• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, August 14, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘అమీర్ లోగ్’ చాలా రియలిస్టిక్‌గా, రా గా అనిపిస్తోంది.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ సాయి మార్తాండ్

Maari by Maari
August 14, 2026
in Cinema, deccanfilm.com, epaper, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
‘అమీర్ లోగ్’ చాలా రియలిస్టిక్‌గా, రా గా అనిపిస్తోంది.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ సాయి మార్తాండ్

Share and Enjoy !

Shares
Twitter

‘అమీర్ లోగ్’ చాలా రియలిస్టిక్‌గా, రా గా అనిపిస్తోంది.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ సాయి మార్తాండ్
‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ‘అమీర్ లోగ్’ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో..

‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ* .. ‘‘అమీర్ లోగ్’ సాంగ్స్ బాగున్నాయి. టీజర్, ట్రైలర్ నాకు నచ్చింది. సాయి స్మరణ్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. హరి నాకు మంచి మిత్రుడు. రమణ రెడ్డి గారు పెద్ద ఆర్కిటెక్ట్. ఆయన ఈ మూవీని ఎంతో అద్భుతంగా తీశారు. ఇది చాలా రియలిస్టిక్‌గా, రా గా అనిపించింది. ‘ఫలక్ నుమా దాస్’ రేంజ్‌లో విజయం సాధిస్తుందనిపిస్తోంది. ఆగస్ట్ 21న రాబోతోన్న ఈ మూవీని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

‘లిటిల్ హార్ట్స్’ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ మాట్లాడుతూ* .. ‘‘అమీర్ లోగ్’లోని ఆర్టిస్టులందరూ సహజంగా అనిపిస్తున్నారు. నా మెంటర్ సాయి స్మరణ్. అతని మ్యూజిక్‌కి నేను చాలా పెద్ద ఫ్యాన్. హరి మంచి ఆర్టిస్ట్, సింగర్. ట్రైలర్ బాగుంది. మంచి బిర్యానీ వాసన వస్తోంది. ఆగస్ట్ 21న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఎంకరేజ్ చేయండి’ అని అన్నారు.

దర్శకుడు రమణ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘అమీర్ లోగ్’ చిత్రం హైదరాబాద్ ప్రజలకు ప్రతీకగా ఉంటుంది. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అందరినీ ఏడ్పిస్తాం, నవ్విస్తాం. కంటెంట్ మీదున్న నమ్మకంతోనే అందరం ఎంతో కాన్ఫిడెంట్‌గా, సంతోషంగా ఉన్నాం. హైదరాబాదీ వైబ్ ఉన్న సినిమా వచ్చి చాలా రోజులు అవుతోంది. ‘డాలర్ డ్రీమ్స్’, ‘పెళ్లి చూపులు’, ‘బలగం’ రేంజ్‌లో మా ‘అమీర్ లోగ్’ ఉంటుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.

నిర్మాత మాధవి రెడ్డి సోమ మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ సినిమా విడుదల చేస్తున్న స్పిరిట్ మీడియాకి థాంక్స్. ఆగస్ట్ 21న మా సినిమాని చూసి ప్రేక్షకదేవుళ్లు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

లైన్ ప్రొడ్యూసర్ శశి మాట్లాడుతూ.. ‘‘అమీర్ లోగ్’కి ఈవెంట్లు చేయొద్దని ఒకప్పుడు అనుకున్నాం. కానీ ప్రతీ ఈవెంట్‌కి మాకు ఓ పండుగలా అనిపిస్తోంది. రమణ ఈ మూవీ కోసం అద్భుతమైన స్టోరీ సెట్ చేసుకున్నారు. ‘అమీర్ లోగ్’ని అద్భుతంగా తెరకెక్కించారు. ఆగస్ట్ 21న రాబోతోన్న మూవీని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటుడు ఎంసి హరి మాట్లాడుతూ.. ‘‘అమీర్ లోగ్’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. హైదరాబాద్ ఎంతో స్పెషలో.. నాకు ఈ సినిమా అంత స్పెషల్. ఈ మూవీతో మా ఇంట్లో ఇద్దరు ఆర్టిస్టులు పరిచయం కాబోతోన్నారు. మా నాన్న కూడా ఈ సినిమాలో నటించారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన రమణ అన్నకి థాంక్స్. నేను బస్తీలో పుట్టి పెరిగాను. ఇప్పుడు ఓ బస్తీ సినిమాతోనే వస్తున్నా. ఆగస్ట్ 21న మా మూవీని అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటుడు మనోజ్ మాట్లాడుతూ.. ‘‘అమీర్ లోగ్’ మూవీని బస్తీలో షూట్ చేశాం. అక్కడ అందరూ మాకెంతో సపోర్ట్ చేశారు. మాకోసం వచ్చిన సింజిత్, సాయి మార్తాండ్‌లకు థాంక్స్. మేం ఈ చిత్రంతో అందరినీ నవ్విస్తాం, ఏడిపిస్తాం. ఆగస్ట్ 21న మా సినిమాని చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

