిన విధానం చూస్తే తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుస్తుంది. అలాగే రసూల్ యాదవ్ అనే చిన్న పిల్ల వాడు స్కూల్ లో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి గల కారణాలను ఇందులో ప్రస్తావించి… తల్లి తల్లిదండ్రులు తమ వ్యక్తిగత జీవితం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఓ మెసేజ్ రూపంలో చూపించారు. అలాగే పసితనంలో ఓ టీనేజ్ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో ఎలా హద్దులు మీరి ప్రవర్తించిందో…. ఆ సంఘటనలను చూసిన చిన్నారి టీనేజ్ వయసులోకి రాగానే తాను అలాగే ప్రవర్తించాలనుకోవడాన్ని ఇందులో చూపించిన విషయం కూడా పుట్ట చిట్టి క్యారెక్టర్ లో తల్లిదండ్రులకు ఓ మెసేజ్ ఇచ్చారు దర్శకుడు బిక్షు.

సినిమా ఫస్ట్ హాఫ్ అంతా రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసి… సెకండ్ హాఫ్ లో అసలు కథతో ఆడియన్స్ ను కనెక్ట్ అయ్యేలా చేశాడు. మనకు ఈ సినిమా చూసేటప్పుడు గతంలో మనం చూసిన కొన్ని సినిమాలు గుర్తొచ్చినా అవేవి తల్లిదండ్రులకు మెసేజ్ ఇచ్చేంత లేవనే చెప్పాలి. నేటి 5G నెట్ వర్క్ ప్రపంచంలో పిల్లలు తమ తల్లిదండ్రులను ఎలా మోసం చేస్తారు అనేది కూడా చక్కగ చూపించారు. ఓవరాల్ గా టీజర్, ట్రైలర్ లో చూపించిన విధంగా రొమాన్స్ అంత శృతి మించి ఏమీ లేదు. మెసేజ్ ను ఇస్తూ… యూత్ ఫుల్ రొమాటిక్ గా ఎంటర్ టైన్ చేస్థాయి ఈ హుషారు పిట్టలు.

రవి పాత్రలో అన్షు చాలా క్యూట్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. కామెడీ, రొమాన్స్, సంభాషణలు అన్నింటిలోనూ తన ఈజ్ ను చూపించారు. ముఖ్యంగా స్క్రీన్ ప్రెజెన్స్ టీనేజ్ లవ్ స్టోరీస్ కి పెర్ఫెక్ట్ యాప్ట్. అలాగే వాసవి గణేశన్ కూడా తన క్యూట్ నెస్ అండ్ గార్జియస్ లుక్స్ తో యూత్ ను మెస్మరైజ్ చేస్తుంది. హీరోయిన్ తండ్రిగా నటించిన గోవర్ధన్… అతని తండ్రిగా నటించిన వృద్ధుడు కూడా బాగా నటించారు. అలాగే హీరో తండ్రి పాత్రలో నటించిన రమేష్ నకిరే కంటి… అతని భార్య కూడా నిత్యం కలహాలతో ఉండే భార్య భర్తలుగా ఆకట్టుకుంటారు. వీరి చిన్న కుమారుడిగా నటించిన రసూల్ యాదవ్ పాత్ర కూడా కథలో భాగమైంది. కుర్రాడు తన పాత్రకు న్యాయం చేశాడు. శైలజ పాత్రలో నటించిన అమ్మాయి కూడా బాగా ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలన్నీ కూడా తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.

దర్శకుడు బిక్షు… తాను చూసిన కొన్ని వాస్తవిక సంఘటనలను బేస్ చేసుకుని రాసుకున్న ఈ సినిమా కథ… కథనాలు నేటి యువతను ఆకట్టుకునే విధంగా వెండి తెరపై ఆవిష్కరించి సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ లో కొంత రొమాన్స్ ను పదే పదే చూపించి… ఇంక కథ ముందుకు పోదా అనే అభిప్రాయంతో ఉన్న ప్రేక్షకులకు సెకండ్ హాఫ్ లో అసలు స్టోరీతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి సంగీతం కూడా ప్రధాన బలం చేకూర్చింది. పాటలు బాగున్నాయి. జంటను అందంగా, క్యూట్ గా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యారు. ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్..!!!

రేటింగ్: 3.25

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

Next Post

అగధ(Agadha) మూవీ రివ్యూ: మిస్టరీ, దైవశక్తి, హారర్‌తో థ్రిల్ చేసే ‘అగధ’

Next Post
అగధ(Agadha) మూవీ రివ్యూ: మిస్టరీ, దైవశక్తి, హారర్‌తో థ్రిల్ చేసే ‘అగధ’

అగధ(Agadha) మూవీ రివ్యూ: మిస్టరీ, దైవశక్తి, హారర్‌తో థ్రిల్ చేసే ‘అగధ’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

అగధ(Agadha) మూవీ రివ్యూ: మిస్టరీ, దైవశక్తి, హారర్‌తో థ్రిల్ చేసే ‘అగధ’

అగధ(Agadha) మూవీ రివ్యూ: మిస్టరీ, దైవశక్తి, హారర్‌తో థ్రిల్ చేసే ‘అగధ’

by Maari
August 14, 2026
0

హుషారు పిట్టలు… యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్

హుషారు పిట్టలు… యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్

by Maari
August 14, 2026
0

ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

by Maari
August 12, 2026
0

ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

by Maari
August 12, 2026
0

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక

by Maari
August 12, 2026
0

మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా ట్రైలర్ లాంఛ్

మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా ట్రైలర్ లాంఛ్

by Maari
August 11, 2026
0

నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆధ్వర్యంలో పద్మశ్రీ మురళీమోహన్ కు ఘన సన్మానం

నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆధ్వర్యంలో పద్మశ్రీ మురళీమోహన్ కు ఘన సన్మానం

by Maari
August 11, 2026
0

రాజు బొనగాని దర్శకత్వంలో ఆఫ్టర్ ఇంజనీరింగ్ నూతన చిత్రం

రాజు బొనగాని దర్శకత్వంలో ఆఫ్టర్ ఇంజనీరింగ్ నూతన చిత్రం

by Maari
August 11, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.