నటుడు శశిధర్ మాట్లాడుతూ.. ‘‘అమీర్ లోగ్’ టీజర్, ట్రైలర్, పాటలు ఎంత బాగున్నాయో.. సినిమా కూడా అంతకంటే ఎక్కువ బాగుంటుంది. ఆగస్ట్ 21న మా చిత్రం రాబోతోంది. అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

వేధ జలంధర్ మాట్లాడుతూ.. ‘‘అమీర్ లోగ్’ చిత్రంలో నేను పోషించిన గీత పాత్ర అందరికీ ఇన్ స్పైరింగ్‌గా ఉంటుంది. ఓ స్ట్రాంగ్ ఉమెన్ పాత్రను పోషించడం ఆనందంగా ఉంది. అంచనాలతో కాకుండా.. ఎక్స్‌పీరియెన్స్ చేయడానికి మా సినిమాకి రండి’ అని అన్నారు.

నటుడు విశ్వేందర్ రెడ్డి మాట్లాడతూ.. ‘‘అమీర్ లోగ్’ సినిమా హైదరాబాద్ సోల్‌ను చూపిస్తుంది. రమణ అన్న చూడటానికి ఎంతో సాఫ్ట్‌గా ఉంటాడు. కానీ లోలోపల అగ్ని పర్వతం ఉంటుంది. ఈ సినిమాలోని ప్రతీ ఫ్రేమ్ అద్భుతంగా ఉంటుంది’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సాయి స్మరణ్ మాట్లాడుతూ.. ‘‘అమీర్ లోగ్’ చిత్రంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా కోసం వచ్చిన సింజిత్, సాయి మార్తాండ్‌కి థాంక్స్. ఆగస్ట్ 21న రాబోతోన్న మా మూవీని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఈ మూవీకి ఎస్వీకే కెమెరావర్క్, రోహిత్ పెనుమత్స ఎడిటింగ్, స్మరణ్ సాయి మ్యూజిక్ ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఆగస్ట్ 21న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

తారాగణం: MC హరి, మనోజ్, శశిధర్ కొచ్చర్లకోట, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి తదితరులు

సాంకేతిక సిబ్బంది:

బ్యానర్: అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్
దర్శకుడు: రమణారెడ్డి సోమ
నిర్మాత: మాధవి రెడ్డి సోమ
సహ నిర్మాత: మనోహర్ రెడ్డి మంచురి
విడుదల: రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా
DOP: SVK
ఎడిటర్: రోహిత్ పెనుమత్స
సంగీతం: స్మరణ్ సాయి
పోస్టర్లు: శక్తి
సింక్ సౌండ్ & మిక్సింగ్: స్వప్నిక్ రావు
చీఫ్ AD: సాయి యోగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ బోరెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: శరత్ పోలవరపు
PRO: సాయి సతీష్
Ameer Log Feels Very Realistic and Raw: Little Hearts Director Sai Marthand at Trailer Launch Event

Ameer Log is produced by Madhavi Reddy Soma under the Awwal Number Productions banner and directed by Ramana Reddy Soma. Manohar Reddy Manchuri is the co-producer. The film features MC Hari, Manoj and Sasidhar in the lead roles, while Vedha Jalandhar, Ravan Nitturu, Vishwender Reddy and Saiyogi play key characters. Rana Daggubati’s Spirit Media is releasing the film in Telugu on August 21. As part of the promotional campaign, the trailer was unveiled on Thursday.

*Speaking at the trailer launch event, Little Hearts’ director Sai Marthand said* : “Ameer Log has good songs. I liked the teaser and trailer. I am a big admirer of Sai Smaran’s music. Hari is a good friend of mine. Ramana Reddy is a great architect, and he has made this film wonderfully. It feels very realistic and raw. I feel it has the potential to achieve success on the lines of Falaknuma Das. I request everyone to watch and support this film when it arrives on August 21.”

*Little Hearts music director Sinjith said* : “All the artistes in ‘Ameer Log’ feel very natural. Sai Smaran is my mentor, and I am a huge fan of his music. Hari is a good artiste and singer. The trailer is good. It gives off the aroma of a delicious biryani. Please watch and encourage the film on August 21.”

*B Ramana Reddy said:* “‘Ameer Log’ represents the people of Hyderabad. The film has all kinds of emotions. We will make audiences laugh and cry. We are all extremely confident and happy because of our belief in the content. It has been a long time since a film with a strong Hyderabadi vibe came along. I believe our ‘Ameer Log’ will be on the lines of ‘Dollar Dreams’, ‘Pelli Choopulu’ and ‘Balagam’.”

*Producer Madhavi Reddy Soma said:* “Thanks to Spirit Media for releasing ‘Ameer Log’. I hope the audience will watch our film on August 21 and support us.”

*Line Producer Shashi said* : “At one point, we thought we shouldn’t hold events for ‘Ameer Log’. But now every event feels like a festival for us. Ramana has created an excellent story for this film and has presented ‘Ameer Log’ wonderfully. I request everyone to watch and support the movie arriving on August 21.”

*Actor MC Hari said* : “I hope everyone will like the ‘Ameer Log’ trailer. Hyderabad is very special, and this film is equally special to me. Two artistes from our family are being introduced through this movie. My father has also acted in the film. Thanks to Ramana Anna for giving us this opportunity. I was born and brought up in a basti, and now I am coming with a film set in a basti. I request everyone to watch and make our movie a success on August 21.”

*Actor Manoj said* : “‘Ameer Log’ was shot in a basti, and everyone there supported us tremendously. Thanks to Sinjith and Sai Marthand for coming here to support us. We will make everyone laugh and cry with this film. Please watch and support our movie on August 21.”

*Actor Sashidhar said* : “Just as the teaser, trailer and songs of ‘Ameer Log’ are good, the movie will be even better. Our film is arriving on August 21, and I hope everyone will support us.”

*Vedha Jalandhar said* : “The character Geetha, which I play in ‘Ameer Log’, will be inspiring to everyone. I am happy to portray a strong woman. Don’t come to the theatre with expectations; come to experience our film.”

*Actor Vishwender Reddy said:* “‘Ameer Log’ showcases the soul of Hyderabad. Ramana Anna appears to be very soft on the outside, but there is a volcano burning within him. Every frame in this film will be wonderful.”

*Music director Sai Smaran said* : “Thanks to everyone who supported me on ‘Ameer Log’. Thanks to Sinjith and Sai Marthand for coming here to support us. I request everyone to watch and support our movie when it arrives on August 21.”

The film’s cinematography by SVK, editing by Rohit Penumatsa and music by Smaran Sai are expected to be among its major highlights. ‘Ameer Log’ is set for a grand theatrical release on August 21.

*Cast* : MC Hari, Manoj, Sasidhar, Vedashree, Raavan Nitturu, Vishwender Reddy, Saiyogi, etc.
 
*Technical Crew:*

Director: Ramana Reddy Soma
Producer: Madhavi Reddy Soma
Co-Producer: Manohar Reddy Manchuri
Release Through: Rana Daggubati’s Spirit Media
DoP: SVK
Editor: Rohit Penumatsa
Music: Smaran Sai
Posters: Shakti
Sync sound & Mixing: Swapnik Rao
Chief AD: Sai Yogi
Executive Producer: Sandeepboreddy
Line Producer: Sarath Polavarapu
PRO: Sai Satish

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘అమీర్ లోగ్’ చాలా రియలిస్టిక్‌గా, రా గా అనిపిస్తోంది.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ సాయి మార్తాండ్

‘అమీర్ లోగ్’ చాలా రియలిస్టిక్‌గా, రా గా అనిపిస్తోంది.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ సాయి మార్తాండ్

by Maari
August 14, 2026
0

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

by Maari
August 14, 2026
0

పోతరాజు ఆహార్యంలో  లెజండరీ నటుడు రియల్‌స్టార్‌ డా. శ్రీహరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన భైరవకాళి ఫ్లిక్స్ బ్యానర్‌ !

పోతరాజు ఆహార్యంలో లెజండరీ నటుడు రియల్‌స్టార్‌ డా. శ్రీహరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన భైరవకాళి ఫ్లిక్స్ బ్యానర్‌ !

by Maari
August 14, 2026
0

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ: సూర్య నటన అదుర్స్.. వెంకీ అట్లూరి మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్!

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ: సూర్య నటన అదుర్స్.. వెంకీ అట్లూరి మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్!

by Maari
August 14, 2026
0

అగధ(Agadha) మూవీ రివ్యూ: మిస్టరీ, దైవశక్తి, హారర్‌తో థ్రిల్ చేసే ‘అగధ’

అగధ(Agadha) మూవీ రివ్యూ: మిస్టరీ, దైవశక్తి, హారర్‌తో థ్రిల్ చేసే ‘అగధ’

by Maari
August 14, 2026
0

హుషారు పిట్టలు… యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్

హుషారు పిట్టలు… యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్

by Maari
August 14, 2026
0

ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

by Maari
August 12, 2026
0

ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

by Maari
August 12, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.